Karthika Deepam Episode 1112: మోనిత దారుణ హత్య.. కార్తీక్ అరెస్ట్.. షాకింగ్ ట్విస్టుతో పుట్టెడు దు:ఖంలో దీప
కార్తీకదీపం సీరియల్ ఆగస్టు 7వ తేదీ ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో పలు రకాల ట్విస్టులు కనిపించాయి. మోనిత నిజస్వరూపం తెలుసుకొన్న కార్తీక్ ఆవేశంతో రగిలిపోయాడు. మోనితను చంపడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ హిమను చంపిన విషయం చెప్పి మోనితకు షాకిచ్చాడు. నిన్ను చంపుతాను అంటూ మోనితను వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా కార్తీక దీపం ఎపిసోడ్‌లోని 1112 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...
Photo Courtesy: Star మా and Disney+Hotstar

మోనిత అసలు రంగు బయటపడుతుందని
అంజి వద్దకు వెళ్లి వచ్చిన కార్తీక్‌ను చూసి హమ్మయ్య.. వచ్చేశారా? అంటూ దీప అంటే.. ఎందుకు అని కార్తీక్ సమాధానం ఇచ్చారు. మీరు రాలేదని నేను కంగారు పడుతున్నాను అంటే.. ఎందుకు అని కార్తీక్ మళ్లీ అడిగాడు. దాంతో అంజి చెప్పిన విషయాలతో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనే భయం నాలో కలిగింది అంటూ దీప చెప్పింది. అంజి మాత్రం ఏం చెబుతాడు.. ముందు చెప్పిన విషయాలే చెప్పాడు. అంజి వస్తాడు అనుకొని ఎదురు చూస్తే.. చెప్పిన విషయాలే చెప్పాడు అంటూ కార్తీక్ అన్నాడు. అయితే మీరు అంజిని నమ్మలేదా? నన్ను నమ్మలేదా? అంటూ దీప ప్రశ్నించింది. ఈ విషయం నిజమో కాదో పక్కన పెట్టు. ఈ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి, మోనిత కడుపుకు అంజి చెప్పిన సాక్ష్యం పనికిరాదు అని కార్తీక్ అన్నారు. మోనిత నిజస్వరూపం తెలుసుకొని అంజిని తీసుకెళ్లి ఆమె ముందు నిలపెడితే అసలు రంగు బయటపడుతుంది. దాంతో ఆమె జైలుకు వెళ్తుంది. కానీ మీరు పెళ్లి గురించి మాట్లాడుతారేంటి అంటూ దీప ప్రశ్నించింది.

నీవు, రోషిణి నమ్మే సాక్ష్యం నా వద్ద
అంజిని తీసుకెళ్లి రోషిణి మేడమ్ ముందు నిజం చెప్పిస్తే అసలు విషయం అర్ధమవుతుంది కదా అంటూ కార్తీక్‌తో దీప అంది. అయితే పెళ్లిని ఆపడానికి అంజి చేత అబద్దం చెప్పిస్తున్నామని ఏసీపీ రోషిణి అనుకొంటే అంటూ కార్తీక్ మళ్లీ ప్రశ్నించాడు. ఎప్పడో పదేళ్ల క్రితం జరిగిన విషయానికి సాక్ష్యం తేగలవా? రుజువు చేయగలవా అని అడిగితే కార్తీక్ అంటే.. అర్ధమైంది.. మీరు సాక్ష్యం ఉంటే తప్ప.. మోనిత దారుణల గురించి నమ్మలేరని, మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోదు. ఈ విషయాన్ని తేలికగా కొట్టి పడేస్తుంది అంటే.. మీరు, రోషిణి నమ్మే సాక్ష్యం నా వద్ద ఉంది అంటూ సూర్యాపేట లాడ్జిలో తీసిన వీడియోను కార్తీక్ ముందు పెట్టింది.

మోనిత వీడియో చూసి కార్తీక్ షాక్.. .
దీప చూపించిన వీడియోలో మోనిత చెప్పిన విషయాలు చూసి కంగు తిన్నాడు. .. దీపమ్మ దీపమ్మ అంటున్నావు కదా. దీపమ్మ కోసం చచ్చిపో. హిమను ఎలా చంపిచానో నిన్ను అలా చంపిస్తా. ఒకే కారులో హిమ, కార్తీక్ ఉన్నా.. ఒక్క హిమను చంపి నాకు ఒక్క ఫేవర్ చేశావు అని మోనిత చెప్పిన విషయాలు చూసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఆ వీడియోను చూసి కంగుతిన్న కార్తీక్‌ను చూస్తూ... హిమను లారీతో గుద్ది చంపించేదే మోనిత. ఆ లారీ డ్రైవర్ అంజి. ఇప్పటికైనా మీరు నమ్ముతారా. మోనితనే హిమను చంపించింది. ఇన్నాళ్లు అంజిని రప్పించాలని అనుకొన్నది. మోనిత మాటలను ఇప్పటికైనా నమ్ముతారా. నీవు ప్రేమించిన హిమనే చంపించింది. పెళ్లి చేసుకొన్న నాపై అనుమానం పెంచింది. ఇన్నేళ్లు మనం కలువకుండా చేసింది. పదేళ్ల తర్వాత మనం కలిసామని తెలిసిన తర్వాత కడుపు పేరుతో విడదీయాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటూ దీప ప్రశ్నల వర్షం కురిపించింది.

