Karthika Deepam Episode 1111: డాక్టర్ బాబు బుద్ది మారదా? ఇంకా మోనితనే నమ్మడంపై అంజి షాక్

కార్తీక్‌తో పెళ్లిని అడ్డుకొనేందుకు డాక్టర్ మోనితను కిడ్నాప్ చేయడానికి వచ్చిన దీప పిన్ని భాగ్యం ప్లాన్ వేసింది. అయితే భాగ్యం ప్లాన్‌ను పసిగట్టిన మోనిత ఆమెను మాటల్లో పెట్టి గదిలోకి తీసుకెళ్లింది. అలాగే అర్దరాత్రి తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని దీపను కార్తీక్ అడగడంతో వరంగల్ ఫామ్ హైజ్‌లో బంధించిన అంజి వద్దకు కార్తీక్ బయలు దేరాడు. ఇలా ఎన్నో ట్విస్టులతో సాగుతున్న మోస్ట్ టీఆర్పీ ఉన్న కార్తీక దీపం సీరియల్‌కు సంబంధించిన 1111 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

 భాగ్యంను బంధించిన మోనిత

భాగ్యంను బంధించిన మోనిత

కార్తీక్ ప్రేమ కోసమే బతికాను. ఇంకా తనే కాదంటే ఇంకా బతకడం ఎందుకు. కార్తీక్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అలాంటి కార్తీక్ తన ప్రేమను నిరాకరిస్తే ఎంతకైనా తెగిస్తాను. కార్తీక్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. చేసి తీరుతాను అంటూ కుర్చీలో కూర్చోపెట్టి తలపై కర్రతో కొట్టింది. తలపై దెబ్బ పడటంతో ఆపస్మారక స్థితిలోకి జారుకొంటున్న భాగ్యంను తాళ్లతో బంధించింది.

మోనిత చర్యతో భాగ్యం బిత్తరపోయింది. తలపై గట్టిగా మోదడంతో బాధతో భాగ్యం అల్లాడింది. ఏంటీ ఇలా చేసిందని అవాక్కయ్యవా? ఏమీ చదవని మీకే తెలివితేటలు ఉంటే.. డాక్టర్ చదువుకొన్న నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి. నీవు తీసుకొన్న గోతిలో నువ్వే పడి ఉంటావని ఊహించి ఉండవు కదా.. నీలా ఎన్ని ప్లాన్స్ వేసినా నా పెళ్లి కార్తీక్‌తో జరుగుతుంది. అప్పటి వరకు నీవు ఇక్కడే ఇలానే పడి ఉండు.. బైబై బంగారం అంటూ గదిలో బంధించి వెళ్లింది.

నేను చెబితే నమ్మలేదు అంటూ..

నేను చెబితే నమ్మలేదు అంటూ..

దీపతో కార్తీక్ మాట్లాడుతూ. అర్ధరాత్రి ఎక్కడకు వెళ్లావని అడిగితే.. నేను నా నోటి నుంచి చెప్పడం కంటే. నేను చెప్పిన అడ్రస్‌కు వెళ్లు అని వంటలక్క సమాధానం ఇచ్చింది. అయితే నువ్వే చెప్పు అంటే.. మోనిత గురించి మీకు ఇప్పుడు తెలిసింది. నేను చెబుతూనే ఉన్నాను. హెచ్చరించాను. నీ అదే విషయం చెబితే నీవు పెడచెవిన పెట్టావు. మీకు చెప్పాల్సిన చెబితే మీకు అర్దమవుతుంది. ఆ విషయం తెలిస్తే.. ఇక ముందు మోనిత మిమ్మల్ని ఇక పెళ్లి చేసుకోమని అడుగదు అంటూ కార్తీక్‌తో దీప చెప్పింది.

ఇద్దరు రౌడీల మధ్య గొడవ..

ఇద్దరు రౌడీల మధ్య గొడవ..

ఇక వరంగల్ హైవేలో అంజిని బంధించిన ప్రదేశంలో హైడ్రామా చోటుచేసుకొన్నది. ద్రాక్షరామం అనే రౌడీకి అంజికి మధ్య వాగ్వాదం జరిగింది. నీవు ఎవరి జోలికి వెళ్లావు తెలుసా అంటూ ద్రాక్షారామం హెచ్చరిస్తే.. నా గురించి నీకు తెలియదు. మీ మేడమ్‌నే అడుగు. ఆమె చెబుతాడు అంటూ నిర్లక్ష్యంగా అంజి సమాధానం ఇచ్చాడు. నీవు అంత పుడింగివా? అంటే నీవేమన్నా పుడింగివా అంటూ అంజి, ద్రాక్షారామం మాటలు విసురుకొన్నారు.

