Karthika Deepam Episode 1114: చచ్చిపోవాలని ఉంది... దీనంతటికి కారణం నువ్వే.. దీపను నిందించిన కార్తీక్

మోనిత తన తలకు కార్తీక్ పిస్టల్ గురిపెట్టడంతో నా కార్తీక్ నన్ను చంపేస్తావా? ఇవన్నీ దారుణాలుగా కనిపిస్తున్నాయా? వీటి వెనుక నా కారణాలు అర్ధం కావడం లేదా? ఎంత వెర్రివాడివి. ఎదురుగా నిలుచున్న నిలువెత్తు ప్రేమమూర్తిని చేతులారా చంపేస్తావా? దీప ఏమనుకొంటుందనని ఆలోచిస్తున్నావా? ఇన్ని చేసిన దాన్ని దీపను చంపడం నాకు ఓ లెక్కనా.. అవసరమైతే మీ అమ్మను కూడా అంటూ మోనిత అనగానే.. ఆపపే అంటూ కార్తీక్ అరిచాడు. ఇలా ఎమోషనల్‌గా సాగిన కార్తీకదీపం సీరియల్‌లోని 1115 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 సస్పెన్స్‌గా మారిన తుపాకి పేలుడు శబ్దం

సస్పెన్స్‌గా మారిన తుపాకి పేలుడు శబ్దం

అంతా అయిపొయింది. నీ చావు నా చేతిలోనే రాసి పెట్టి ఉంది. ఏ ప్రేమ కోసమైతే ఉన్మాదిలా తయరయ్యావు. నీవు రాక్షసి మారి ఇంత మంది జీవితాలతో ఆడుకొన్నావు.. ఆ ప్రేమ కోసమే చచ్చిపో. నువ్వు ప్రేమించిన మనిషి చేతిలోనే చచ్చిపో అనగానే.. తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత కార్తీక్ అంటూ మోనిత అరుపు వినిపించింది. అయితే మోనిత, కార్తీక్‌కు ఏమైందనే విషయం సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

విషాదంలోకి కార్తీక్

విషాదంలోకి కార్తీక్

ఇక కార్తీక్ చెప్పకుండా ఎక్కడికి వెళ్లారనే ఆందోళనలో దీప కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని చూసి వస్తానని చెప్పిన కార్తీక్ ఇంకా రాలేదు అంటూ దీప కంగారు పడిపోయింది. ఇంత వరకు ఇంటికి రాకపోవడం ఏమిటీ? డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్లి ఉంటారు అని అనుకొంటుండగా కార్తీక్ చాలా డీలా పడి ఇంటికి వచ్చాడు. ఏదో మైకంలో ఉన్నట్టు ఇంట్లోకి వచ్చారు. కార్తీక్‌ను చూసి దీప మరింత కంగారు పడిపోయింది. విషాదంలో మునిగిపోయిన కార్తీక్‌ను చూసి.. ఏంటీ డాక్టర్ బాబు.. ఏం జరిగింది.. ఏ జరిగిందో చెప్పు అని దీప అని అడిగింది.

వందేళ్లకు సరిపడే వేదనకు గురయ్యా

వందేళ్లకు సరిపడే వేదనకు గురయ్యా

దీప అడగడంతో కార్తీక్ సమాధానం ఇస్తూ.. నాకేమైంది. కొన్నేళ్ల తర్వాత కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంది. అంతా కొత్తగా ఉంది. ఇలాంటి వాళ్లు ఉంటారని తెలిసిన తర్వాత నా మీద నాకే కోపంగా ఉంది అని కార్తీక్ అన్నారు. అసలు ఏం జరిగింది అని దీప అంటే.. పాఠం నేర్చుకోవడానికి, గుణపాఠం చెప్పించుకోవడానికి.. ఏమి చేయలని పరిస్థితి నుంచి నిస్సహయతలోకి వెళ్లాను. చాలా అధమస్థాయిని చూసి వచ్చాను. అలిసి పోయాను దీప.. ఈ వయసులోనే వందేళ్ల జీవితాన్ని అనుభవించిన వాడిలా అలిసిపోయాను. నేను పూర్తిగా నీరుగారిపోయాను. పూర్తిగా అలిసిపోయాను. వందేళ్లకు సరిపడే వేధనకు ఈ 30 సంవత్సరాల వయసులోనే అనుభవించాను అంటూ కార్తీక్ ఆవేదనకు గురయ్యాడు.

