For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam:మోనిత చేతికి చిక్కిన దీప.. తుపాకితో గురిపెట్టి పైశాచికంగా!

  |

  కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పాత్రకు సంబంధించిన కుట్రలకు అంతేలేకుండా పోతున్నది,. కార్తీక్‌ను పెళ్లి చేసుకోనేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్దమైంది. హాస్పిటల్‌లో ఉన్న కార్తీక్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మోనితను దీప రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నది. ఈ క్రమంలో దీప కనిపించకుండా పోవడంతో కార్తీక్ కంగారుపడిపోయింది. ఇంకా 1140 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  Sunny Leone: బీచ్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన సన్నీ లియోన్.. బికినీతో అందాలు మొత్తం చూపిస్తూ!

  దీప కోసం కార్తీక్ కంగారు పడి

  దీప కోసం కార్తీక్ కంగారు పడి

  హాస్పిటల్‌లో దీప కనిపించకపోవడంతో కార్తీక్ కంగారుపడిపోయారు. బయటకు వెళ్లి వెతికే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొన్నారు. కొద్ది నిమిషాల క్రితమే దీప ఇక్కడే ఉంది. ఇప్పుడు కనిపించడం లేదు. బయట ఎక్కడైనా ఉందా అని వెతికి వస్తాను అంటూ కార్తీక్ ప్రయత్నిస్తే.. మీరు బయటకు వెళ్లడానికి పర్మిషన్ లేదు. మీరు డాక్టర్‌గా హస్పిటల్‌కు రాలేదు. మీరు ఖైదీగా వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ ఎస్సై సీరియస్ అయ్యారు.

  Shriya Saran ముంబై వీధుల్లో మొగుడితో శ్రీయాసరన్ ముద్దులాట.. నడిరోడ్డుపైనే రొమాంటిక్‌గా

  కాసేపట్లో దీప నా చేతుల్లో

  కాసేపట్లో దీప నా చేతుల్లో

  హాస్పిటల్‌లో దీప కోసం కార్తీక్ కంగారుపడిపోతుంటే.. కానిస్టేబుల్ రత్నసీతకు మోనిత కాల్ చేసింది. కారులో దీప వెంబడిస్తుండగా.. మరో కారులో వెళ్తూ.. కార్తీక్‌ను కోర్టుకు తీసుకెళ్లారా అని అడిగింది. అయితే ఏసీపీ మేడమ్ వస్తే కోర్టుకు తీసుకెళ్తాం అని రత్నసీత చెప్పింది. దాంతో కార్తీక్ ఏం చేస్తున్నాడని మోనిత అడిగితే.. దీప గురించి వెతుకుతున్నాడు అని రత్నసీత చెప్పింది. దాంతో ఇంకా దీప పిచ్చి తగ్గలేదా అంటూ మోనిత కోపాన్ని ప్రదర్శించింది. అయితే దీప ఎక్కడ ఉంది అని అడిగితే... కాసేపట్లో నా చేతుల్లో చావబోతున్నది అంటూ కఠినంగా రత్నసీతకు మోనిత చెప్పింది.

  Shilpa Shetty గణపతి మహరాజును ఇంటికి ఆహ్వానించిన శిల్పాశెట్టి..

  మోనిత బతికే ఉందని కార్తీక్ వాదన

  మోనిత బతికే ఉందని కార్తీక్ వాదన

  దీప కోసం కార్తీక్ వెతుకుతుండగా.. ఏసీపీ రోషిణి వచ్చి కోర్టుకు తీసుకెళ్లమని ఎస్సైకి చెప్పింది. అయితే ఒక్క రోజు సమయం తీసుకోండి.. రేపు నన్ను కోర్టులో ప్రవేశపెట్టండి. ఈ లోపు దీప కోసం వెతిక పట్టుకొందాం అని కార్తీక్ కోరాడు. అయితే ఇప్పటికే నేను ఒకరోజు ఆలస్యం చేశాను. ఇక మరింత ఆలస్యం చేస్తే .. కోర్టు నాకు మెమో ఇస్తుంది అని ఏసీపీ చెప్పింది. అయితే మోనిత బతికే ఉంది. దీప ప్రాణాలకు ముప్పు ఉంది. ఆ రోజు పోలీస్ స్టేషన్‌కు బసవయ్య కూతురిగా వచ్చింది మోనితే అని కార్తీక్ చెప్పాడు. అయితే సాక్ష్యం ఉందా అని కార్తీక్‌ను ఏసీపీ ప్రశ్నించింది.

