twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam: ఇదే చివరి అవకాశం.. కార్తీక్‌కు మోనిత వార్నింగ్.. ఏసీపీపై దీప ఫైర్!

    |

    కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి మోనిత తన కుట్రలకు పదును పెట్టింది. కార్తీక్‌ను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెయిల్ కోసం ప్రయత్నించిన ఆదిత్య యాక్సిడెంట్‌కు గురికావడంతో కార్తీక్ కుటుంబ ఆందోళనకు గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో కానిస్టేబుల్ రత్నసీతతో ఏసీపీ రోషిణి పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజా ఎపిసోడ్ 1137లో ట్విస్టు చోటుచేసుకొన్నది. ఇంకా తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

     కార్తీక్‌కు మోనిత ఫోన్ చేసి..

    కార్తీక్‌కు మోనిత ఫోన్ చేసి..

    నా పెళ్లి ప్రపోజల్‌ను ఒప్పుకోకపోతే.. నీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరిని చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంపై కార్తీక్ ఆందోళన పడ్డాడు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? నా ఫ్యామిలీని ఎలా సేఫ్ చేయాలి? అంటూ హాస్పిటల్‌లో కార్తీక్ మదనపడిపోయాడు. ఆ సమయంలోనే డాక్టర్ రీనా మేడమ్ పేరుతో మోనిత కాల్ చేసింది. అయితే తాను నిద్రపోతున్నానని చెప్పమంటే.. పోలీసు కానిస్టేబుల్ ఎందుకు బయపడుతారు.. మీరు మాట్లాడండి అంటూ ఫోన్ ఇవ్వడంతో మోనితతో కార్తీక్ మాట్లాడేందుకు సిద్దమయ్యారు.

     నేను నీ రెండో భార్యను అంటూ

    నేను నీ రెండో భార్యను అంటూ

    కార్తీక్‌తో మోనిత మాట్లాడుతూ.. నేను.. నీ కాబోయే భార్యను. నా మాట విని అంత కంగారు ఎందుకు పడుతున్నావు? నీవు అలా కంగారు పడితే ఎస్సైకి అనుమానం రాదా? ఇప్పుడే నీ మొదటి పెళ్లాం వెళ్లినట్టు ఉంది? అందుకే రెండో పెళ్లాం ఫోన్ చేసింది. ఇక నేను ఫోన్ చేయడానికి ముఖ్య కారణం ఉంది. పంతులు గారిని అడిగితే.. రేపు ఉదయం దివ్యమైన ముహుర్తం ఉంది. ఆ సమయంలో తాళి కట్టకపోతే నీవు జైలుకు, నీ కుటుంబ సభ్యులు పైకి పోతారు. కాబట్టి దివ్యమైన ముహుర్తంలో నీవు తాళి కడితే.. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఇదే నేను నీకు ఇచ్చే చివరి అవకాశం అంటూ మోనిత ఫోన్ పెట్టేసింది.

     కార్తీక్‌ను రిమాండ్‌కు పంపిస్తారని సౌందర్య

    కార్తీక్‌ను రిమాండ్‌కు పంపిస్తారని సౌందర్య

    ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ కావడంపై కార్తీక్ ఫ్యామిలీలో ఆందోళన వ్యక్తమైంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందని సౌందర్య అడిగితే... కార్తీక్‌ విడిపించడానికి బెయిల్ కోసం వెళితే బైక్ నుంచి కిందపడిపోయాడు. అలాగే కార్తీక్‌కు బెయిల్ లభించడం కష్టమని లాయర్ కూడా చెప్పాడు. కార్తీక్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ఆనందరావు చెప్పారు. దాంతో సౌందర్య కంగారుపడిపోయింది. బెయిల్ లభించకపోతే రిమాండ్‌కు పంపిస్తారు. కార్తీక్ తప్పు చేయలేదని అనిపిస్తుంది అంటూ సౌందర్య మదనపడిపోయింది.

