Karthika Deepam మనం ఏడవొద్దు.. కార్తీక్‌ను, దీపను ఏడిపిద్దాం.. ప్రియమణితో మోనిత మరో ప్లాన్

కార్తీక్‌ పెళ్లి విషయంలో తన అంచనాలు తలకిందులు కావడంతో డాక్టర్ మోనిత అసహనంతో రగిలిపోయింది. ఇంట్లో భోజనం ప్లేట్ తెచ్చిన ప్లేట్‌ను విసిరికొట్టడంతో ప్రియమణి కంగారు పడిపోయింది. అలాగే కార్తీక్‌లో వస్తున్న మార్పుపై ఇంటి సభ్యులు చాలా సంతోషంగా ఉండిపోయారు. తన పిల్లలు శౌర్య, హిమతో కలిసి కార్తీక్ షికారుకు వెళ్లాడు. అలాగే దీప ఇంటికి మోనిత రావడం లాంటి అంశాలు తాజా ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి. 1089 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

మోనితలో కంగారు..

మోనితలో కంగారు..

కార్తీక్ తనను అనుమానించడం, ప్రియమణిని ఆ రోజు ఏమైందని ఆరా తీయడంతో మోనిత కంగారు పడింది. ఇక ఊరుకోను. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనసులో ఉన్నవాడిని క్షమించడం తప్పు. ఇంతా జరిగిన నేను కూల్‌గా ఉండటంతో నేను తప్పు చేశాను. ప్రియమణిని కూడా కార్తీక్ ఎంక్వైరీ చేశాడంటే... లాభం లేదు. మోనిత వాయిస్ ఒక్క వాయిసే సరిపోదు. ఇంకో పదునైన, తెలివైన బుర్ర కావాలి.. యస్ అంటూ మరో ప్లాన్‌కు మోనిత సిద్ధమైంది.

ఆదిత్య, శ్రావ్యలో ఆనందం

ఆదిత్య, శ్రావ్యలో ఆనందం

ఇదిలా ఉండగా, భాగ్యం వద్దకు కార్తీక్ వెళ్లి సారీ చెప్పడంతో సోదరుడు ఆదిత్య సంతోషంలో మునిగిపోయాడు. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను శ్రావ్య అంటూ.. మా అన్నయ్య ఏంటీ... సారీ చెప్పడం ఏంటీ? అన్నయ్యలో ఇంత మార్పా? అంటూ ఆదిత్య సంబరాల్లో మునిగిపోయారు. దాంతో నీవే అలా అంటే.. మా అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకో. తనను సపోర్ట్ చేసినందుకు మీరు అమ్మాలా కనిపిస్తున్నారు అంటూ మా అమ్మ భాగ్యంతో బావగారు అన్నారట... అంటూ శ్రావ్య సంతోషంలో మునిగిపోయింది.

మోనితతో స్నేహ వద్దంటే వినలేదు

మోనితతో స్నేహ వద్దంటే వినలేదు

ఇక కార్తీక్, దీప మధ్య ఎమోషనల్‌‌గా కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. మోనిత నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. నా ఇంట్లో మోనిత గీతలనే భరించలేకపోతున్నాను. మోనితను ఎలా భరిస్తాను. మీరు నాకు సవతి తెచ్చిపెడితే నేను సరిపెట్టుకోలేను. అనుమానంతో పదేళ్ల మన జీవితం అలా గడిచిపోయింది. అందరి మాదిరిగానే మరో భార్యతో నీవు ఉంటే నేను తట్టుకోలేను అని దీప చెప్పింది. అయితే అలాంటి పరిస్థితిని నీకు రాదు అంటూ కార్తీక్ అంటే.. అది నీ వల్ల కాదు.. ఆ విషయం మీ ముఖంమే చెబుతున్నది అంటూ దీప సమాధానం ఇచ్చింది.

విలువలున్న మనిషితో అంటూ దీప

విలువలున్న మనిషితో అంటూ దీప

కార్తీక్‌తో మరింత లోతుగా మాట్లాడుతూ.. మోనిత మనిద్దరిని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నదని నేను చెబితే నమ్మలేదు. నా మాట పట్టించుకోలేదు. విలువైన మనిషితో కాకుండా విలువలున్న మనిషితో ఉండాలని చెప్పాను. మోనిత మీ స్నేహమే ఇంతంటి పరిస్తితికి దారి తీసింది అంటే.. నా ప్రమేయం లేకుండా జరిగిన విషయాన్ని మీరు నమ్ముతున్నారా? అంటే.. ఆ విషయంపై మీ మనసే నమ్ముంతుదని మీ వ్యవహారం అర్ధమవుతున్నది అంటూ దీప షాకిచ్చింది. ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ఆ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. పిల్లలతో సంతోషంగా గడపండి డాక్టర్ బాబూ అంటూ దీప సానుకూలంగా స్పందించింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
ఇక చాలు అమ్మా అంటూ ప్రియమణి

ఇక చాలు అమ్మా అంటూ ప్రియమణి

మోనిత వ్యవహారాన్ని చూసి పనిమనిషి ప్రియమణి కంగారు పడిపోయింది. అశాంతితో రగిలిపోతున్న మోనిత బయటకు వెళ్లి మళ్లీ ఏ విషయం తలమీదకు తెచ్చుకొంటుందో అంటూ భయపడిపోయింది. అదే విషయాన్ని మోనితతో చెప్పి.. ఇక చేసింది చాలూ.. నీవు ఏమై పోతావనే భయం వెంటాడుతున్నది. ఇక చాలామ్మా.. అని ప్రియమణి భోరును విలపించింది. అక్కా ఇక ఆపేయ్ అంటూ కంటతడి పెట్టుకొన్నది. దాంతో.. లేదు.. మనం ఏడవడం కాదు.. వాళ్లను ఏడిపిద్దామని మోనిత చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X