Karthika Deepam : నిరుపమ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? కార్తీక్ బాబు ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
టెలివిజన్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ అయినా నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ తో నిరుపమ్ పరిటాల ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. 2006వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు వరుసగా బ్యాక్ టు బ్యాక్ డైలీ సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు నిరుపమ్ పరిటాల బుల్లితెరపై వెలుగొందుతున్నారు. తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు.
అయితే సీరియల్ నటుడు నిరుపమ్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఆయన వ్యక్తిగత విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం కార్తిక దీపం 2 సీరియల్ తో దుమ్ము లేపుతున్న మన కార్తీక్ బాబు ఆదాయం ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరు నోరేళ్ల పెట్టాల్సింది. బుల్లితెరపై ఎంతో అనుభవం కలిగి ఉన్న నిరుపమ్ పరిటాల ఒక్కొక్క ఎపిసోడ్ కు భారీగానే ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. ఆయన ఒక్కరోజు సంపాదన తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.

ప్రస్తుతం నిరూపం పరిటాల కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. 331 వ ఎపిసోడ్ వరకు సీరియల్ కథ సాగింది. ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా కొనసాగుతుండడం విశేషం. అయితే నిరుపమ్ పరిటాల ఇలా తను నటిస్తున్న సీరియల్స్ కోసం ఒక్క రోజుకే రూపాయలు 30 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తుంది. దాంతో పాటు కార్తీక్ బాబు మరిన్ని సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
హిట్లర్ గారి పెళ్ళాం, కుమారి శ్రీమతి వంటి సీరియల్ లోను నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఏకకాలంలో మూడు డైలీ సీరియల్స్ లో నటిస్తూ ఒక్కరోజు భారీగానే సంపాదిస్తున్నారు. ఈ మూడు సీరియల్స్ కు కలిపి ఒక్క రోజుకు గాను 80 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు పారితోషికం అందుకుంటారని తెలుస్తోంది. ఇలా నిరూపం నెలలో కనీసం 20 నుంచి 25 రోజులపాటు షూటింగ్ చేస్తారు. ఈ లెక్కన నెలకు 16 లక్షల నుంచి 18 లక్షల వరకు సంపాదిస్తారని అంటున్నారు.
ఇక ఈ రేంజ్ లో సంపాదిస్తున్న నిరుపమ్ పరిటాల పలు ఆస్తులను సంపాదించుకున్నారు. హైదరాబాదులో 1కోటి రూపాయలు విలువ చేసే ప్లాట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 8 కోట్ల వరకు విలువ చేసే ప్రాపర్టీ కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఖరీదైన రెండు కార్లు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. వాటి ఖరీదు 20 లక్షల వరకు ఉంటుంది. మరిన్ని చోట్ల నిరుపమ్ లాండ్స్ ఇన్వెస్ట్ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశారని తెలుస్తోంది. ఇలా అంతా కలిపి ఆయన 8 నుంచి 10 కోట్ల వరకు కూడా పెట్టారని అంటున్నారు. ఇక నిరూపం పరిటాల భార్య కూడా సీరియల్ నటి రావడం విశేషం. చంద్రముఖి సీరియల్ నటి మంజులను మిరప ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు అక్షయ ఓంకార్ ఉన్నాడు.


Click it and Unblock the Notifications











