For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam నేను నేరం చేయలేదు.. ఆ పాపం చేశాను.. లాకప్‌లో డాక్టర్ బాబు ఎమోషనల్

  |

  కార్తీక్ అరెస్ట్ తర్వాత జైల్లో ఉన్న ఆయనను దీప కలుసుకొన్నది. డాక్టర్ బాబు పరిస్థితి చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకొన్నది. దాంతో ఏడవకు దీప.. ఏడ్చి ఏడ్చీ నీ కన్నీళ్లు నాకు శాపంగా మారి కటకటాలపాలు చేశాయి. ఇంకా ఇంకా నా కోసం ఏడవకు అంటూ దీపను కార్తీక్ ఓదార్చాడు. దీప కంటి నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుస్తూ ఆవేదనకు గురయ్యాడు. కార్తీకదీపం సీరియల్‌లో 1119 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  జీవిత ఖైదు పడొచ్చు.. అంటూ

  జీవిత ఖైదు పడొచ్చు.. అంటూ

  నేను జైలు నుంచి బయటకు రావాలంటే బలమైన సాక్ష్యం కావాలి. నా తరఫున వాదించేందుకు ఎవరు ముందుకు వస్తారు. నాకు ఏడాది శిక్ష పడుతుందో.. జీవిత ఖైదు పడుతుందో.. తెలియదు. నేను బయటకు రావాలని విశ్వప్రయత్నాలు చేసి.. రాలేకపోతే నీవు పడే బాధ నేను చూడలేను. అందుకే ప్రశాంతంగా ఉండు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఓ హంతుకుడి బిడ్డలని వారిపై ముద్ర పడకూడదు అంటూ కార్తీక్ అంటే... అన్నీ అప్పగింతలు పూర్తయ్యాయా? అంటూ దీప ప్రశ్నించింది. అంతలోనే అక్కడికి ఏసీపీ రోషిణి వచ్చింది. ఒకసారి నా క్యాబిన్‌లోకి రమ్మంటూ దీపను ఏసీపీ పిలిచింది.

  ప్రియమణిని విచారించానంటూ ఏసీపీ

  ప్రియమణిని విచారించానంటూ ఏసీపీ

  దీపను తన క్యాబిన్‌లోకి పిలిచిన ఏసీపీ రోషిణి.. నేను మోనిత పనిమనిషి ప్రియమణిని విచారించాను అని అంటే.. ప్రియమణి మోనితకు ఏమౌతుంది? నేను మా ఆయనను ఇంటరాగేషన్ చేశాను. ప్రియమణి మోనిత మర్డర్‌ను కళ్లారా చూసిందా? ఆమె చెప్పింది నమ్ముతున్నారు? నేను చెప్పింది నమ్మడం లేదు అని అంటే.. కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పుకోండి అని ఏసీపీ అన్నారు. దాంతో మీది ఏకపక్ష నిర్ణయమా? అని దీప ప్రశ్నించింది. దాంతో మీది ఏక పక్ష నిర్ణయమా అంటూ ప్రశ్నించింది. దాంతో కోపగించుకొన్న ఏసీపీ.. మీరు ఎందుకు భ్రమల్లో బతుకుతారు అంటూ ప్రశ్నించింది.

  నా భర్త అబద్ధం చెప్పడు అంటూ దీప

  నా భర్త అబద్ధం చెప్పడు అంటూ దీప

  ఏసీపీ రోషిణి వాదనకు సమాధానం ఇస్తూ... నా భర్తపై నాకు క్లారిటీ ఉంది. ఆ మోనిత ఏమిటో కూడా నాకు బాగా తెలుసు. మీకు ప్రియమణి గురించి తెలియదు. ఆమె మోనిత ఇంట్లో పనిమనిషి కాబట్టి ఆమెకు అనుకూలంగా చెప్పవచ్చు అని దీప అంది.. అయితే నేను అన్ని రకాలుగా విచారించాను. ఆమెకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని ఏసీపీ అంటే... నా భర్త కూడా అబద్ధం చెప్పడు అని దీప సమాధానం ఇచ్చింది. దాంతో నా వద్ద అన్నీ సాక్ష్యాలు ఉన్నాయి? బుల్లెట్స్ దొరికాయి అంటూ ఏపీసీ చెప్పింది. దాంతో నేను ఏం చేయాలో చెప్పండి మేడమ్ అంటూ దీప అడిగింది.

