For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam: వంటలక్కను చూసి పారిపోయిన మోనిత.. కారులో వేటాడిన దీప.. ఏం జరిగిందంటే?

  |

  కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్‌ను కోర్టుకు తీసుకెళ్లడానికి రంగం సిద్ధం కావడంతో ఓ పక్క దీప ఆందోళనకు గురవుతుంటే.. మరో పక్క డాక్టర్ బాబును మోనిత పెళ్లి చేసుకోవడానికి ఉత్సాహంగా హాస్పిటల్‌కు వచ్చింది. అయితే ఎప్పటి మాదిరిగానే దీప తెగింపు, మోనిత అత్యుత్సాహం మధ్య హైడ్రామా చోటు చేసుకొన్నది. బాహ్య ప్రపంచానికి చనిపోయినట్టు భ్రమ కల్పించి.. మారు వేషంలో తిరుగుతున్న మోనిత ఆటకట్టించిన తీరు తాజా ఎపిసోడ్‌లో హైలెట్‌గా మారింది. సెప్టెంబర్ 8వ తేదీ రోజున ప్రసారమయ్యే 1139 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్

  నేను కన్నీళ్లు తప్ప ఏమిచ్చాను అంటూ కార్తీక్

  నేను కన్నీళ్లు తప్ప ఏమిచ్చాను అంటూ కార్తీక్

  మోనిత వల్లే నాకు ఈ కష్టాలు. ఆ మోనిత వల్లే నేను చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మీ అందరి హెచ్చరికను పెడచెవిన పెట్టినందుకే నాకు మోనిత గుణపాఠం చెప్పింది. దీప నీవు ఏడవకు. నిజాయితీగా బతికే వాడికి పరీక్షలు ఎదురవుతాయి తప్ప.. అన్యాయం జరగదు. నాకు బాధతో ఆకలి వేయడం లేదు. నీకు ఆకలి వేసిన పట్టించుకోవడం లేదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాక కష్టాలతోనే సహవాసం చేశారు. నేను మీకు కన్నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదు. ఇవన్నీ మీరు పరీక్షలన్నారు. ఇలాంటి పరీక్షలు నాకు కొత్త కాదు అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశారు.

  టీ తెచ్చిన మూగమ్మాయి మోనితే..

  టీ తెచ్చిన మూగమ్మాయి మోనితే..

  కార్తీక్, దీప హస్పిటల్‌లో బాధతో మాట్లాడుకొంటుంటే.. మోనిత ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో నేను జైలుకు వెళ్లకుండా బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. కానీ ఆ దారి మూసుకుపోయింది అంటే.. ఏమిటది? మోనిత పట్టుకోవడం అని కార్తీక్ సమాధానం ఇచ్చింది. మోనితను పట్టుకొంటే నేను ఈ శిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది. ఆ రోజు సోదెమ్మ వేషంలో వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించింది అని దీప అంటే.. అవును ఆ రోజు లాకప్ వద్దకు టీ తెచ్చిన మూగమ్మయి మోనితనే అంటూ కార్తీక్ చెబుతుంటే.. మోనిత కోపంతో రగిలిపోయింది. రీనా వేషంలో వస్తున్నది నేనే అని, నా గురించి అంతా చెబుతాడా అంటూ భయంతో మోనిత వణికిపోయింది.

  తాళి కట్టేస్తావా? నీ ఫ్యామిలీని చంపేయమంటావా?

  తాళి కట్టేస్తావా? నీ ఫ్యామిలీని చంపేయమంటావా?


