Karthika Deepam నా భర్త నాతో అస్సలు ఉండడు - పాపం వంటలక్క రియల్ లైఫ్​ పరిస్థితి!

తెలుగు సీరియల్స్‌లో అగ్రస్థానం దక్కించుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన సీరియల్ కార్తీకదీపం. ఈ ధారావాహికలో వంటలక్కగా తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథన్​. ఈమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈమె తన రిలేషన్​ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆమె చెప్పిందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

కార్తీక దీపం సీరియల్‌ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిన విషయమే. టీఆర్పీ రేటింగ్స్​ ప్రకారం ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ప్రతి ఇంట్లో డాక్టర్ బాబు, వంటలక్క గురించే చర్చ సాగుతుండేది. అంతలా.. వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్, డాక్టర్ బాబుగా నిరుపమ్​, మోనిత పాత్రలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. మరీ ముఖ్యంగా వంటలక్క ఏడిస్తే ఏడ్చేవారు, నవ్వితే నవ్వేవారు అంతలా ఆమె బంధం అందరితో పెనవేసుకుపోయింది. అసలు ఆమె పేరు వింటే చాలు బుల్లితెర ప్రేక్షకుల ముఖాల్లో ఆనందంతో వెలిగిపోతాయనే చెప్పాలి. అందరి మనసులను ఆ రేంజ్​లో తన నటనతో దోచుకుంది.

Karthika deepam Serial Actress Vantalakka Aka Premi Vishwanath Comments on Her Husband Full Details Here

వంటలక్క బ్యాక్​గ్రౌండ్ విషయానికొస్తే.. 1991 డిసెంబర్ 2న కేరళలోనే జన్మించింది. ఈమె తండ్రి పేరు విశ్వనాథ్. తల్లి పేరు కాంచన. వంటలక్క లా పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వైజర్​గా కూాడా పని చేసిందట. అయితే ధారావాహికల్లోకి రాకముందు మోడల్​గా రాణించిందని తెలిసింది. అంతేకాకుండా ఓ చిత్రంలోనూ నటించిందట. ఈమె అన్నయ్య పేరు శివప్రసాద్. ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అని అంటుంటారు. దీంతో వంటలక్క కూడా కొన్ని పెళ్లిళ్ల శుభకార్యాలకు ఫోటోగ్రాఫర్​గా కూడా వెళ్లిందట.

ఇక సీరియల్స్​కు వచ్చిన తర్వాత కెరీర్ మారిపోయింది. మొదట ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన బుల్లితెర నటి. అనంతరం స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపంతోనే తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ ధారావాహిక ఏకంగా ఐదు సంవత్సరాలకు పైగా ప్రసారితమై ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈమె తన కెరీర్​కు సంబంధించి పలు విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే తన భర్త పిల్లల గురించి మాట్లాడింది. కెరీర్ కోసం నేను నా పిల్లల్ని కూడా వదిలి తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. నా భర్త దగ్గర అస్సలు ఉండటం కుదరదు. అని చెప్పింది వంటలక్క. అప్పుడు మరి మీ భర్తకు కోపం రాదా అని యాంకర్ మరో ప్రశ్న అడగింది. నిజం చెప్పాలంటే నేను కేరళలో ఉన్నప్పుడు ఆయన కేరళలో ఉండరు.

Karthika deepam Serial Actress Vantalakka Aka Premi Vishwanath Comments on Her Husband Full Details Here

నేను హైదరాబాద్​లో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్​లో ఉండడు. నేను ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన మరో రాష్ట్రంలో ఉంటారు. నా భర్త నా కన్నా బిజీగా లైఫ్​ను గడుపుతుంటారు. ఎప్పుడో ఒకసారి కలుస్తాం అంతే అంటూ ప్రేమీ విశ్వనాథ్ తన భర్త గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వంటలక్క చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X