Karthika Deepam Episode 1116: కార్తీక్ అరెస్ట్‌కు కారణం నేనే.. కన్నీరుమున్నీరైన దీప
మోనిత హత్య కేసులో నిందితుడనే ఆరోపణలపై డాక్టర్ కార్తీక్‌ను ఏసీపీ రోషిణి అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. మోనితను చంపినట్టు తాను విన్నానని దీప పిన తల్లి భాగ్యం చెప్పిన సాక్ష్యంతో పోలీసులు డాక్టర్ బాబును జైల్లో పెట్టారు. దాంతో కార్తీక్ కుటుంబంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. డాక్టర్ బాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేకపోయారు. తాజా ఎపిసోడ్ 1116లో ఇంకా ఏం జరిగిందంటే..

తండ్రి అరెస్ట్‌తో శౌర్య, హిమ బెంగ
తండ్రి కార్తీక్ బాబు జైలుకు వెళ్లడంతో కూతుళ్లు హిమ, శౌర్య బెంగ పెట్టుకొన్నారు. ఊహించిన పరిణామంతో దీప బాధలో మునిగిపోయింది. తల్లి, కూతుళ్లు భోరుమని ఏడుస్తు ఉండిపోయారు. నాన్న ఎప్పుడు వస్తాడు? మాకు భయంగా ఉంది. డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? ఏం తప్పు చేశావని తీసుకెళ్లారు? నీవేం మాట్లాడవేంది అమ్మా? నాన్న మంచి వాడు కదా. బస్తీలో ఇంత మందికి ఉచితంగా వైద్యం చేస్తున్నాడు కదా.. అలాంటి నాన్నను తీసుకెళ్తుంటే నీవు ఎందుకు గట్టిగా అడగలేకపోయావు అని పిల్లలు ప్రశ్నించారు.

నా జాతకమే అంతా అంటూ దీప
తల్లి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నాన్నను పోలీసులు తీసుకెళ్లుంటే ఎవరు ఎందుకు ఆపలేదు చెప్పమ్మా.. దేనికి సమాధానం చెప్పవా? నాన్న ఎప్పుడొస్తాడో చెప్పవా? అంటూ శౌర్య, హిమ ప్రశ్నిస్తే.. నాకు తెలియదు అంటూ దీప సమాధానం ఇస్తే.. నీకే తెలియదంటే ఎలా అమ్మా అంటూ ఇద్దరు పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ప్రశ్నలకు ఆవేదన చెందుతూ.. నా ఖర్మ.. నా బతుకే అంత. నా జాతకమే అంతా.. దేవుడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలకు నేను ఎలా సమాధానం చెబుతాను.

ప్రాణం పోయడమే నా కొడుకుకు తెలుసు
కుమారుడు కార్తీక్ అరెస్ట్‌తో తండ్రి ఆనందరావు కుమిలిపోయారు. నా పెద్ద కొడుకు అరెస్ట్ అయ్యాడు. నా ఆస్తి, పలుకుబడి ఏమీ చేయలేకపోయాడు. మోనితను చంపాడని నీ తల్లే సాక్ష్యం చెబుతున్నది. ప్రాణం పోయడమే ప్రాణాలు తీయడం తెలియదు. ఇద్దరు పిల్లల తండ్రి అయినా తల్లి, తండ్రి తిట్టినా పడుతాడు. వాడు ఒకరిని చంపగలడా అంటూ ఆనందరావు అన్నారు. దాంతో అన్నయ్యను విడిపిద్దాం అంటే.. చాలా స్ట్రాంగ్ సాక్ష్యాలు ఉన్నాయి అని ఆనందరావు అన్నారు. దాంతో మా అమ్మ కనీసం చెప్పకుండా ఉండాల్సింది అంటే.. ఆమె తప్పేమీ లేదు అంటూ ఆనందరావు చెప్పారు.

నా వల్లే కార్తీక్ అరెస్ట్
డాక్టర్ బాబు అరెస్ట్‌తో బాధలో ఉన్న దీపను తన సోదరి శ్రావ్యను పరామర్శించేందుకు వెళ్లింది. దిగులుగా ఉన్న దీపను చూసి నీవే అలా ఉంటే.. ఎలా.. ఎన్నో సమస్యలను ధీటుగా ఎదుర్కొన్నావు.. ఇప్పుడిలా ఉంటే ఎలా అని చెల్లెలు అంటే... కార్తీక్ అరెస్ట్‌కు కారణం నేనే అంటూ దీప కన్నీరుమున్నీరైంది. అంజితో మోనిత చెప్పిన మాటలను మొబైల్‌లో రికార్డు చేశాను.
ఏసీపీకి ఇద్దామని అనుకొంటే.. అంజి చెప్పిన మాటలను కార్తీక్ నమ్మలేదు. దాంతో ఆ వీడియో చూపించాను. దాంతో ఆయన ఆగ్రహం చెంది ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు. ఆయన కోసం కాల్ చేస్తే కట్ చేసి రాత్రికి వచ్చారు. మోనిత ఇంటిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వీడియో చూపించడం వల్లే ఇదంతా జరిగింది అంటూ దీప కంటతడి పెట్టింది.

నానమ్మ వస్తుంది... నాన్నను విడిపిస్తుంది...
తల్లి కన్నీరుమున్నీరు అవడం చూసి హిమ, శౌర్య కంగారు పడ్డారు. ఏంటమ్మా నాన్న ఇక రాడని చెప్పారా. ఇక జైల్లోనే ఉంటారని చెప్పారా? ఏమైందమ్మా.. అంటూ పిల్లలు ప్రశ్నించారు. దాంతో అక్క పిల్లలన్ని బెదరగొట్టకు అని శ్రావ్య దీపకు చెప్పింది. నాన్నకు ఏమీ కాలేదు. నానమ్మ ఈ రోజుల వస్తుంది. నాన్నను జైలు నుంచి విడిపించుకు వస్తుంది అని పిల్లలకు శ్రావ్య నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నాన్న జైలుకు వెళ్లారంటే భయం ఉంటుంది కదా.. అందుకే అమ్మ ఏడుస్తున్నది అని చెప్పింది.
Recommended Video

కార్తీకదీపం టీఆర్పీ ఎంతంటే..
కార్తీకదీపం సీరియల్ ఎన్నో ట్విస్టులు, ఎమోషనల్ అంశాలతో 1100 పైగా ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకొన్నది. గత కొద్ది నెలలుగా టాప్ రేటింగ్‌లోనే ఉంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. 2021లోని 30వ వారంలో కార్తీక దీపం అర్బన్‌లో 17.68, రూరల్ ప్రాంతంలో 17.03 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