    ఏసీపీపై ప్రశ్నల దీప వర్షం

    ఏసీపీపై ప్రశ్నల దీప వర్షం

    కార్తీక్ గురించి మాట్లాడేందుకు ఏసీపీ రోషిణి వద్దకు దీప వెళ్లింది. అయితే కోర్టులో ప్రవేశించే ముందుు ముద్దాయిల ఫ్యామిలీతో మాట్లాడను అని దీప అంటే.. ముద్దాయి అని ముద్ర వేసే ముందు.. మీరు ఎక్వైరీ చేసి ఏం కనిపెట్టారు అంటూ దీప ప్రశ్నించింది. కడుపు నొప్పితో బాధపడుతున్న కార్తీక్‌ను బాధ తగ్గినా ఇంకా ఎందుకు హాస్పిటల్‌లో ఉంచారు. ఎందుకు ఉంచారు? ఎవరు ఉంచారు అంటూ దీప ప్రశ్నించింది. కడుపు నొప్పి తగ్గినా ఇంకా డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. అందుకే ఆయనను అక్కడే ఉంచాం అని ఏసీపీ రోషిణి అన్నారు. కార్తీక్‌కు ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా ఎందుకు అక్కడే ఉంచుతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. నీకు, మీ అత్తగారికి లాపాయింట్ బాగా తెలుసు అంటూ ఏసీపీ రోషిణి కోపగించుకొన్నది.

    గిల్లీ జోలపాడటం ఎందుకు? అంటూ రోషిణి

    గిల్లీ జోలపాడటం ఎందుకు? అంటూ రోషిణి

    గిల్లి జోలపాడటం ఎందుకులే.. నీకు ఉన్న అనుమానాలు ఎమిటో చెప్పు అంటూ ఏసీపీ రోషిణి అంటే.. మోనిత బతికే ఉంది అని దీప చెప్పింది. ఇంకా నీకు ఏం అనుమానాలు ఉన్నాయో చెప్పు. ప్రశ్నించే హక్కు అందరికి ఉన్నాయి చెప్పు. అది నీ అనుమానామా? అని ఏసీపీ అంటే.. మోనిత బతికే ఉందనేది నా నమ్మకం. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు బసవయ్య కూతురుగా వచ్చి టీ ఇచ్చింది మోనితనే. ఏ పాపం తెలియన కార్తీక్‌కు శిక్షపడుతుంది. కాబట్టి మీకు చేతనైన న్యాయం చేయండి. ఆ దిశగా ఆలోచించండి అంటూ ఏసీపీకి దీప సూచించింది.

     రత్నసీతను ప్రశ్నించిన ఏసీపీ రోషిణి

    రత్నసీతను ప్రశ్నించిన ఏసీపీ రోషిణి

    దీప మాటలతో ఏసీపీ రోషిణి ఆలోచనల్లో పడింది. కానిస్టేబుల్ రత్నసీతను పిలిచి మన స్టేషన్‌లో ఏం జరుగుతున్నది? చనిపోయిన వ్యక్తి మళ్లీ కనిపించాడంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ ఏసీపీ ప్రశ్నిస్తే.. రత్నసీత కంగారు పడిపోయింది. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికి రావడం ఏమిటి మేడమ్ అంటూ రత్నసీత కంగారుపడిపోయింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి టీ ఇచ్చి వెళ్లిపోయిందని కార్తీక్ చెబుతున్నాడు అనగానే రత్నసీత మరింత షాక్ అయింది. మోనిత వచ్చినట్టు చెబుతున్న రోజు సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు అని ఏసీపీ ప్రశ్నిస్తే.. ఆ రోజు కెమెరాలు సర్వీస్‌కు ఇచ్చాం అని రత్న సీత సమాధానం చెప్పింది. ఆ రోజే సీసీటీవీలు పనిచేయలేదా అంటూ ఏసీపీ అనుమానం వ్యక్తం చేసింది.

    Recommended Video

    Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
     మోనిత పెళ్లి సంబురాల్లో

    మోనిత పెళ్లి సంబురాల్లో

    ఇదిలా ఉండగా, పెళ్లి కోసం మోనిత ఇంట్లో ముస్తాబవుతున్నది. తాళిబొట్టు, నగలు, చీరలను అలకరించుకొంటూ ఆనందపడిపోయింది. కాసేపట్లో మోనిత.. మోనిత కార్తీక్.. శ్రీమతి కార్తీక్ కాబోతున్నది. తాళి బొట్టుతో మోనిత నిండుగా కనిపిస్తుంది. కడుపులో ఉన్న బిడ్డను ఆనంద్ అని పలకరించింది. మా మామయ్య పేరు ఆనంద్‌గా పెట్టుకొంటాను. నీవు సౌందర్య, ఆనందరావుల రెండో మనవడివి అంటూ మోనిత మురిసిపోయింది.

    English summary
    Karthika Deepam September 6th Episode preview. Latest episode of 1137 goes once again with emotional content. Karthik worried about Deepa and his family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X