మా మేడం జోలికి ఎందుకు వెళ్లావురా అంటే.. మీ మేడమే నన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటూ సమాధానం చెప్పాడు. దాంతో ఒక్క ఫోన్ కొట్టి చంపేయమంటే నిన్ను చంపేస్తాను అంటూ ద్రాక్షారామం వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క ఫోన్ కొట్టి చెప్పు.. ఇదే నా ఆఖరి ఫోన్ అని.. అంజి అంటే.. నన్నే లేపేస్తావా అంటూ ద్రాక్షారామం ప్రశ్నించాడు. వారి మధ్య జరిగిన పొట్లాటలో ద్రాక్షారామంను అంజి బాటిల్‌తో కొట్టి గాయపరిచాడు.

దీపమ్మ చెప్పమని చెప్పిందా?

దీపమ్మ చెప్పమని చెప్పిందా?

అంతలోనే కార్తీక్‌ అంజి ఉంటున్న ఇంటి వద్దకు చేరుకొన్నాడు. తలుపు కొట్టగానే డోర్ ఒపెన్ చేసిన అంజిని చూసి కార్తీక్ షాక్ అయ్యాడు. డాక్టర్ బాబు మీరా? దీపమ్మ పంపించిందా? అంటూ ప్రశ్నించాడు అయితే ఈ రౌడీతో పెళ్లిని ఆపించాలని ప్రయత్నించిందా అంటూ ప్రశ్నిస్తే అవును అని సమాధానం ఇచ్చాడు. ఆ పక్కనే ఉన్న రౌడీని చూసి.. ఎవడు వీడు అంటూ కార్తీక్ ప్రశ్నిస్తే.. నా కోసం మోనిత కాపలా పెట్టిన రౌడీ వీడు అని అంజి అంటే... మరీ నీవు అంటూ కార్తీక్ ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో ఏంటి అలా అడుగుతున్నావు ఏంటి.. నేను మీ డ్రైవర్‌ను అని అంజి సమాధానం ఇచ్చాడు.

దాంతో అంతకు ముందు అంటూ కార్తీక్ ప్రశ్నించాడు. నేను రౌడీనే.. నన్ను హంతుకుడిని చేసింది మోనితనే. దీపమ్మకు అంతా తెలుసు. అసలు హిమను చంపించింది మోనితనే అని అంజి అంటే.. దీపమ్మ ఈ విషయం చెప్పమని చెప్పిందా? ఇంతకు ముందు చెప్పావుగా అని కార్తీక్ ఎదురు ప్రశ్నించాడు.

దీపమ్మ చెప్పేవి నిజాలు...

దీపమ్మ చెప్పేవి నిజాలు...

అంతేకాకుండా అంజికి క్లాస్ పీకుతూ.. నీ లైఫ్‌ స్టైల్ మార్చుకో. నీ పద్దతి మార్చుకో. ఇలా కాలం వెళ్లదీయకు. దీప నిన్ను బాగా నమ్మింది కాబట్టి.. సాయం చేస్తా అంటూ బయలు దేరబోతే.. డాక్టర్ బాబును అంజి ఆపాడు. మీరు ఇప్పటికీ నమ్మడం లేదు. నన్ను నమ్మినా.. నమ్మకపోయినా ఫర్వాలేదు. మీరు ప్రతీ మనిషిలో మంచినే చూస్తారు.

కానీ మోనితను నమ్మకండి. మరీ మోనితలో మీకు ఏం మంచి కనిపించిందో అర్ధం కావడం లేదు. ఒకసారి మంచిని నమ్మండి. మోనిత వల్లనే నా జీవితం ఎటూ కాకుండా పోయింది. మోనిత చెప్పేవన్నీ అబద్దాలే. దీపమ్మ చెప్పేవి నిజాలు. ఇది ఒక్కటి మాత్రం నిజం. మీరు వెళ్లండి డాక్టర్ బాబు.. ఇది మీలాంటి వాళ్లు రావాల్సిన ప్లేస్ కాదు అంటూ అంజి చేతులెత్తి దండం పెట్టాడు. దాంతో కార్తీక్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X