Karthika Deepam Episode 1119: మోనితకు రివాల్వర్ గురిపెట్టిన కార్తీక్.. ఆ తర్వాత ఏమైందంటే?

హిమను మోనిత చంపించిందనే విషయం తెలుసుకొన్న డాక్టర్ కార్తీక్ ఆవేశంతో ఊగిపోయాడు. మోనిత బండారాన్ని బయటపెట్టేందుకు మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్‌కు తాను చేసిన అన్ని రకాల కుట్రలను తనకు తానుగా బయటపెట్టుకొన్నది. అంతేకాకుండా తాను చేయించిన వికృత పనులను సమర్ధించుకొన్నది. అత్యధిక టీఆర్సీ రేటింగ్‌తో దూసుకుపోతున్నకార్తీకదీపం సీరియల్‌లో మరో హైడ్రామా చోటు చేసుకొన్నది. 1113 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

నిన్ను చంపాలని వచ్చాను అంటూ

నిన్ను చంపాలని వచ్చాను అంటూ

హిమను చంపించి నందుకు నిన్ను చంపాలని వచ్చాను అంటూ కార్తీక్ చేసిన వ్యాఖ్యలపై మోనిత షాకింగ్‌గా స్పందిస్తూ.. ఏంటీ..నేను హిమను చంపానా? శభాష్.. దీప భలే పనిచేసింది. మన పెళ్లి ఆపడానికి ఈ రూట్‌లో వచ్చిందా? పిచ్చి కార్తీక్ ఇలాంటి ఆరోపణలను నీవు ఎలా నమ్మావు. ఆ కారులో నువ్వు ఉన్నావు అని, అందులోను ఆ కారును గుద్దింది లారీ. అదేమీ రివాల్వర్ కాదు.. గురి చూసి చంపడానికి. ఆ వంటలక్క దగ్గర ఏ అధారం ఉందని అంటూ మోనిత ప్రశ్నించింది.

 దీప షూట్ చేసిన వీడియోను ముందుంచి

దీప షూట్ చేసిన వీడియోను ముందుంచి

మోనిత బుకాయింపును తట్టుకోలేక.. ఆ ఆధారం నువ్వే అంటూ సూర్యాపేటలోని రెస్టారెంట్‌లో దీప షూట్ చేసిన వీడియోను ముందుంచాడు. అందులో హిమను చంపిచినట్టు చెప్పిన విషయాలను చూసి మోనిత నివ్వెరపోయింది. వంటలక్క ఇచ్చిన ఆధారమే ఇదే. నా భార్య నీ నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. నీవు ఆడదానివేనా? నీవు ఓ మనిషివేనా.. నీకు ఎలా మనసు వచ్చింది. కన్నతల్లి ఎంతో కష్టపడి హిమను డాక్టర్‌గా చూడాలని ఎన్నో కలలు కంటే.. ఆ కలలన్నీ బూడిదగా మార్చేశావు కదే. నిన్ను ఏం చేసిన పాపం లేదు అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 నమ్మితే ఇంత వంచనా?

నమ్మితే ఇంత వంచనా?

దీపపై కోపంతో రగిలిపోతూ... హిమ నిన్ను నమ్మింది. నేను నిన్ను నమ్మాను. నా ప్రేమను చంపేశావు. నీది ఎంత దారుణమైన మనస్తత్వమే. ఎంత నీచమైన మనస్తత్వమే. కన్న తల్లి చెప్పిన నమ్మలే. కట్టుకొన్న భార్య చెప్పిన భార్య వినలేదు. స్నేహానికి శ్రేయోభిలాషి నువ్వే అనుకొంటే మోసి చేసి నీ వికృతరూపం చూపించావు. నీ వెన్నుపోటు చూసిన తర్వాత రక్తపిశాచిలా కనిపిస్తున్నావు. నీవు నా దృష్టిలో మనిషి కావు. ఒక అడవి మృగానికివి. ఇప్పడు ఏం సమాధానం చెబుతావు అని కార్తీక్ నిలదీశాడు.

నా ప్రేమ గాఢమైంది అంటూ

నా ప్రేమ గాఢమైంది అంటూ

హిమను చంపించిన నీవు ఇప్పుడే సమాధానం చెబుతావంటే.. అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఉంది. నేను దానికి ప్రిపేర్ అయి ఉన్నాను. అందుకు కారణం ప్రేమ అంటూ మోనిత తన స్టైల్‌లో సమాధానం చెప్పింది. నువ్వంటే పిచ్చి ప్రేమ. చూశావా కార్తీక్.. నా ప్రేమ ఎంత గాఢమైందో తెలుసా? నీ ప్రేమ కోసం, నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం ఎంత రిస్క్ తీసుకొన్నానో నీకు తెలుసా? ప్రాణాలు నిలబెట్టే వృత్తిలో ఉన్న నాకే ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లానంటే.. నీవంటే పిచ్చి ప్రేమ. నీకు ఇంకా చాలా నిజాలు తెలియవు. నా ప్రేమ ఎంత అద్భుతమైందో తెలియడానికి ఛాన్స్ ఇస్తున్నాను అంటూ మోనిత తనలోని ప్రేమను బయటపెట్టుకొనే ప్రయత్నం చేసింది.

