Karthika Deepam అదిరిపోయిన మోనిత ఎంట్రీ.. కార్తీక్‌కు ముద్దులు పెడుతూ షాకింగ్‌గా

కార్తీకదీపం సీరియల్‌లో రోజుకో ట్విస్టుతో సుదీర్ఘంగా సాగుతున్నది. ఇక సీరియల్‌ ముగుస్తుందనుకునే ప్రతీసారి మరో ట్విస్టుతో సీరియల్ మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నది. తాజాగా కార్తీక్ అరెస్ట్ తర్వాత సీరియల్‌లో రకరకాల ట్విస్టులు మొదలయ్యాయి. ఎమోషనల్‌గా ఆసక్తికరమైన కథనంతో సీరియల్ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ఆగస్ఠు 17వ తేదీ తాజా ఎపిసోడ్ 1130 ఏం జరిగిన సన్నివేశాలు ఏమిటంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

డ్రైవర్ అంజిని కలిసిన దీప

డ్రైవర్ అంజిని కలిసిన దీప

మోనిత హత్య కేసులో బలమైన సాక్ష్యం ఉంటే తప్ప నేను జైలు నుంచి బయట పడలేను అని కార్తీక్ చెప్పడంతో దీప మళ్లీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. భర్త నేరస్తుడు కాదనే విషయాన్ని నిరూపించడానికి మళ్లీ రోడ్డెక్కింది. ఆటో డ్రైవర్ వారణాసితో కలిసి కారు డ్రైవర్ అంజిని కలిసింది. దీపమ్మ రాత్రి పూట ఇలా రోడ్డుపై ఎందుకు ఉన్నావమ్మా అంటూ అంజి అడిగితే.. డాక్టర్ బాబు నేరస్థుడు కాదని నిరూపించడానికి నాకు రాత్రి, పగలు అనే తేడా ఉండదు. ఆ ఏసీపీ బెయిల్ దొరకనివ్వడం లేదు. డాక్టర్ బాబు పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఎలా పెరిగారో.. ఎంత పేరు తెచ్చుకొన్నారో .. చివరకు లాకప్‌లో అలా బందీగా కూర్చొన్నారు అంటూ దీప ఆవేదనకు గురైంది.

మోనితను చంపాలని వెళ్లాను కానీ..

మోనితను చంపాలని వెళ్లాను కానీ..

అంజితో మాట్లాడుతూ.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడేందుకు ప్రయత్నించింది. నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత మోనితను మళ్లీ చూశావా? అని అడిగితే... లేదు.. కానీ ఆ రోజు ఉదయమే నేను మోనితను చంపడానికి వెళ్లాను. కానీ పోలీసుల హడావిడి చూసిన తర్వాత నేను వెనుకకు వెళ్లిపోయాను. మోనితను ఎందుకు చంపాలనుకొన్నావు అని దీప అంటే.. మోనిత బతికి ఉంటే మిమల్ని, డాక్టర్ బాబును ప్రశాంతంగా బతకనివ్వదు. అందుకే నేను చంపాలని వెళ్లాను. కానీ అంతలోపే డాక్టర్ బాబు తొందరపడ్డారు. దేవుడి లాంటి మనిషి అరెస్ట్ అయ్యారంటే చాలా బాధపడ్డాను అని అంజి అన్నాడు.

నేరాన్ని నాపై వేసుకొని లొంగిపోతాను

నేరాన్ని నాపై వేసుకొని లొంగిపోతాను

అంజి మాటలతో దీప కన్నీరు పెట్టుకొంటుండగా.. దీపమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోకండి. డాక్టర్ బాబును దక్కించుకోవడానికి పదేళ్లుగా పోరాటం చేశావు. ఇప్పడు భూమికి భారంగా ఉన్న ఆడ రాక్షసి నుంచి రక్షించుకోవడానికి కష్టపడుతున్నారు. మీరు జీవితాంతం సమస్యలతోనే పోరాడుతూ ఉండాలా? అవసరం లేదమ్మా.. ఆ నేరాన్ని నాపై వేసుకొని లొంగిపోతాను. డాక్టర్ బాబును బయటకు తీసుకొస్తాను. నాకు ఎవరు లేరు దీపమ్మ.. నా జీవితం ఏమై పోయినా ఫర్వాలేదనిపిస్తుంది. డాక్టర్ బాబుకు పిల్లలు, భార్య, పెద్ద కుటుంబం ఉంది. ఆయన కోసం ఏదైనా చేస్తాను అంటూ అంజి అన్నాడు.

