Karthika Deepam: ముచ్చటగా మూడోసారి కార్తీకదీపం యాక్టర్ ఎంగేజ్‌మెంట్ - ఈసారి ఎవరితో, ఎక్కడో తెలుసా?
కార్తీక దీపం సీరియల్ నటి కీర్తి కేశవ్ భట్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ బ్యూటీ బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ షో ద్వారా చాలా విషయాలు తెలిపింది. తన కుటుంబం అంతా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. తాను మాత్రమే ప్రాణాలతో బతికి బయట పడినట్లు పేర్కొంది. దాన్నుంచి బయట పడ్డాక ఓ పాపను తెచ్చుకుని పెంచుకున్నట్లు చెప్పింది. కానీ ఆమె కూడా చనిపోవడంతో.. కీర్తి పూర్తిగా ఒంటరిగా మారిపోయింది.
అయితే ఈ బాధలన్నింటిని మర్చిపోయి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు బిగ్ బాస్ షోకు వచ్చింది. ఆ తర్వాత తాను ప్రేమించిన నటుడు విజయ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా మాటీవీలో వచ్చి మా బోనాల జాతర ప్రోగ్రాంలో ఎంగేజ్ మెంట్ జరుపుకుని అందరినీ షాక్ కు గురి చేసింది. తన లవ్ స్టోరీ గురించి చెప్పి అత్తా, మామలను కూడా పరిచయం చేసింది. ఆ తర్వాత చాలా కాలానికి నిజంగానే అతడితో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇలా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న కీర్తి ముచ్చటగా మూడోసారి ఎంగేజ్ మెంట్ చేసుకుంది.

తాజాగా కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తిక్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చింది. అందులోనే అతడితో ముచ్చటగా మూడోసారి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ కార్తీక్ చెప్పి.. కీర్తి చేతికి ఉంగరం తొడిగాడు. ఈక్రమంలోనే కీర్తి కూడా కొన్ని విషయాలు చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు తల్లి అయ్యే అవకాశం లేకపోయినా.. తన అత్త, మామలు పర్లేదని చెప్పారని... నువ్వే మా కూతురువి అని చెప్పినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత విజయ్ కార్తిక్ కు తన ప్రేమను వ్యక్తం చేసి ముద్దు పెట్టింది. తాజాగా విడుదల అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రోమోలో మనం ఇదంతా చూడవచ్చు.
కేవలం వీరి ఎంగేజ్ మెంట్ మాత్రమే కాకుండా.. కంటెస్టెంట్లు చేసిన అల్లరి కూడా తెగ అలరించింది. ముఖ్యంగా మహానటి సావిత్రి, అందాల తార శ్రీదేవి సినిమాలు విడుదల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రోగ్రాం అదిరిపోయింది. అయితే కంటెస్టెంట్లు అందరినీ రెండు టీంలుగా చేశారు. ఓవైపు శ్రీదేవి, మరోవైపు సావిత్రి పేర్లు పెట్టి వీరికి జడ్జిలు పలు పోటీలు నిర్వహించారు. అందులో ఎవరు గెలిస్తే వారి సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే రోహిణి, రాంప్రసాద్ లతో కామెడీతో పాటు అదిరిపోయే పాటలు, అంతకు మించిన డ్యాన్సులు చేశారు.

ఆ తర్వాత శ్రీవేది, సావిత్రిల జీవితాలకు సంబంధించిన స్టోరీలను కూడా తెలిపారు. ఇలా ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ ప్రోమో చూస్తుంటే షో కచ్చితంగా చూడాలి అనిపించేలా ఉంది. ముఖ్యంగా సావిత్రి, శ్రీదేవిల స్టోరీలు తెలుసుకోవాలన్నా, మూడోసారి కీర్తి భట్ చేసుకుంటున్న ఎంగేజ్ మెంట్ ను చూడాలన్నా తాజాగా రాబోయే శ్రీవేది డ్రామా కంపెనీని చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











