Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లోకి కార్తీకదీపం హీరో.. క్లారిటీ ఇచ్చేసిన నిరుపమ్ పరిటాల!
బిగ్ బాస్ తెలుగు షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాకుతోందీ రియాల్టీ షో. అందరినీ తెగ అలరిస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేసే ఈ షోకు పెద్ద ఎత్తునే అభిమానులు ఉన్నారు. విపరీతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ.. అన్ని భాషల్లో సక్సెస్ సాధిస్తున్న ఈ షోను తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8 షో కూడా రాబోతుంది. అయితే ఈ సీజన్ కు కార్తీకదీపం హీరో నిరుపమ్ పరిటాల రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నేరుగా ఆయనే స్పదించారు. ఆ విశేషాలు అంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో రచ్చ సాగింది. విపరీతమైన టీఆర్పీ కూడా వచ్చింది. ఇదే ఊపులో బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఓటీటీ సీజన్ 2 ను ప్రారంభించబోతున్నారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఫిబ్రవరి నెల నుంచే ఈ సీజన్ కూడా ప్రారంభం కానుందని అంతా అనుకున్నారు. కేవలం ఈ సీజన్ మాత్రమే కాదు.. ఇందులోకి వచ్చే కంటెస్టెంట్లు కూడా ఫైనల్ అయినట్లు టాక్ నడిచింది. గత సీజన్ లో పాల్గొన్న భోలె షవాళి, తెలగులో ఓ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రిచా పనయ్ ను తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష, నటుడు భద్రం, డ్యాన్స్ మాస్టర్ యశ్, సింగర్ పార్వతిలను తీసుకు వస్తున్నారని అనుకున్నారు. వీరందరినీ కన్ఫార్మ్ చేసినట్లు కూడా అంతా భావించారు. కానీ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 ఊసే లేకపోవడంతో.. అంతా ఆశలు వదిలేసుకున్నారు. చాలా రోజులుగా ఓటీటీ సీజన్ వస్తుందని అంతా అనుకున్నా ఎలాంటి న్యూసూ రాలేదు. ఇక ఓటీటీ సీజన్ రాదని అంతా ఫిక్స్ అవుతున్న ఈ సమయంలోనే మరో కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అందరూ కూడా కచ్చితంగా త్వరలోనే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ వస్తుందని అనుకుంటున్నారు.
కేవలం ఈ సీజన్ రావడమే కాదండోయ్.. ఓ బుల్లితెర హీరో కూడా ఈ సీజన్ లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈయనే కార్తీకదీపం సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ ఈ విషయాన్ని నేరుగా చెప్పారు. మీరు బిగ్ బాస్ కు వెళ్లే అవకాం ఉందా అని అడగ్గా.. ఏమో చెప్పలేం.. అప్పుడు వెళ్లాలనిపిస్తే వెళ్తానంటూ వివరించాడు. కానీ శోభాశెట్టి, అమర్ దీప్ వాళ్ల లాగా తనకు అంత కచ్చితంగా వెళ్లాలనే కోరిక అయితే లేదని.. కానీ అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తానని పేర్కొన్నాడు.

అంతేకాకుండా తాను ఏం చేయాలనుకున్న తన భార్య సపోర్ట్ ఉంటుందని.. దేనికైనా ఓకే చెప్పాలనుకుంటే వెంటనే ఓకే చెప్పగల్గుతానని కూడా వివరించాడు నిరుపమ్. దీన్ని బట్టి చూస్తే ఆయన బిగ్ బాస్ తెలుగు 8కు కచ్చితంగా వెళ్తారని అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