 హిమనే కాదు.. దీపను కూడా చంపించాలని

హిమనే కాదు.. దీపను కూడా చంపించాలని

నీవు హిమ చావు గురించి తెలిస్తేనే ఇంత లాగా తయారయ్యావు. కానీ నేను నీ కోసం నీ ప్రేమ కోసం.. నిన్ను నా సొంతం చేసుకోవడానికి.. నీ భార్య దీపను చంపించడానికి దుర్గతో బేరం కుదుర్చుకొన్నాను. నీకు ఆ సంగతి తెలుసా? అయినా దీప బతికింది. యాక్సిడెంట్ నువ్వే చేయించావని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నీపై మనసు విరగిపోవడానికే చేశాను. నిన్ను నీ భార్యను విడదీయడానికి విహారిని అడ్డుపెట్టుకొన్నా. ఇవన్నీ ఎందుకు అనుకొన్నావు.. ప్రేమ.. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నా ప్రేమలో ఎంత నిజాయితీ, నీతి ఉందో తెలుసా? నీ భార్య మీద అనుమానం కలుగడానికి ముందే నీ మీద నీకు అనుమానం కలిగేలా చేశాను. నీకు పిల్లలు పుట్టరని నేను నమ్మించాను. దాంతో నువ్వు దీపను వదిలేశావు అంటూ మోనిత చెప్పుకొంటూ పోయింది.

దీపకు స్లో పాయిజన్ ఇచ్చింది నేనే

దీపకు స్లో పాయిజన్ ఇచ్చింది నేనే

నీ ప్రేమ కోసం ఆడదానిని అనే విషయాన్ని మరిచిపోయాను. చూశావా నా ప్రేమ ఎంత గొప్పదో.. దీప డెలీవరి సమయంలో స్లో పాయిజన్ ఇచ్చాను. అప్పుడు దుర్గ వచ్చి నన్ను లాక్కుపోయాడు. లేకపోతే దీప కూడా చచ్చిపోయేది. నువ్వే భారతీతో ట్రీట్‌మెంట్ చేయించి బతికించావు. అప్పుడు నీ భార్య పాదాలు పట్టుకొని నన్ను క్షమించు దీప అంటుంటే.. నా గుండెల్లో కలుక్కు మన్నది తెలుసా? మీ ఇద్దరు కలిసిపోతే.. ఒక్కటైపోయి కలిసి కాపురం చేస్తే.. మరీ నేను, నా ప్రేమ ఏమైపోవాలి అంటూ మోనిత తనలోని విషయాలన్నీ బయటపెట్టింది.

ఆ రకంగా బిడ్డను కనాలని కుట్ర

ఆ రకంగా బిడ్డను కనాలని కుట్ర


ఎలాగైనా నిన్ను దక్కించుకోవడానికి ప్లాన్ చేశాను. . అందుకే నిన్ను సొంతం చేసుకోవడానికి ఏ ఆడది చేయని సాహసం చేశాను. అందుకే నీతో కడుపు తెచ్చుకొన్నాను. నీకు సంతానం అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇచ్చిన శాంపిల్‌తో నేను ఆర్టిఫియల్‌గా గర్బం తెచ్చుకొన్నాను. ఎలాగైతే కార్తీక్.. ఇప్పుడు నా గర్బంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నీవే అంటే నీవు కాదంటావా అంటూ మోనిత ఆనందంలో మునిగిపోయింది. ఈ బిడ్డకు నాన్న కావాలి. నువ్వు నాకే సొంతం అవ్వాలి. మనం పెళ్లి చేసుకోవాలి అంటూ మోనిత ఇంకా ఆశతో నటించే ప్రయత్నం చేసింది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
రివాల్వర్ గురిపెట్టిన కార్తీక్

రివాల్వర్ గురిపెట్టిన కార్తీక్

కానీ మోనిత నిజస్వరూపం తెలుసుకొన్న కార్తీక్.. ఇక క్షమించలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందులో హింసను చూడకు ప్రేమను చూడు అంటూ మోనిత అంటే.. నోర్మూయ్ అని గట్టిగా అరిచాడు. ఇది ప్రేమ అంటారా? నిన్ను మనిషి అంటారా. ఇంత చేసిన నిన్ను చంపేస్తాను అంటూ మోనితకు కార్తీక్ రివాల్వర్ గురిపెట్టారు. నిన్ను చంపకుండా వదిలిపెట్టనంటూ పిచ్చి పిచ్చిగా అరిచాడు. ఇలా కార్తీక దీపం సీరియల్‌లో మోనిత, కార్తీక్ మధ్య హైడ్రామా నడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X