Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్

తనను అవమానించే విధంగా మాట్లాడిన దీపను ఎలాగైనా కించపరచాలని బంటుతో పారిజాతం ప్లాన్ చేస్తుంది. అయితే తాను దీపను అవమాన పరిచాను అని బంటూ కోతలు కోస్తాడు. దాంతో పారిజాతం ఆనందపడిపోతుంది. దాంతో నీ కళ్లలో ఆనందం చూడటానికి ఎలాంటి పనికైనా సిద్దం అంటూ పారిజాతం మెప్పు పొందే ప్రయత్నం బంటూ చేస్తాడు.

ఇదిలా ఉండగా.. బట్టల షాపింగ్ వెళ్తున్న కార్తీక్‌కు దీప, శౌర్య కనిపిస్తుంది. అయితే శౌర్యను షాపింగ్ తీసుకెళ్తానని అంటే.. దీప ఒప్పుకోదు. కానీ చివరకు శౌర్యను తీసుకెళ్లడానికి దీపను ఒప్పిస్తాడు. దాంతో నా జీవితానికి పరమార్థం.. ఒకే బంధం శౌర్య. జాగ్రత్తగా చూసుకోండి అంటూ దీప చెబుతుంది. అంతేకాకుండా బట్టలు కూడా కొనవద్దు అని అంటుంది. ఇంకా ఏప్రిల్ 18వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 22వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఉగాది పచ్చడి పోటీ పెడతాడు శివ నారాయణ. ఆ పోటీకి జడ్జిగా దీపని నియమిస్తాడు. ఉగాది పచ్చడి ఎవరిదీ బాగోక పోవడంతో దీపే ఉగాది పచ్చడి చేసి విజేత అవుతుంది. గుడిలో దీప భర్త ఆమెని అవమానించేలాగా మాట్లాడతాడు. కార్తీక్ అతని చెంప చెళ్ళు మనిపిస్తాడు. జోత్స్న పుట్టిన రోజున వంటలు చేయటానికి ఒప్పుకుంటుంది దీప. దీపని ఒప్పించి శౌర్య ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 18వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 22వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

బట్టల షాపులో నర్సింహ రెండవ భార్య తనని గుర్తుపట్టడంతో భయంతో పారిపోతుంది శౌర్య. శౌర్య ని పిలుస్తుంది నర్సింహ భార్య. ఎవరిని పిలుస్తున్నావు అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన నర్సింహ. నీ కూతుర్ని, తన ముఖం నాకు ఇంకా గుర్తుంది వాళ్లు ఇంకా ఊరికి వెళ్లి పోలేదా, వాళ్ళు ఇక్కడ ఉంటే ఊరుకునేది లేదు వాళ్లని ఇక్కడి నుంచి పంపించేయ్ అంటుంది. నీ ముందే ఆ పని చేస్తాను అని శౌర్య ని వెతకటానికి వెళ్తాడు నరసింహ.

Karthika Deepam serial 2 April 18th

అదే సమయంలో బట్టలు షాపింగ్ చేస్తూ శౌర్య కనిపించకపోవడంతో కంగారుపడుతూ వెతుకుతూ ఉంటాడు కార్తీక్. కార్తీక్, నర్సింహ ఇద్దరూ ఎదురెదురు పడతారు అది గమనిస్తుంది శౌర్య. ఆరోజు అమ్మ మీద కోప్పడినట్లు ఈరోజు కార్తీక్ మీద కోప్పడతాడేమో అనుకుంటుంది. చిన్న గొంతుతో కార్తీక్ వచ్చేయ్ అంటుంది. శౌర్య తండ్రిని చూసి దగ్గరికి వెళ్లకుండా దాక్కుంటుంది ఎందుకు అనుకుంటాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి త్వరగా రమ్మని పిలుస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడినా జ్యోత్స్న కి తెలిసిపోతుంది అనుకొని పాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