  కార్తీక్, దీప మాట్లాడుకొంటుంటే.. వారిని విడదీసేందుకు మోనిత ప్లాన్ చేసి డాక్టర్ బాబుకు ఫోన్ చేసింది. మోనిత ఫోన్ రావడంతో దీపను కార్తీక్ బయటకు పంపించాడు. డాక్టర్ రీనాగా చేసిన ఫోన్ తీసుకొని.. హలో అంటే.. ఏమిటి గొంతు పూడ్చుకుపోయింది. మీ ఆవిడతో మాట్లాడేటప్పుడు బాగానే ఉంది కదా.. తాళి కట్టడానికి ఇంకా అరగంటే టైమ్ ఉంది. ఈ లోపు మీ ఆవిడతో చెప్పేస్తే మన పెళ్లి ఆపేస్తుంది కదా.. మన పెళ్లి జరగకపోతే.. నేను బాహ్య ప్రపంచంలోకి రాను కదా.. అప్పుడు నీవు జైల్లోనే ఉంటావు కదా అని మోనిత అంటే.. యూ చీట్.. నీతో ఎలా కాపురం చేస్తానుకొన్నావే.. నీవు ఆడదానివే కాదు.. అంటే.. స్టాప్.. నీ కంటే.. నీ ఫ్యామిలీ అంటే ఇష్టమనే సంగతి నాకు తెలుసు. నిన్ను సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానని మోనిత మరోసారి హెచ్చరించింది.

  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న మోనిత

  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న మోనిత

  కార్తీక్‌తో మోనిత మాట్లాడుతుంటే దీప చూసి రీనా ఇక్కడుందేమిటి అని అనుమానపడింది. తీక్షణంగా చూస్తే డాక్టర్ వేషంలో ఉన్న మోనిత అని తేలిపోయింది. దాంతో మెల్లగా మోనిత వెనుకకు వచ్చి మోనిత మాటలు వినింది. హిమను చంపిన నాకు దీప, నీ ఫ్యామిలీని చంపడం అంత కష్టం కాదు అని మోనిత అనగానే.. దీప తన చేతిలో ఉన్న ప్లేట్‌ను కింద కొట్టింది. దాంతో షాక్ తిన్న మోనిత వెంటనే ఫోన్ కట్ చేసి ఏం చేయాలో తెలియక బేలా కళ్లు వేసి నిలబడిపోయింది.

  దీపను చూసి పారిపోయిన మోనిత

  దీపను చూసి పారిపోయిన మోనిత

  మోనితను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న మోనిత.. ఎన్ని రోజులు దాక్కొంటావే.. డాక్టర్ బాబును రక్షించడానికి ఈ సమయంలో నిన్ను పట్టించాడు. రావే అంటూ చేయి పట్టుకోవడంతో చేయి విదిలించుకొని మోనిత కారులో పారిపోయింది. అయితే వెంటనే వారణాసితో కలిసి మరో కారులో మోనితను వెంటాడింది. వారణాసి ఎవరున్నారు కారులో అంటే.. మోనిత అంటూ చెప్పింది. దాంతో మోనితను వదిలేది లేదు అంటూ వారణాసి కారు వేగం పెంచాడు. దీప వెంటాడుతుండటంతో మోనిత కారును వేగంగా పొమ్మని డ్రైవర్‌కు చెప్పింది. అతడు మాట వినకపోవడంతో భారీగా డబ్బు ఇవ్వడంతో డ్రైవర్ కారు వేగం పెంచాడు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  దీప కనిపించకపోవడంతో కార్తీక్ ఆందోళన

  దీప కనిపించకపోవడంతో కార్తీక్ ఆందోళన

  మోనిత ఫోన్ మాట్లాతుండగా బయటకు వెళ్లిన దీప ఇంకా రాకపోవడంతో ఏమై ఉంటుంది అని అందోళన పడింది. దాంతో బయటకు వెళ్లి నా భార్యను చూశావా అని హస్పిటల్ సిబ్బందిని అడిగితే తెలియదని సమాధానం చెప్పారు. దాంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. దీప కనిపించకపోవడంతో కార్తీక్ మరింత ఆందోళన చెందుతూ కనిపించాడు.

  English summary
  Karthika Deepam September 8th Episode preview. Latest episode of 1139 goes once again with emotional content. Monita caught red handedly to Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X