  నీ బలహీనత అదీ అంటూ

  నీ బలహీనత అదీ అంటూ

  దీప ప్రశ్నకు సమాధానం చెబుతూ.. నీవు మనుషులందరిలో మంచితనం చూస్తుంటావు. అంది మంచితనమే. కానీ నీ బలహీనతను చూసి అందరూ దానిని స్వార్ధానికి ఉపయోగించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టాలి. కాబట్టి మీరు ఓ పనిచేయాలి. మోనిత బాడీ ఎక్కడ దాచిపెట్టాడో అడగండి అంటూ దీప.. సీరియస్ అయ్యింది. మోనితను చంపలేదంటే.. బాడీ ఎక్కడ పెట్టారో అడగమంటే ఎలా ఉంటుంది అంటూ ఏసీపీ దీప గట్టిగా సమాధానం ఇచ్చింది. దాంతో మీరు మీ పిల్లలు హ్యాపీగా ఉండాలంటే... కార్తీక్ నుంచి నిజాలు బయటపెట్టాలి అంటూ ఏపీసీ అని సమాధానం కోసం వేచి చూసే లోగా దీప ఆమె క్యాబిన్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో రోషిణి షాక్ తిన్నది.

  లాకప్‌‌లో కార్తీక్.. కానిస్టేబుల్‌తో

  లాకప్‌‌లో కార్తీక్.. కానిస్టేబుల్‌తో

  ఇదిలా ఉండగా, లాకప్‌లో కార్తీక్ కటిక నేలపై పడుకొని ఆలోచనల్లో మునిగిపోయాడు. ఆ సమయంలో డాక్టర్ సాబ్ అంటూ కానిస్టేబుల్ పిలిచింది. ఏంటి అని కార్తీక్ అంటే.. మా ఆయనకు గుండెల్లో గుబులుగా ఉంది. ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. మీరు హార్ట్ డాక్టర్ తెలిసింది. ఏమైనా మందులు రాసిస్తారా? అంటే.. ప్రిస్కిప్షన్ రాస్తూ.. మద్యం సేవిస్తాడా? ఒకవేళ అదే చేస్తే మద్యం తాగడం మానేయమని చెప్పు. అప్పుడ తగ్గకపోతే.. హాస్పిటల్‌లో చేర్పించి ఉచితంగా చికిత్స చేస్తారు? అంటే.. మా ఆయనకు ఇంకా ఏమీ ఆపద ఉండదంటూ కానిస్టేబుల్ చెప్పింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   మీరు నేరం చేయలేదు..

  మీరు నేరం చేయలేదు..

  అప్పటికే దిండు, బెడ్‌షీట్ ఇచ్చిన కానిస్టేబుల్.. తన ఇంటి నుంచి తెచ్చిన చపాతీలు, చాయ్ ఇస్తే.. నీవు నాకు ఏమౌవుతావు.. మీరు ఎవరు అంటూ అంటూ కార్తీక్ ప్రశ్నించారు. దాంతో నేను కానిస్టేబుల్ మాత్రమే అని సమాధానం చెప్పింది. అయితే మీరు నా మీద ఎందుకు జాలి పడుతున్నారు? అని అడిగితే.. నేను జాలి పడటం లేదు సార్... మీరు నేరం చేయలేదని నాకు అనిపిస్తున్నది. మీరు మంచి వారని విన్నాను. మీ హస్తవాసి మంచిదని తెలిసింది అని అంటే.. నేను నేరం చేయలేదు. పాపం చేశాను. అందుకే ఇదంతా అంటూ కార్తీక్ మళ్లీ విచారం వ్యక్తం చేశాడు.

  English summary
  Karthika Deepam August 16th August's Episode preview. Latest episode of 1119 goes once again with emotional content.Karthik arrested in Monita murder case.In this occasion, emotional scenes took place between Karthik and Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X