బతకడం వేస్ట్.. చావడం చేతకాదు

బతకడం వేస్ట్.. చావడం చేతకాదు

కార్తీక్ అలా మాట్లాడటం చూసి ఎన్నడూ లేని విధంగా ఇలా మాట్లాడటం ఏంటీ అంటూ దీప అంటే.. అవును.. నాలాంటి వాడు బతకడం వేస్టే. బతకడం, చావడం చాతకాదు. నాకు చచ్చిపోవాలన్నంత కసి పుడుతున్నది. ఒంటరివాడిని అయిపోయాననే ఫీలింగ్ కలుగుతున్నది అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో నేను తోడుగా ఉన్నాను కార్తీక్ అని దీప అంటే.. ఎప్పుడు ఉన్నావు.. అసలు నా జీవితంలో అవసరమైన సమయంలోనే లేవు. నా జీవితం అలా అయిపోవడానికి అసలు కారణం నువ్వే.. అని కార్తీక్ అంటే.. నేనా అంటూ దీప ఆశ్చర్యపోయింది.

 నా చెంప పగలకొట్టి ఉంటే...

నా చెంప పగలకొట్టి ఉంటే...

దీప.. నీ మీద నేను నింద వేసినప్పుడు.. ఆత్మగౌరవం అంటూ నన్ను వదిలేసి వదిలిపోయావు. ఆత్మ గౌరవం అంటే.. నేను నీ మీద నేరం మోపితే.. అది తప్పు అని రుజువు చేసుకోవడమే సెల్ఫ్ రెస్టెక్ట్ అంటే.. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిని కాదు అన్నప్పుడు చాచి చెంపపై ఒకటి కొట్టి.. లేదా ఆ విహారిని ముందు నిలబెట్టడం చేస్తే ఇలా ఉండేది కాదు. నన్ను తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సింది. అలా చేశావా? లేదు.. గడప దాటి వెళ్లావు. తోడుగా ఉండాల్సిన సమయంలో ఉండకుండా వెళ్లిపోయావు. ఇక మా అమ్మ.. కోడలు తరఫున నిలబడి కొడుకును మార్చాల్సింది పోయి.. కోడలను కాపాడుకోవడానికే ప్రయత్నించింది. ఆనాడే నన్ను, పిల్లల్ని తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయించి ఉంటే.. పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో. నేను ఒంటరి వాడిని అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. అమ్మగా నా పక్కన ఉండాల్సిన సమయంలో నీ పక్కన చేరింది అంటూ కార్తీక్ కంటతడి పెట్టుకొన్నారు.

 నా బిడ్డను కూడా పరాయిలా..

నా బిడ్డను కూడా పరాయిలా..


నాకు మంచి పిల్లలు ఉన్నారు. కానీ వారి బాల్యాన్ని చితికిపోయేలా చేసింది నువ్వు, మా అమ్మ. నా బిడ్డను దత్తత తీసుకొనే పరిస్థితిని కల్పించింది మా అమ్మ. నా కూతురే నాకు తెలియదు. ఎవరు కన్న బిడ్డొ అని పెంచుకొన్న.. ఏ పాపం తెలియని రౌడీని పరాయిదానిలానే చూశాను. పదేళ్లపాటు నా బిడ్డ నాకు కాకుండా పోవడానికి కారణం నువ్వే, మా అమ్మే కదా.. తండ్రిగా ఓడిపోయాను దీప.. ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి వస్తుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా మీరు తప్పని చెబితే.. ఇన్నాళ్లు కళ్లు మూసుకొని ఉండే వాడిని కాదు. అందరూ నన్ను వెలివేశారు. వెలివేసిన వాళ్లు నా వాళ్లే కావడం నా దురదృష్టం. అలాంటి సమయంలో ఎవరైనా ఓదార్పు చూపిస్తే ఎవరైనా వెళ్తారు. అలాంటి ఓదార్పు కోసమే నేను వెళ్లాను. అక్కడే మోసపోయాను అంటూ కార్తీక్ కంటతడి ఫెట్టాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
 మోనితను చంపేయాలనిపిస్తుందా?

మోనితను చంపేయాలనిపిస్తుందా?

మోనిత ఎలా గర్బవతి అయిందో తెలుసా? టెస్టుల కోసం నేను ఇచ్చిన శాంపిల్స్ తీసుకొని తన గర్బంలో పెట్టుకొన్నది. ఆర్టిఫిషియల్.. కృత్రిమ గర్భం.. అలా మోనిత తల్లి అయింది అని కార్తీక్ చెప్పింది. మీరు ఏమంటున్నారు? అని దీప అడిగితే.. ఏమంటున్నారు? అని దీప అంటే.. నాకు తెలియదు తెలియదు అంటే.. ఈ రోజు నాకు జవాబు దొరికింది. దీనికి కారణం ఎవరు? ఆదిత్య.. వాడెవడూ నా తమ్ముడే.. వాడు రెచ్చకొట్టకపోతే నా బతుకు నా చేతిలో నుంచి దూరం పెట్టింది నా వాళ్లే. నా వాళ్లే నన్ను దూరం పెట్టారు. బయటి వాళ్లకు అవకాశం ఇచ్చారు అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు చెప్పు ఇంత మోసం చేసిన మోనితను చంపేయాలనిపిస్తుందా లేదా? అంటూ కార్తీక్ ప్రశ్నించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X