Karthika Deepam: లేట్ అయితే.. ప్రాణాలు తీస్తాను.. రిస్క్‌తో జైలుకు వెళ్లకు.. కార్తీక్‌కు మోనిత వార్నింగ్

కార్తీకదీపం సీరియల్‌లో హత్యకేసు ఆరోపణలతో లాకప్‌లో ఉన్న కార్తీక్‌‌ను అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌‌కు తరలించిన విషయంత తెలిసిందే. అయితే మోనిత కుట్రలో భాగంగానే హాస్పిటల్‌కు వచ్చానని కార్తీక్ షాక్ తిన్నాడు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోకపోతే నీ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని మట్టుబెడుతానని హెచ్చరించింది. అంతేకాకుండా తన మెడలో తాళి కడితే నీవు, నీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారు. అలాగే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా నీవు మిగిలి ఉంటావు అని కార్తీక్‌ను మోనిత బ్లాక్ మెయిల్ చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్ 1136లో ఏం జరిగిందంటే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

మోనిత బ్లాక్ మెయిల్ చేసి

మోనిత బ్లాక్ మెయిల్ చేసి

మోనిత బ్లాక్‌మెయిల్ వ్యవహారం కార్తీక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మోనిత బ్లాక్ మెయిల్‌కు అసలు లొంగను. నేను కాంప్రమైజ్ కాను. దీపకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయను. ఇన్నాళ్లు దీప అనుభవించిన నరకం చాలూ. పొరపాటున కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోను అని కార్తీక్ అన్నారు. ఇక మోనిత ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ రత్నసీత .. కార్తీక్‌తో పెళ్లి విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇన్ని రోజులు ఒంటరిగానే ఉన్నారు. కార్తీక్‌ను పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యారు. ఇక పెళ్లి చేసుకోకుండానే పుట్టబోయే బిడ్డతో నీవు ఒంటరిగాను ఉండు. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు అంటూ సలహా ఇస్తే.. మోనితన ఫైర్ అయింది. నీవు కాబట్టి వదిలేస్తున్నాను. ఇలాంటి సలహా ఎవరైనా ఇస్తే నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అంటూ ఆవేశపడింది. దాంతో రత్నసీత బెదిరిపోవడంతో మోనిత తమాయించుకొని నిన్నేం చేయను అంటూ కూల్ చేసింది.

కార్తీక్ కోసమే ఇదంతా అంటూ మోనిత ఆగ్రహం

కార్తీక్ కోసమే ఇదంతా అంటూ మోనిత ఆగ్రహం


రత్నసీతతో మోనిత మాట్లాడుతూ.. నేను బతుకుతున్నదే కార్తీక్ కోసం. అలాంటిది నేను కార్తీక్‌ను వదిలి బిడ్డతో ఎలా ఉండాలి. ఈ జీవితం కేవలం కార్తీక్ కోసమే. అలాంటి సలహా మరోసారి ఇవ్వకు. అలాంటి ఆలోచనను ఇక కలలో కూడా రానివ్వకు అని మోనిత చెప్పింది. దాంతో మీరు పట్టుబట్టి ఉన్నారు. కానీ ఆయనేమో పట్టించుకోవడం లేదు. మీ కోరిక తీరుతుందా అని రత్న సీత అంటే.. తప్పకుండా తీరుతుంది. ఎలా అనేది డౌటా? అది కూడా చెబుతాను. కార్తీక్ తన కంటే.. తన ఫ్యామిలీని ఇష్టపడుతాడు. తన ఫ్యామిలీ కోసం.. దీప కోసం ఏదైనా చేస్తాడు. కాబట్టి ఆ ఫ్యామిలీని సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని కార్తీక్‌ను నావాడిని చేసుకొంటాను. హస్పిటల్ నుంచి కోర్టుకు వెళ్లే లోపే అదను చూసి కార్తీక్‌ను భయపెట్టాలి అంటూ మోనిత తన ప్లాన్‌ను బయటపెట్టింది. నేను చెప్పింది నీవు చేస్తే చాలూ.. మిగితాది అంతా నేను ప్లాన్ చేస్తాను అని మోనిత చెప్పింది.

