For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam.. కార్తీక్ కుటుంబంలో మరో బాంబు పేల్చిన మోనిత.. టెన్షన్‌లో దీప, సౌందర్య

  |

  అత్యంత ప్రేక్షకదారణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌లో జైలులో ఉన్న డాక్టర్ మోనిత మరో ట్విస్టు ఇచ్చింది. కార్తీక్ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వను. వారి జీవితాల్లో ఓ బాంబు పేలుస్తాను అంటూ చెప్పిన మోనిత.. అన్నంత పని చేసింది. కానిస్టేబుల్‌ సుకన్య సహాయంతో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఓ వార్తను పేపర్లో పబ్లిష్ చేసింది. ఆ పేపర్‌లో పబ్లిష్ అయిన వార్త ఏమిటంటే.. సెప్టెంబర్ 28న ప్రసారమైన ఎపిసోడ్ 1156 ఏం జరిగిందంటే..

  నా బిడ్డకు తండ్రి అతనే...

  నా బిడ్డకు తండ్రి అతనే...

  నా బిడ్డకు తండ్రి అతనే.. ఓ డాక్టర్ వింత ప్రేమ కథ అనే వార్త పేపర్ల రావడం, ఆ వార్త కింద మోనిత ఫోటో ఉండటం చూసి కార్తీక్ కంగారు పడిపోయారు. కార్తీక్ విపరీతమైన టెన్షన్‌లో కనిపించాడు. చెమటలు పట్టడంతో ముఖాన్ని తుడుచుకొంటుండగా.. దీప అక్కడికి వచ్చి.. కార్తీక్‌లో కంగారును చూసింది. ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే.. పేపర్ చేతిలో పెట్టాడు.

  ఆ వార్తను చూసిన దీప కూడా షాక్ అయింది. అప్పుడే అక్కడకు వచ్చిన కూతురు శౌర్య చూసి ఇది నిజమేనా అంటూ ప్రశ్నించింది. దాంతో కార్తీక్ నో అంటూ గట్టిగా అరిచాడు. అయితే పిల్లలకు తెలుస్తే ఎలా ఉంటుందనే భ్రమలో కంగారుపడిపోయినట్టు కనిపించాడు.

  మోనిత నిర్వాకంతో కార్తీక్ టెన్షన్

  మోనిత నిర్వాకంతో కార్తీక్ టెన్షన్

  మోనిత నిర్వాకంతో కార్తీక్ కుటుంబం దిగ్బ్రాంతికి గురైంది. పేపర్లో పడితే మన ప్రతిష్ట, గౌరవం ఏమౌతుంది అంటూ దీప కంగారు పడిపోతే.. సౌందర్య కూడా ఆ వార్తను చూసి షాక్ తిన్నారు. అయితే మోనిత ఇలాంటి పనిచేస్తుందని ముందే ఊహించాను. వీధిలో ప్రతిష్ట కంటే.. మోనిత విషయంలో జాగ్రత్త పడాల్సిందే అంటూ సౌందర్య చెప్పింది. పేపర్లో వచ్చిన వార్తను పిల్లల కంటపడకుండా జాగ్రత్తగా ఈ పేపర్ దాచిపెట్టు అంటూ దీపను సౌందర్య అప్రమత్త చేసింది.

  దీపకు గిఫ్ట్ చేరిందా అంటూ

  దీపకు గిఫ్ట్ చేరిందా అంటూ

  జైల్లో ఉన్న మోనిత పేపర్లో వచ్చిన వార్తను చూసి సంతోషపడిపోయింది. దీపకు గిఫ్ట్ చేరి ఉంటుందా? కార్తీక్ ఈ విషయం చూసి ఉంటాడా అంటూ మోనిత ఆనందంలో మునిగిపోయింది. కార్తీక్ నిన్ను అర్జెంట్‌గా చూడాలని ఉంది. జైల్లో ఉన్నా.. మరెక్కడో ఉన్నా నేను చూడాలనుకొంటే చూసేస్తాను. నిన్ను చేరడానికి నా ప్రేమ సహకరిస్తుంది. అందుకోసం సోడా సుకన్య హెల్ప్ తీసుకొంటాను అంటూ మోనిత సంతోషంలో మునిగిపోయింది.