దీపమ్మ నీకు సహాయం చేయడానికి రెడీ

దీపమ్మ నీకు సహాయం చేయడానికి రెడీ

అయితే అంజి మాటలకు దీప అడ్డుపడుతూ.. డాక్టర్ బాబు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారనే వేదనతో బతుకుతున్నా. ఇప్పుడు మళ్లీ నీవు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తే నేను ఎలా తట్టుకొంటాను అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మోనిత కిడ్నాప్ చేసిన సమయంలో నేను రౌడీ ద్రాక్షారామంను కొట్టి రక్తం చేతులతో ఉండగా.. కార్తీక్ బాబు అక్కడి వస్తే నేను తలుపు తీశాను. ఆ పరిస్థితుల్లో నన్ను చూసి.. దీపకు నీవంటే ఇష్టం. ఇలాంటి జీవితానికి ముగింపు పలుకు. కావాలంటే నేను సహాయం చేస్తానని చెప్పాడు. అలాంటి వ్యక్తి కోసం నేను నేరస్థుడిగా మారడంలో తప్పు లేదు అంటూ అంజి చెప్పాడు. దాంతో ఆవేశపడకు అంజి.. నీవు నేరస్థుడిగా మారడానికి వీలు లేదు. కానీ డాక్టర్ బాబును నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నాలకు సహాయం చేయి.. ఆ సహాయం చేయి చాలూ అంటూ దీప చెబితే.. అందుకు తాను రెడీ అంటూ అంజి చెప్పాడు.

 మోనితకు శత్రువులు ఎవరైనా ఉన్నారా?

మోనితకు శత్రువులు ఎవరైనా ఉన్నారా?

అయితే డాక్టర్ బాబు గురించి అంజి మాట్లాడుతూ.. కార్తీక్ బాబు హత్య చేశారని అందరూ నమ్ముతున్నారు. ఆయన ఇంటికి తీసుకొచ్చే దారి కనిపించడం లేదు. డాక్టర్ బాబు హత్య చేశారంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు. కానీ నిర్దోషి అని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు అని అంజి అంటే.. సాక్ష్యాలు అవసరం లేదు. మోనిత శవం ఎక్కడుందో కనిపెట్టగలిగితే.. సాక్ష్యాలు వాటంతటా అవే బయటపడుతాయి. అది కనిపెట్టే విషయంలో సహాయం చేయి అంటూ దీప చెప్పి ఇక బయలుదేరుతాను అంటూ కారు ఎక్కబోగా.. దీపమ్మ.. నేను కాకుండా ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా? వాళ్లు చంపి డాక్టర్ బాబును ఈ హత్య కేసులో ఇరికించారేమో.. ఆలోచించండి అంటే.. అవును దుర్గ ఉన్నాడు.. వాడే చంపి ఉంటాడేమో అని అనుమానాలు వ్యక్తం చేసింది. అక్కడి నుంచి బయలు దేరుతుండగా.. అంజి దగ్దరకు వెళ్లి.. డాక్టర్ బాబు కోసం జైలుకు వెళ్లడానికి రెడీ కావడం చూసి నీకు ఫ్యాన్ అయిపోయాను అంటూ కామెంట్ చేశాడు.

మోనిత గ్రాండ్ ఎంట్రీ.. పక్కా విలనిజంతో

మోనిత గ్రాండ్ ఎంట్రీ.. పక్కా విలనిజంతో

అలాంటి ఆలోచన మధ్య మోనిత శవం ఏమైపోయిందంటూ ఆలోచిస్తుండగా.. అదిరిపోయేలా మోనిత ఎంట్రీ ఇచ్చింది. ఊరి బయట మారుమూల ప్రాంతంలోని ఓ పాడు బడిన ఉన్న మోనిత వద్దకు కానిస్టేబుల్ రత్న సీత వెళ్లింది. ఆ రూంలో కార్తీక్.. నా కార్తీక్ అంటూ గోడపై రాసి.. ఓ ఫోటో పెట్టుకొని మంచంపై పడుకొని ఉంది. అలాంటి సమయంలో రత్న సీతను చూసి మోనిత వచ్చావా? నా కార్తీక్ ఎలా ఉన్నాడు? భోజనం చేశాడా అంటూ ఆతృతగా అడిగింది. దాంతో కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్‌లో తీసిన ఫోటోను మోనితకు ఇచ్చింది. కార్తీక్‌ను చూసి ఎలా ఉన్నావురా అంటూ ఫోటోకు ముద్దులు పెట్టి ఆనంద పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X