For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత ఇంట్లో ఆ రోజు అంటూ.. కార్తీక్‌కు చేతులెత్తి దండం పెట్టిన ప్రియమణి!

  |

  కార్తీక్ వల్లే తాను గర్బవతిని అయ్యానంటూ కార్తీక దీపం సీరియల్‌లో మోనిత చేస్తున్న వాదనకు చెక్ పెట్టేందుకు సౌందర్య ఫ్యామిలీ అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీప, ఆదిత్య లాయర్‌ను కలవడం, అలాగే ఆ రోజు రాత్రి మోనిత ఇంట్లో ఏం జరిగిందో చెప్పమని ప్రియమణిని కార్తీక్ నిలదీయడం, అలాగే మోనిత ఆటలను కట్టిపడేస్తానని అర్ధపావు భాగ్యం శపథం చేయడం 1087 ఎపిసోడ్‌లో హైలెట్ అంశాలుగా మారాయి. ఇంకా తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  మోనితను తొక్కి నార తీస్తా

  మోనితను తొక్కి నార తీస్తా

  కార్తీక్‌తో పెళ్లిని ఎవరు ఆపుతారో చూస్తా.. ఈ పని చేసింది నీ అల్లుడేనా అని అనుకునేలా చేస్తాను అని మోనిత చెప్పిన మాటలపై భాగ్యం భగ్గుమన్నది. మోనితకు ఎంత ధైర్యం. నాతోనే సవాల్ చేసి పోతుందా? ఆ మోనితకు మా దీప, కార్తీక్ బాబు, సౌందర్యనే కాదు. ఈ మాస్ మహారాణి అర్ధపావు భాగ్యమే కరెక్ట్ మొగుడు. తొక్కి నార తీస్తా అంటూ భాగ్యం ఛాలెంజ్ చేసింది. దానికి మనశాంతి లేకుండా చేసి మా అల్లుడి దగ్గరికి కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తాం అంటూ భాగ్యం ప్రతీన పూనింది.

  ప్రియమణిని కార్తీక్ కలిసి

  ప్రియమణిని కార్తీక్ కలిసి

  ఇక మోనిత ఇంట్లో పనిమనిషి ప్రియమణిని కార్తీక్ కలుసుకొన్నాడు. ఆ రోజు మోనిత ఇంట్లో ఏం జరిగిందో చెప్పమని అడిగాడు. దాంతో ప్రియమణి వణికి పోయింది. దాంతో భయపడకు ప్రియమణి.. నేను నిన్ను ఏమనను. మా అమ్మ అలా పెంచలేదు. నేను పరాయి స్త్రీలపై చేయివేయడం కానీ, చేయి చేసుకోవడం తప్పని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు ప్రియమణి అంటే.. ఏం చెప్పాలి కార్తీకయ్యా అంటూ ఎదురు ప్రశ్న వేసింది.

  మోనిత నాకు స్నేహితురాలే..

  మోనిత నాకు స్నేహితురాలే..

  ప్రియమణితో మాట్లాడుతూ.. ఆ రాత్రి ఏం జరిగిందో నీ తెలుసు. మోనిత నీకు జీతం ఇస్తుందనే విషయం తెలుసు. కానీ ఇది నా జీవితం. ఎన్నో ఏళ్ల తర్వాత కలతలు దూరమయ్యాయని సంతోషపడే లోపే మోనిత ఇలాంటి వార్తను తీసుకొచ్చింది. అసలు మోనితను నేను ఎప్పుడూ స్నేహితురాలిగానే చూస్తాను. నేను ఇంటికి వస్తే ఎలా ఉంటానో నీకు తెలుసు. ఇది నిజం కాదని నీకు తెలుసు. అది అబద్ధం నాకు తెలుసు అని కార్తీక్ అన్నారు.

  నీ నోరు విప్పితేనే అసలు గుట్టు బయటకి

  నీ నోరు విప్పితేనే అసలు గుట్టు బయటకి

  ప్రియమణిని నిజం చెప్పమంటూ.. ఇది అబద్దం అని తెలిసినా ఏం చేయలేకపోతున్నాను. మోనితకు గర్బం ఎలా వచ్చిందో... దానికి నేను ఎంత బాధ్యుడిననే విషయం నాకు తెలియదు. ఆ రాత్రి జరిగిన దానికి సాక్ష్యం అడగలేను. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఆ రాత్రి నా జీవితాన్ని చీకటి చేసింది. ఈ చీకటి పోవాలంటే నీవే నోరు విప్పాలి. నా భార్య, ఇద్దరు బిడ్డల జీవితం నీ సమాధానంపైనే ఆధారపడి ఉంది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  ప్రమాణపూర్వకంగా నాకు ఏహీ తెలియదు. .

  ప్రమాణపూర్వకంగా నాకు ఏహీ తెలియదు. .

  అయితే ఆ రోజు రాత్రి జరిగిన విషయాలను మోనిత గుర్తు చేసుకొంది. అయితే మోనిత చెప్పకూడదని సైగ చేసిన విషయాన్ని, కోపంతో అద్దం పగలకొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని భయపడిపోయింది. మీరంత పెద్ద మనుషులు.. మేము చిన్న మనషులు అంటే కార్తీక్ వెంటనే.. మనిషివే కదా అని రెట్టించాడు. అయితే అయ్యా ప్రమాణపూర్వకంగా నాకు ఏమీ తెలియదు అంటూ ప్రియమణి తప్పించుకొన్నది. చేతులెత్తి దండం పెట్టడంతో కార్తీక్ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  English summary
  Karthika Deepam 10th July's Episode of 1087 goes once again with emotional content. Deepa, Soundarya talks about present situation abou Monita. Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X