షాక్‌లో కార్తీక్.. దీప ఆందోళన

షాక్‌లో కార్తీక్.. దీప ఆందోళన

హాస్పిటల్‌లో ఉన్న కార్తీక్‌ వద్దకు దీప వచ్చింది. అయితే ఒక రకమైన షాక్‌లో ఉండగా.. దీప అతడిని మందలించింది. కడుపులో ఉన్న నొప్పికి.. కలవరపాటుకు తేడా ఉంటుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు అంటూ అడిగితే.. మీకు అలా అనిపించి ఉంటుంది అంటే.. మీలో కంగారు కనిపించింది అంటూ దీప చెప్పింది. అయితే డాక్టర్‌గా తనకు ట్రీట్‌మెంట్ చేస్తున్నది మోనిత అనే విషయం చెబితే... దీప మళ్లీ ఏదో చేసి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి చెప్పకూడదు అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

మోనిత బతికే ఉందంటూ..

మోనిత బతికే ఉందంటూ..

అయితే కార్తీక్ ఏదో దాచిపెడుతున్నారనే విషయాన్ని గ్రహించిన దీప.. నాకు చెప్పకుండా ఏదో దాచి పెడుతున్నారు అని నిలదీసింది. అయితే అలాంటిదేమీ లేదంటూ కార్తీక్ చెప్పడానికి ప్రయత్నిస్తే.. మీకు మనుషుల మీద నమ్మకం పోయిందా అంటూ నిలదీసింది. అయితే నీకు కాకుండా ఎవరికి చెప్పుకోలేను. కానీ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నీకు సోదెమ్మలో మోనిత కనిపిస్తే.. నాకు టీ తెచ్చిన అమ్మాయి మోనిత అనే అనుమానం కలిగింది. రత్నసీత ముూగ అమ్మాయి అని చెప్పింది. కానీ గాజు పెంక గుచ్చుకోగానే.. ఆమె అబ్బా అంటూ అరిచింది అని కార్తీక్ చెప్పాడు. దాంతో మోనిత బతికే ఉంది.. కానీ నా కళ్లు మోసం చేయవు అని దీప చెప్పింది. అయితే మోనిత బతికే ఉందని, విషయాన్ని చెబితే నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందని కంగారు పడిపోయాడు.

కార్తీక్ ఆలోచించుకో అంటూ వార్నింగ్

కార్తీక్ ఆలోచించుకో అంటూ వార్నింగ్


అదే సమయంలో కార్తీక్ దీర్ఘాలోచనతో నిద్రలోకి జారుకొన్న కొద్ది సేపటికే తన సోదరుడికి యాక్సిడెంట్ అయిందనే పీడకల వచ్చింది. దాంతో ఒక్క ఊదుటన లేచాడు. ఆ కలవరం చూసి ఆందోళనకు గురైన దీప ఏం జరిగిందంటే.. ఎవరో మన కుటుంబంలోని వ్యక్తికి ప్రమాదం జరిగింది అంటూ చెప్పాడు. అంతలోనే వార్డుబాయ్ వచ్చి డాక్టర్ రీనా ఫోన్ అంటూ ఇచ్చాడు. ఫోన్‌లో మోనిత బ్యాడ్ న్యూస్ చెప్పిన విషయాలు విని షాక్ గురయ్యాడు. మీ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించాననే విషయాన్ని చెప్పింది. ఇక ఆలోచించుకో.. ఆలస్యం అయిన కొద్ది ప్రాణాలే తీయాల్సి వస్తుంది. ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టి జైలుకు వెళ్లకు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అంటూ సలహా ఇచ్చింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
ఆదిత్యకు యాక్సిడెంట్ కావడంతో

ఆదిత్యకు యాక్సిడెంట్ కావడంతో


ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ విషయం కార్తీక్‌తోపాటు ఆయన కుటుంబంలో కూడా ఆందోళనకు గురిచేసింది. తన వద్ద ఉన్న దీపను ఇంటికి వెళ్లి ఆదిత్యను, శ్రావ్యను చూసుకో అని చెప్పి పంపించాడు. ఆదిత్య కట్టుకట్టుకొని ఉండటం చూసి దీప బాధకు గురైంది. ఆదిత్యను చూసి శౌర్య, హిమ బాధపడిపోయారు. మన కుటుంబంలో ఏం జరుగుతున్నది అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X