రికార్డు క్రియేట్ చేసిన ‘కార్తీక దీపం’: ఇండియాలోనే నెంబర్ వన్.. దాని వల్లే ఈ ఘనత సొంతం!

తెలుగు బుల్లితెరపై పదుల సంఖ్యలో సీరియళ్లు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కార్తీక దీపం' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం ఈ సీరియల్ దాదాపు మూడున్నరేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్‌లోనే వెలుగొందుతోంది. అదే సమయంలో ఎపిసోడ్లు గడుస్తున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ ధారావాహికకు ఈ మధ్య కాలంలో రెస్పాన్స్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 'కార్తీక దీపం' తాజాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

మలయాళం నుంచి తెలుగులో రీమేక్

మలయాళం నుంచి తెలుగులో రీమేక్

ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభమై.. తక్కువ సమయంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది ‘కార్తీక దీపం'. తెలుగులోకి రావడానికి ముందే మలయాళంలో ‘కరుతముత్తు' అనే పేరుతో ఇది ప్రసారం అయింది. దీపను ప్రేమ వివాహం చేసుకుని.. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను డాక్టర్ బాబు అనుమానించడం.. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఎలా కలిశారన్న కథతో ఇది వస్తోంది.

దీప పాత్రకు స్పందన.. బజ్ పెంచింది

దీప పాత్రకు స్పందన.. బజ్ పెంచింది

తెలుగులో ‘కార్తీక దీపం' సీరియల్ ఇంత క్లిక్ అవడానికి అందులో దీప అలియాస్ వంటలక్క పాత్రను చేస్తోన్న హీరోయిన్‌ ప్రేమీ విశ్వనాథ్ కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీని తెలుగు ప్రేక్షకులు సొంత మనిషిని చేసేసుకున్నారు. తద్వారా ఆమె తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. అందుకే భారీ స్థాయిలో ఫాలోయింగ్ అందుకుంది.

టీఆర్పీలో దూకుడు... రికార్డులు బ్రేక్

టీఆర్పీలో దూకుడు... రికార్డులు బ్రేక్

గతంలో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లు వచ్చాయి. కానీ, అవేమీ భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకోలేదు. అయితే, ‘కార్తీక దీపం' మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 1000కి పైగా ఎపిసోడ్లతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న దీనికి ఊహించని విధంగా రేటింగ్ వస్తోంది. దీంతో తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోనే నెంబర్ వన్ సీరియల్‌గా మారిపోయింది.

ఆ మలుపు నుంచి మరింత రెస్పాన్స్

ఆ మలుపు నుంచి మరింత రెస్పాన్స్

ఆరంభంలో ఎంతో ఆసక్తికరంగా సాగిన ‘కార్తీక దీపం'.. దీపను డాక్టర్ బాబు వదిలేసిన తర్వాత కొంత మందగించింది. అప్పుడు దీనికి స్పందన కొంత మేర తగ్గింది. కానీ, ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది. దీనికి కారణం.. దీప విషయంలో తాను చేసిన పొరపాటును డాక్టర్ బాబు తెలుసుకోవడమే. అతడు మారినప్పటి నుంచి సీరియల్ ట్రెండ్ సెట్ చేసేస్తుంది.

కోలుకున్న దీప... షాకిచ్చిన మోనిత

కోలుకున్న దీప... షాకిచ్చిన మోనిత


దీపకు క్యాన్సర్ రావడంతో ‘కార్తీక దీపం' అభిమానులు తెగ బాధ పడిపోయారు. దీంతో ఆమె పాత్రను చంపేసే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తామని కూడా బెదిరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వంటలక్క కోలుకుంది. దీంతో కథ సుఖాంతం అవుతుందని అంతా అనుకున్నారు. అంతలో మోనిత వచ్చి తాను ప్రెగ్నెంట్ అని.. దానికి డాక్టర్ బాబే కారణం అని చెప్పి బాంబు పేల్చేసింది.

రికార్డులు క్రియేట్ చేసిన ‘కార్తీక దీపం’

రికార్డులు క్రియేట్ చేసిన ‘కార్తీక దీపం’

‘కార్తీక దీపం' సీరియల్‌కు దాదాపు మూడేళ్లుగా భారీ స్థాయిలో రేటింగ్ వస్తూనే ఉంది. దీంతో బుల్లితెరపై రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో గతంలో ఓ వారం రోజులకు ఇది 20.80 టీఆర్పీ రేటింగ్‌ను సాధించి బుల్లితెరపై చరిత్రను సృష్టించింది. ఇక, ఇప్పుడు దాన్ని బీట్ చేస్తూ గత వారానికి 21.10 రేటింగ్‌ను అందుకుంది. దీంతో ఊహించని ఘనతను సొంతం చేసుకుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్

ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్

‘కార్తీక దీపం' సీరియల్ వారం రోజులకు 21.10 టీఆర్పీ రేటింగ్‌ను సంపాదించడంతో.. ఇది భారతదేశంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా రికార్డును క్రియేట్ చేసింది. అంటే.. మిగిలిన భాషల్లో వస్తున్న సీరియళ్లు అన్నీ ఈ రేంజ్‌లో రేటింగ్‌ను అందుకోలేదని అర్థం. అంతలా ‘కార్తీక దీపం'కు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ఫలితంగానే ఇది ఇప్పటికే పలుమార్లు ఈ తరహా రికార్డును కొట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X