Karthika Deepam: దీపకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మోనిత.. ఇక కార్తీక్‌తో పెళ్లి కుట్రలకు చెక్?

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత విషయం గందరగోళంగా మార్చింది. మోనిత చనిపోలేదు.. బతికే ఉంది అని కార్తీక్, దీప చెప్పిన మాటలతో ఏసీపీ రోషిణిలో అంతర్మథనం మొదలైంది. మోనిత బతికే ఉందని బలంగా చెబుతున్న నేపథ్యంలో ఆమెకు పోలీసుల్లో ఎవరైనా సహాయం చేస్తున్నారా అనే అనుమానాలు ఏసీపీలో తలెత్తడాయి. దాంతో కానిస్టేబుల్ రత్నసీత, ఎస్సైని పిలిచి విచారింది. మోనిత పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన రోజు సీసీటీవీ ఫుటేజ్‌లు లభించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజా ఎపిసోడ్‌ 1138‌లో ఇంకా ఏం జరిగాయంటే..

ఏసీపీ రోషిణిలో అనేక అనుమానాలు

ఏసీపీ రోషిణిలో అనేక అనుమానాలు

కార్తీక్, దీప చెప్పిన విషయం నిజమే అయితే.. మోనితకు మన పోలీస్ స్టేషన్‌లో పనిచేసే వాళ్లు సహాయం చేస్తున్నారా? అదే రోజు సీసీటీవీలు రిపేర్‌కు తీసుకెళ్లారంటే పోలీసులు ఎవరైనా సహాయం చేసి ఉంటారా? అదే రోజు మోనిత వచ్చి వెళ్లిందనుకోవాలా? అని ఏసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కానిస్టేబుల్ రత్నసీతకు చెమటలు పట్టేశాయి. తాను సహాయం చేస్తున్న విషయం బయటపడితే ఎలా అనే విషయంపై ఆమె ఆందోళనకు గురైంది. ఆ తర్వాత రత్నసీతను అక్కడి పంపించి మోనిత బతికే ఉందా అనే ఆలోచనల్లో పడింది.

మోనితను పట్టి రోషిణికి అప్పగిస్తా..

మోనితను పట్టి రోషిణికి అప్పగిస్తా..

మోనిత బెదిరింపులతో కార్తీక్‌కు తలపగిలిపోయినంత పనైంది. కార్తీక్‌ పరిస్థితిని చూసి.. బయటకు కనిపించేలా టెన్షన్ పడుతున్నారు. మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది అని దీప అంటే.. నా టెన్షన్ అంతా నీ కోసం, నా ఫ్యామిలీ కోసం అని కార్తీక్ అంటే... నిరపరాధికి శిక్ష పడదు అంటూ దీప కొంచెం ధైర్యం చెప్పింది. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి కోర్టులో హాజరుపరుస్తారు అంటూ దీప చెప్పింది. దాంతో అవును.. నా గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి అని అంటే.. మోనిత బతికే ఉందని మీరు గట్టిగా నమ్మితే చాలూ.. దానిని ఎక్కడ ఉన్న దానిని పట్టి తీసుకొచ్చి ఏసీపీ రోషిణి ముందు పడేస్తాను అని దీప చెప్పింది.

మోనిత మేడమ్ మీకో దండం అంటూ

మోనిత మేడమ్ మీకో దండం అంటూ

కార్తీక్‌తో పెళ్లి అని తాళిని పట్టుకొని మురిసిపోతున్న సమయంలో మోనిత వద్దకు కానిస్టేబుల్ రత్న సీత వచ్చింది. దాంతో ఈ రోజు నా పెళ్లి.. కానీ నిన్ను పిలువలేకపోతున్నాను. బంధుమిత్రులతో కలిసి చేసుకోవాల్సిన పెళ్లిని సింగిల్‌గా చేసుకొనే పరిస్థితి ఏర్పడింది అని మోనిత అంది. దాంతో మీకు దండం పెడుతాను మేడమ్.. ఈ ప్రయత్నాలు ఆపండి. పెళ్లి ప్రస్తకికి ఇక్కడే పుల్‌స్టాప్ పెట్టండి అని రత్నసీత చెబితే... ఏమైంది అంటూ ప్రశ్నార్థకంగా మోనిత ముఖం పెట్టింది. దాంతో మీరు లొంగిపోండి మేడమ్.

