Karthika Deepam weekly roundup మోనిత ఎత్తుకు దీప పై ఎత్తు.. డైలమాలో కార్తీక్
కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ గతం మరిచిపోయిన నేపథ్యంలో భారీ ట్విస్టులతో కొనసాగుతున్నది. కార్తీక్ గతం మరిచిపోవడం, దీప తన డాక్టర్ బాబు కోసం వెతకడం.. కార్తీక్‌ను తన వాడిగా చేసుకొనేందుకు మోనిత ప్రయత్నాలు.. సౌందర్య కుటుంబంలో ఎమోషన్స్ లాంటి అంశాలు మరింత టిస్టులుగా మారాయి. దీప, కార్తీక్, మోనిత రీ ఎంట్రీ అంశాలు సీరియల్‌లో ఆసక్తికరమైన పరిణామాలుగా మారాయి. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు సాగిన ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

ఆగస్టు 29 తేదీ 1143 ఎపిసోడ్‌లో
యాక్సిడెంట్ తర్వాత కార్తీక్‌ను తన ఆధీనంలో ఉంచుకొని గతం గుర్తుకు రాకుండా మందులిస్తున్న మోనితకు చిక్‌మంగళూరులో సౌందర్య ఫ్యామిలీ ఎదురుపడింది. సౌందర్య ఫ్యామిలీతో మోనితకు ఘాటుగా వాదనలు జరిగాయి. అయితే మోనిత ఆ ప్రాంతంలో ఉండటంపై సౌందర్యకు అనుమానం వచ్చింది. ఇక ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు వెళ్దాం అని కార్తీక్ చెప్పడంతో మోనితకు గుండెల్లో రాయిపడినట్టు అయింది.

ఆగస్టు 30 తేదీ 1144 ఎపిసోడ్‌లో
మోనిత వద్దే కార్తీక్ ఉన్నాడనే విషయం దీపకు తెలియడంతో దిగ్బ్రాంతికి గురైంది. నేరు మోనిత ఇంటికి వెళ్లి కార్తీక్‌ను డాక్టర్ బాబు అంటూ పిలిచింది. అయితే తాను డాక్టర్ బాబును కాదంటూ కార్తీక్ అన్నాడు. మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పడంతో దీప షాక్ తిన్నది. దీపను ఇంటి నుంచి బయటకు నెట్టించేయడంతో దీపకు ఏం చేయాలో తెలియలేదు.

ఆగస్టు 31 తేదీ 1145 ఎపిసోడ్‌లో
కార్తీక్ విషయంలో దీపకు, మోనితకు భారీగా వాగ్వాదం జరిగింది. తన కుటుంబాన్ని కించపరిచినట్టు మాట్లాడటంతో మోనిత గొంతు పిసికి చంపే ప్రయత్నం దీప చేసింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్ ఈ జన్మలో నావాడే అంటూ మోనిత గట్టిగా చెప్పింది. అయితే దీపపై మోనిత అరుస్తుండటం చూసి... ఎందుకు అలా అరుస్తున్నావు.. నీ పేరు మోనితే కదా అని కార్తీక్ అనడంతో మోనిత కంగారుపడింది. మా అనుబంధమే కార్తీక్‌ను, నన్ను దగ్గరకు చేరుస్తుందని దీప బదులిచ్చింది.

సెప్టెంబర్ 1వ తేదీ 1146 ఎపిసోడ్‌లో
ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్ ప్రేమ పొందలేకపోవడంపై మోనిత కంగారుపడింది. దాంతో కార్తీక్‌ను తన బుట్టలో వేసుకొనేందుకు మోనిత మరోసారి అబద్దాలు చెబుతూ డాక్టర్ బాబును తనవైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. మనకు ఓ బిడ్డ ఉన్నాడు. నీకు యాక్సిడెంట్ సమయంలో నీ గురించి ఆలోచిస్తుంటే.. మన బిడ్డను మనకు దక్కకుండా పోయాడని చెప్పింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన

సెప్టెంబర్ 2వ తేదీ 1147 ఎపిసోడ్‌లో
వంట చేస్తుంటే.. తన చేతికి కాలిందని నాటకం ఆడిన మోనితకు కార్తీక్ షాకిచ్చాడు. వంటలక్కను పనిమనిషిగా పెట్టుకొనేందుకు సిద్దమయ్యాడు. అయితే ఒకరి ఇంట్లో వంట మనిషిగా పనిచేయడం నా వల్ల కాదు అంటూ దీప నిరాకరించింది. అయితే అవసరమైనప్పుడల్లా బిర్యాని, మంచి భోజనం తెచ్చి పెడుతాను అని దీప చెప్పింది. మోనిత ఇంట్లోకి వచ్చి కార్తీక్‌ను భోజనం వడ్డించడం ట్విస్టుగా మారింది.

సెప్టెంబర్ 3వ తేదీ 1148 ఎపిసోడ్‌లో
మోనిత ఇంట్లో కార్తీక్‌కు బిర్యానీ వడ్డిస్తూ.. గతాన్ని గుర్తు చేసే ప్రయత్నాలు దీప చేసింది. తనకు రకరకాల పేర్లు ఉన్నాయి. నా పేరు దీప.. మా అత్తయ్య కోడలా అని, నా కూతురు శౌర్య అమ్మా. అని.. మరో కూతురు హిమ వంటలక్క అని పిలుస్తుంది అని దీప చెబుతుంటే... మోనిత అడ్డుపడింది. కార్తీక్‌కు గతం గుర్తుకు వస్తుందనే భయంతో కంగారు పడింది. ఇంకా ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..


Click it and Unblock the Notifications