దీపకు చెప్పకుండా కార్తీక్..
మోనిత వీడియోను ఏసీపీ రోషిణికి చూపిస్తే అంతా ఆమె చూసుకొంటుంది. ఇక పెళ్లి గురించి ఆలోచించకు. మీరు కంగారులో ఉన్నట్టు ఉన్నారు. కొన్ని మంచి నీళ్లు తేస్తాను అంటూ దీప అనగానే.. మోనిత తనను బ్లాక్ మెయిల్ చేసిన విషయాలన్నీ కార్తీక్ గుర్తుకువచ్చాయి. నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్లి రాగానే.. కార్తీక్ కనిపించకుండా పోయాడు. దాంతో దీప కంగారు పడుతూ ఇళ్లంతా వెతికింది. డాక్టర్ బాబు.. డాక్టర్ బాబు అంటూ ఇళ్లంతా వెతికింది. అంతలోనే అక్కడికి వచ్చిన హిమ, శౌర్య వచ్చిన నాన్న కారులో బయటకు వెళ్లారు అని చెబితే.. ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకొంటారో అని కంగారు పడింది. డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నారు. బయటకు రాగానే ఫోన్ వచ్చింది. భారతీ ఫ్రెండ్ చనిపోయారు. అక్కడికి వెళ్లి వస్తాను. నేను తొందరగా వస్తాను. మీరు పిల్లలు భోజనం చేయండి అంటూ కార్తీక్ కారులో వెళ్తూ చెప్పాడు.

వస్తాడు నా రాజు.. ఈ రోజు అంటూ
ఆ తర్వాత తాను అబద్ధం చెప్పానని మనసులో అనుకొంటూ.. దీప నీకు అబద్దం చెప్పాను. నేను చనిపోయిన వాళ్లను చూడటానికి వెళ్లడం లేదు. మోనితను చంపడానికి వెళ్తున్నాను. అది చెబితే నువు కంగారు పడుతావని చెప్పలేదు అంటూ కార్తీక్ ఆవేశంతో మనసులో అనుకొంటూ కనిపించాడు. నేరుగా మోనిత ఇంటికి కార్తీక్ చేరుకొన్నారు. కార్తీక్‌ను చూడగానే మోనిత సంతోషంలో మునిగిపోయింది. కార్తీక్.. నా కార్తీక్ నువ్వు వచ్చావా? అంటూ ఆనందంతో కనిపించింది. ఆనందంలో ఉన్న మోనితను సీరియస్‌గా చూస్తుండగా.. నేను అనుకొంటూనే ఉన్నాను. వస్తాడు నా రాజు.. ఈ రోజు అంటూ పాటపాడుకొంటూ ఉన్నాను. నీవు ఎంత మంచి వాడికి కార్తీక్.. నా ప్రేమ, తపనను అంతా అర్ధం చేసుకొని నా కోసం వచ్చావా? రా కార్తీక్.. నీ కోసమే తపస్సు చేస్తున్నాను. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిగా వచ్చావు కదు.. నా మనసులోని ప్రేమకు జవాబు చెప్పడానికి వచ్చావు కదా అంటూ సంతోషంలో మునిగిపోయింది.

నోరు మూయవే మోనిత అంటూ..
మోనితను కోపంగా చూస్తూ.. నోరు మూయవే అని కార్తీక్ అంటే.. అప్పడే నా పెళ్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు.. నా పెళ్లాం పేరు దీప.. చచ్చే వరకు ఆమె నా భార్య. నీ లాంటి మోసగత్తెలు వెయ్యి మంది వచ్చినా నా కాలి గోటితో సమానం అంటూ కార్తీక్ అంటే.. ఆపు కార్తీక్.. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. దీప నీకు భార్యే. కానీ నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నువ్వే కార్తీక్. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంతకు మించి ఆప్షన్ లేదు. నీవు ఎస్ అనాల్సిందే అంటూ దీప అంది. దాంతో ఈ సమస్యకు పరిష్కారంతోనే వచ్చాను. కానీ సమస్యకు పరిష్కారం పెళ్లి కాదు.. నీ చావు అంటూ కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నావు.. చావా? నాదా నేనెలా చస్తావు.. ఎప్పుడు చస్తాను అని అంటే ఇప్పుడే.. నా చేతిలోనే.. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? కేవలం నన్ను ప్రేమించింది అని, నేను ప్రేమించానని హిమను చంపించావు. అందుకే నిన్ను చంపుతాను అని కార్తీక్ కోపంతో ఊగిపోయారు. దాంతో ఎపిసోడ్‌కు ముగింపు పలికారు.
Recommended Video

కార్తీక్ అరెస్ట్‌తో షాక్..
అయితే తదుపరి ఎపిసోడ్‌లో దీప ఇంటికి ఏసీపీ రోషిణి వచ్చింది. ఆమెను చూసిన దీప.. రండి మేడం.. మీ వద్దకే వద్దామని అనుకొంటున్నాను అని అంటే.. లొంగిపోవడానికా? అంటూ రోషిణి షాకిచ్చింది. మోనితను చంపి శవాన్ని ఎక్కడ పెట్టావు. మోనితను కార్తీక్ చంపి శవాన్ని మాయం చేశాడు అంటూ రోషిణి చెప్పడం కనిపించింది. కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, ఆయనను చూసి కుటుంబం, దీప, పిల్లలు ఏడుస్తూ ఉండటం మరో ట్విస్టు ఇచ్చి తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచారు


Click it and Unblock the Notifications











