Karthika deepam: హిమ, శౌర్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్ స్టార్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా..
బుల్లితెర ప్రపంచంలో ఈ మధ్య కాలంలో రియాలిటీ షోల కంటే ఎక్కువగా సీరియల్స్ డామినేషన్ ఎక్కువయ్యింది. స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్స్ పడుతున్నా కూడా రేటింగ్స్ విషయంలో గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక కార్తీక దీపం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అందులో నటించే వారి రెమ్యునరేషన్స్ గురించి రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. అయితే పెద్దవాళ్ళ సంగతి పక్కన పెడితే చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తున్న హిమ, శౌర్య పాత్రల్లో నటించిన చిన్నారులకు కూడా రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే..

కరోనా ఎఫెక్ట్ వల్ల..
స్టార్ మా లోనే కాకుండా తెలుగులో అన్ని సీరియల్స్ ను డామినేట్ చేసేలా రేటింగ్స్ అందుకుంటున్న ఏకైక సీరియల్ కార్తీక దీపం. ఈ లాక్ డౌన్ కాలంలో అయితే ఆ సీరియల్ వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. ఆ మధ్య కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కు బ్రేక్ పడడంతో పాత ఎపిసోడ్స్ ను కూడా కొత్త ప్రేక్షకులు ఎగబడి చూశారు.

గత మూడేళ్ళుగా..
డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు జనాలకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. కార్తీక్ - దీపలపై సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. వారిద్దరూ ఒకటవుతారా లేదా అనే పాయింట్ తోనే గత మూడేళ్ళుగా సిరియల్ ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తున్నారు. ఇక శ్రావ్య, హిమ పాత్రలతో కూడా రోజురోజుకు మరింత ఆసక్తిని పెంచేశారు.

ప్రేమి విశ్వనాథ్ సాలీడ్ రెమ్యునరేషన్
ఇక ఈ సిరియల్ లో నటిస్తున్న వారికి సాలీడ్ రెమ్యునరేషన్స్ అందుతున్నాయి. సిరియల్ రేటింగ్స్ పెరుగుతున్న కొద్దీ లీడ్ యాక్టర్స్ కు పేమెంట్స్ గట్టిగానే పెంచుతున్నారు. దీప పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ కు అత్యధికంగా ఒక్కోరోజులోనే లక్షకు పైగానే పేమెంట్స్ అందుతున్నాయట. ప్రతి రోజు దాదాపు 5కు పైగానే ఎపిసోడ్స్ ని ఫినిష్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సిరియల్ తో కాస్ట్లీ లైఫ్
అదే తరహాలో డాక్టట్ బాబు కార్తిక్ గా నటించిన నిరుపమ్ పరిటాల కూడా సాలీడ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. మౌనిత, అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా ఈ సిరియలో తోనే కాస్ట్లీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ఏడాదిలోనే సిరియలో ఎండ్ అవుతుందని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. కానీ హడావుడి చూస్తుంటే ట్విస్టులతోనే మరో ఎడాది నడిపించేలా ఉన్నట్లు టాక్ వస్తోంది.
Recommended Video

హిమ, శ్రావ్యల రెమ్యునరేషన్..
ఇక అందరి రెమ్యునరేషన్స్ ఒకలా ఉంటే కార్తిక్ - దీప కుతుళ్ళుగా నటించిన హిమ, శ్రావ్యల రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిమ అసలు పేరు సహృద, శౌర్య అసలు పేరు క్రితిక. ఈ ఇద్దరికి డైలీ పేమెంట్ గా 20వేలకు పైగానే ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. అంటే ఓ వర్గం పెద్ద తరహా నటీనటులకు ఏ మాత్రం తీసిపోని విదంగా పేమెంట్స్ అందుకుంటున్నారు. ఇప్పుడే ఈ రేంజ్ లో సంపాదిస్తున్నారు అంటే భవిష్యత్తులో అంతకు మించి అనేలా పేమెంట్స్ అందుతాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