కనీసం శిక్షైనా తగ్గుతుంది అని రత్నసీత చెబితే.. ఇప్పటి వరకు సహాయం చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మోనిత అడిగింది. దాంతో ఏసీపీ రోషిణికి మీరు బతికే ఉన్నారనే విషయం తెలిసిపోయింది అంటూ రత్నసీత చెప్పడంతో నవ్వుల్లో మునిగిపోయింది.

రత్నసీతకు షాకిచ్చిన మోనిత

రత్నసీతకు షాకిచ్చిన మోనిత

రత్న సీత చెప్పిన మాటలకు బదులిస్తూ.. నేను లొంగిపోతాను. కానీ కార్తీక్ తాళి కట్టిన తర్వాత లొంగిపోతాను. గంట తేడా అంటూ మోనిత అంటే.. లేదు మేడమ్ మీరు.. పరిస్థితిని అర్ధం చేసుకోవడం లేదు. ఇందాక రోషిణి మేడమ్ మీరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెళ్లిన విషయాన్ని పసిగట్టింది. మీరు కనుక పట్టుబడితే పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. కాబట్టి వెంటనే వచ్చి లొంగిపో అంటూ రత్నసీత ప్రార్థించింది.

నేను మారను.. వెనుకడుగు వేయను.. అంటూ మోనిత

నేను మారను.. వెనుకడుగు వేయను.. అంటూ మోనిత

అయితే రత్నసీత మాటలకు స్పందిస్తూ... అలాగే లొంగిపోతాను. నువ్వు ఓ పనిచేస్తావా? నువ్వు మీ ఆయనకు విడాకులు ఇవ్వు. అప్పుడు లొంగిపోతాను అని మోనిత అంటే.. రత్నసీత మేడమ్ అంటూ కంగారుపడిపోయింది. నువ్వు పిచ్చి సలహాలు ఇవ్వడం మానేయ్ అంటూ కోపగించుకొన్నది. దాంతో మేడమ్ మీ నిర్ణయం మారదా అంటూ రత్నసీత అడిగితే.. కుదరదు.. ఈ విషయంలో నేను వెనుకడుగు వేయను. దేవుడు దిగివచ్చినా నేను మారను అని మోనిత ఘాటుగా స్పందించింది.

పెళ్లి చేసుకొనేందుకు కారులో కార్తీక్ వద్దకు

పెళ్లి చేసుకొనేందుకు కారులో కార్తీక్ వద్దకు

కార్తీక్‌ను పెళ్లి చేసుకొనేందుకు మోనిత మరో మారువేషంలో కారులో బయలుదేరింది. ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాను. ఈ రోజుతో నా ప్రయత్నాలకు ఓ పరిష్కారం, మంచి ముగింపు లభిస్తుంది. కుమారి మోనిత.. శ్రీమతి మోనిత మారిపోతాను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతాను. నేను ఎంత మంచి స్నేహితురాలినో నీకు తెలుసా అంటూ మోనిత సంబురాల్లో మునిగిపోయింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనితను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న వంటలక్క

మోనితను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న వంటలక్క

ఇదిలా ఉండగా, తాజా ప్రోమోలో మోనిత ఆటలను దీప కట్టిపడేసింది. హాస్పిటల్‌లో ఉన్న దీపను బయటకు పంపించమంటూ కార్తీక్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటే.. వంటలక్కకు అనుమానం వచ్చింది. డాక్టర్ రూపంలో ఉన్నది మోనితే అని గుర్తుపట్టింది. వెంటనే మోనిత పక్కకు వెళ్లి చేతిలో ప్లేట్‌ను విసిరికొట్టింది. దాంతో దీపను చూసి మోనిత షాక్ తిన్నది. తాను బతికే ఉందనే విషయం తెలిసిపోయిందని కంగారు పడిపోయింది. తాజా ప్రోమోలోని ట్విస్టు కార్తీకదీపం సీరియల్‌పై మరింత ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X