  Naina Ganguly : ఘాటు అందాలతో రచ్చ.. ఎద అందాలు ఒకపక్క, గీత దాటేసి మరీ ఇలానా!

  మోనిత బతికే ఉందని రుజువు ఉందా?

  మోనిత బతికే ఉందని రుజువు ఉందా?

  అయితే నేను చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. మోనిత బతికే ఉంది. సోదెమ్మ వేషంలో వచ్చి దీపను కాల్చడానికి ప్రయత్నించింది. ఇప్పుడు డాక్టర్ రీనాగా హాస్పిటల్‌కు వచ్చింది మోనితే.. ఆ రోజు టీ ఇచ్చి అందులో ఏదో మందు కలిపి నన్ను హాస్పిటల్‌కు వచ్చేలా చేసింది అని కార్తీక్ చెబితే.. అందుకు సాక్ష్యం ఉందా అని ఏసీపీ ప్రశ్నించింది. మోనిత బతికి ఉందని రుజువు ఉందని చెప్పడానికి ఏదైనా ఫోటో ఉందా అని ప్రశ్నించింది. ఆ తర్వాత కార్తీక్‌ను కోర్టుకు తీసుకెళ్లింది.

  Sonal Chauhan అందాల ఆరబోత.. ఉల్లి పొర లాంటి డ్రెస్ లో అంతా కనిపించేలా హాట్ షో !

  కార్తీక్‌ను చూసి మోనిత అలా..

  కార్తీక్‌ను చూసి మోనిత అలా..

  ఇదిలా ఉండగా, మోనిత కారును వారణాసితో కలిసి దీప వెంటాడింది. అయితే దీప, వారణాసి వెంటాడుతున్న కారులో పెట్రోల్ అయిపోవడంతో ఓ చోట ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిదూరంలో మోనిత తన కారును ఆపి దిగిపోయింది. అయితే తన ముందే పోలీస్ వ్యాన్‌లో కార్తీక్‌ను కోర్టుకు తీసుకెళ్తుంటే.. అయ్యో కార్తీక్.. నా మాట వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. వంటలక్క మాయలో పడి ఎన్ని కష్టాలు తెచ్చుకొన్నావని ఆందోళన పడిపోయింది.

  షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన ధన్య బాలకృష్ణ: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సుధీర్ లవర్

  దీప తలకు మోనిత పిస్టల్ పెట్టి.. కిడ్నాప్

  దీప తలకు మోనిత పిస్టల్ పెట్టి.. కిడ్నాప్

  అయితే కొద్దిదూరం నడిచే చూసే సరికి దీప ఆగిన కారు వద్ద కనిపించింది. ఇక్కడ కారు పెట్టుకొని దీప ఏం చేస్తుంది? ఇలా ఒంటరిగా దొరికింది. మంచి ఛాన్స్ వదులుకోవద్దు అంటూ పిస్టల్ బయటకు తీసి గురిపెట్టింది. అయితే తాజా ప్రోమోలో దీప తలకు మోనిత పిస్టల్ గురిపెట్టి వారణాసి కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసింది. కొద్ది క్షణాల్లో నీవు చచ్చిపోతున్నావు. కార్తీక్ నాకు దక్కుతాడు. నీవు చస్తే నాకు ఏ అడ్డు ఉండదు అంటూ మోనిత పిస్టల్‌తో గురిపెట్టిన సీన్ తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది. వచ్చే ఎపిసోడ్‌లో దీపను మోనిత ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

  English summary
  Karthika Deepam September 9th Episode preview. Latest episode of 1140 goes once again with emotional content. Monita caught red handedly to Deepa
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X