  ఎవరు అడ్డుపడినా.. నా ప్రేమను..

  ఎవరు అడ్డుపడినా.. నా ప్రేమను..

  జైల్లో పేపర్ చదువుతూ.. కార్తీక్ తలచుకొంటేనే ఉత్తేజం కలుగుతుంది. కార్తీక్ ప్రేమ వల్లే నాకు సంతోషం ఉంది. ప్రేమ, కాదల్, లవ్ అంటే నాకు కార్తీక్. ప్రేమ అంటే అన్నీ కాలాల్లో వీచే ఆక్సిజన్ లాంటింది. ప్రేమ అంటే జీవితాంతం ఒక వ్యక్తిని విచ్చలవిడిగా ప్రేమించడం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కార్తీక్. ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చాను. ఎవరు అడ్డుపడినా.. కార్తీక్‌పై ఉన్న ప్రేమనే నన్ను గెలిపిస్తుంది. నా ప్రేమను గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి పేరు తెచ్చుకొంటాను. ప్రపంచంలో అత్యుత్తమ ప్రేమికురాలు అనే అవార్డు నాకే ఇవ్వాలి అంటూ మోనిత జైలులో సంతోషపడిపోయింది.

  మేము ముగ్గురం.. మాకు ముగ్గురు..

  మేము ముగ్గురం.. మాకు ముగ్గురు..

  కార్తీక్, దీపకు శౌర్య, హిమ ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు ఓ ఆడపిల్లో.. మగ బిడ్డో పడుతాడు. దాంతో వారికి ఓ తమ్ముడు ఉంటాడు. వారు ముగ్గురు.. నేను, దీప, కార్తీక్ మేము ముగ్గరం అవుతాం. నా ప్రేమ గురించి మరింత తెలుసుకోవాలని అనుకొంటున్నారా? వచ్చే సంచికలో చదవండి అంటూ మోనిత ఇచ్చిన ఇంటర్వ్యూ దీప, సౌందర్య, కార్తీక్‌లో అలజడి రేపింది. మోనిత వ్యవహారం పిల్లలకు తెలియకుండా చేయాలని జాగ్రత్తలు తీసుకొన్నారు.

  కార్తీక్ విషయం తెలిసి పిల్లలు..

  కార్తీక్ విషయం తెలిసి పిల్లలు..

  కానీ మోనిత, కార్తీక్ వ్యవహారం గురించి పేపర్లలో వచ్చిన వార్త శౌర్య, హిమ కంటపడింది. తండ్రి గురించి పేపర్లో వచ్చిన వార్తను చూసి పిల్లలు కూడా షాక్ అయ్యారు. మోనిత ఆంటిని నాన్న నిజంగా మోసం చేశాడా అంటూ పిల్లలు అనడం కనిపించింది. ఇలాంటి అంశాలను తాజా ప్రోమోలో చూపించి తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచారు.

   టెలివిజన్ ఇండస్ట్రీలో ఏ సీరియల్ సాధించనట్టుగా

  టెలివిజన్ ఇండస్ట్రీలో ఏ సీరియల్ సాధించనట్టుగా

  తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో గతంలో ఏ సీరియల్ సాధించని రేటింగును కార్తీకదీపం సొంతం చేసుకొన్నది. కార్తీకదీపం సీరియల్ ఈ ఏడాది 37వ వారంలో రూరల్ ప్రాంతంలో 19.17, అర్బన్ ప్రాంతంలో 18.25 రేటింగును సాధించడం రికార్డుగా మారింది. ఇక 36వ వారంలో రూరల్ ప్రాంతంలో 13.26 రేటింగ్, అర్బన్‌లో 17.94 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

  English summary
  Karthika Deepam September 28th Episode preview. Monita was produced in the court in Cheating case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X