బట్టలు కొనే విషయంలో తల్లిదండ్రులతో మాట్లాడుతాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ తండ్రి జోత్స్న తో మాట్లాడుతూ మా అబ్బాయిని నీ చేతుల్లో పెట్టాం, తనని మార్చుకోవడం నీ చేతిలోనే ఉంది అంటాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అలాంటి కోడలు దొరకటం అదృష్టం అని ఆనందపడతారు కార్తీక్ తల్లిదండ్రులు. మరోవైపు నర్సింహతో అతని భార్య మాట్లాడుతూ నిన్ను చూసి కూడా నీ కూతురు నీ దగ్గరికి రాలేదేంటి అని అడుగుతుంది.

అది పుట్టిన తర్వాత నన్ను చూడలేదు అంటాడు నర్సింహ. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద జాదూగాడివే, రేపటి రోజున నన్ను వదిలేయవని గ్యారెంటీ ఏంటి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది నరసింహ భార్య. నేను వాళ్ళని వదిలేసిందే నీకోసం అని భార్యని ఆపుతాడు నర్సింహ. సరే వాళ్ళని ఈ ఊర్లో ఉండకుండా చూడు అని హెచ్చరిస్తుంది నర్సింహ భార్య. మరోవైపు పుట్టినరోజుకి ఏమేమి వండాలో మాట్లాడుకుంటూ ఉంటారు దీప, దశరథ్, సుమిత్ర.

మాటల్లో దీప తండ్రి ప్రస్తావన వస్తుంది, నన్ను చాలా బాగా చూసుకునేవారు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆమెని ఓదార్చి ఈసారి తండ్రి గుర్తుకు రాగానే చనిపోయిన వ్యక్తిని తలుచుకుని బాధపడటం కాదు ఎదురుగా ఉన్న వ్యక్తిని తలుచుకొని ఆనందపడు అని ధైర్యం చెప్తాడు దశరథ్. వాళ్ళ అభిమానానికి ఎమోషనల్ అవుతుంది దీప. దారిలో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు జ్యోత్స్న, శౌర్య .

శౌర్యకి సరిగ్గా తినటం రాకపోతే ఆమె మూతిని క్లీన్ చేస్తాడు కార్తీక్. అది నర్సింహ దంపతులు చూస్తారు. నీ కూతురికి వాడు సేవలు చేస్తున్నాడు అంటే ఆ పిల్లకి తండ్రి అని అడుగుతుంది నర్సింహ భార్య. నర్సింహ ఏమి మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జోత్స్న శౌర్య ని తన తండ్రి గురించి అడుగుతుంది. వాళ్ల పర్సనల్ విషయాలు మనకెందుకు అంటాడు కార్తీక్. మరోవైపు మల్లేష్ ఇంట్లో తిట్టుకుంటూ సామాన్లు తోముతూ ఉంటుంది అనసూయ.

Karthika Deepam serial 2 April 18th

భోజనం చేస్తున్న మల్లేష్ ఆమె వంట బాగోలేదని అనసూయ పై కోప్పడతాడు. అంతేకాకుండా ఆమె కాపురాన్ని, ఆమె కొడుకు కాపురాన్ని ఎద్దేవా చేస్తాడు. మా విషయాల గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను నీ ఇంట్లో పని చేయను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అనుకుంటాడు మల్లేష్.

మరొకవైపు ఇంటికి వచ్చిన శౌర్య షాప్ లో జరిగినవన్నీ తల్లికి చెప్తుంది కార్తీక్ చాలా మంచి వాడిని చెప్తుంది. శౌర్య పై కోప్పడుతుంది దీప. శౌర్య బుంగమూతి పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య రోజు రోజుకి వీళ్ళకి దగ్గర అయిపోతుంది. కార్తీక్ కి దూరంగా ఉండమంటే శౌర్య ఉండటం లేదు, పాపకు దూరంగా ఉండమని కార్తీక్ కే చెప్పాలి అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X