Karthika Deepam July 13: చెప్పులు, చీపిరితో సన్మానం అంటూ దీప వార్నింగ్.. చిటికెలు వేసి హెచ్చరించిన మోనిత

కార్తీక్‌తో పెళ్లి విషయం దీపతో మాట్లాడానికి వచ్చిన మోనితకు గట్టి షాక్ తగలింది. నా మెడలో తాళి ఉండగా.. నీ మెడలో తాళి పడదు. నీవు తప్పుల మీద తప్పులు చేసే అసమర్ధురాలివి అంటూ దీప గట్టిగా కామెంట్ చేసింది. నా మొగుడు నా భర్త. నా పెనిమిటి గౌరవనీయమైన కుటుంబంలో పుట్టిన వాడు. నీలాగా గాలికి పుట్టి, చిత్తు కాగితంలా పెరిగిన దానికి నా భర్త, కుటుంబం తలవంచాల్సిన అవసరం లేదు అంటూ దీప క్లాస్ పీకింది. ఇంకా 1090 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

నువ్వే గజగజ వణికిపోతున్నావు

నువ్వే గజగజ వణికిపోతున్నావు

కార్తీక్‌తో పెళ్లికి ఆశ పడుతున్న మోనితకు క్లాస్ పీకుతూ.. పిచ్చి పిల్లా.. ఆకాశానికి నిచ్చెనలు వేయకు. అందని దానికి శీలాన్ని త్యాగం చేయకు. 25వ తేదీన మాత్రం గుండె నొప్పి వస్తే హాస్పిటల్‌లో చేరు. నీ అంచనాలు తలకిందులు అయి పిచ్చెక్కితే పిచ్చాసుపత్రిలో చేరు. ఆ గోడ మీద గీసిన గీతలను నేను తుడిపేశా. మేమేమి గజగజ వణికిపోవడం లేదు. రివర్స్‌లో మీరే గజగజ వణికిపోతున్నావు. ఆ గీతను నేనే చెరిపేసా.. నీ తల రాతను నేనే మార్చేస్తా. ఆ గోడ మీద కనిపించే మరకాల్లో మా జీవితాల్లో నీవు ఒక మరకవు మాత్రమే. అది ఉంటే ఎంత చెరిపేస్తే ఎంత.. పోవే.. అంటూ దీప కసురుకొన్నది.

 మోనితకు దీప క్లాస్ పీకి..

మోనితకు దీప క్లాస్ పీకి..

మోనితకు క్లాస్ పీకుతూ ఇప్పుడంటే వదిలేస్తున్నావు. మరోసారి నీ మొగుడు నాకే సొంతం అంటూ వచ్చావో.. శ్రీరాం బస్తీ ఆడవాళ్లు చెప్పులు, చీపిరి పట్టుకొని ఊరి పొలిమేర వరకు తరిమేస్తారు. మళ్లీ ఒకసారి నా జోలికి రావాలంటే గజగజ వణికి చస్తావు.. గెట్ అవుట్ అంటూ మోనితకు గట్టి షాక్ ఇచ్చింది. దాంతో నీ అంతు చూస్తా.. మీ అందరి అంతు చూస్తా అంటూ మోనిత చిటికెలు వేస్తూ మోనిత ఆవేశంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

 భాగ్యానికి ప్రియమణి షాక్

భాగ్యానికి ప్రియమణి షాక్

ఇక మోనిత ఇంటికి సంచి పట్టుకొని భాగ్యం వెళ్లింది. శీలవతి అయిన గర్బవతి మోనితను పిలువు అంటే.. డాక్టరమ్మ లేదు అని సమాధానం చెప్పింది. అయితే కాఫీ పెట్టు మోనిత వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అంటూ సమాధానం చెప్పింది. కాఫీ పెడితే నా ఉద్యోగం పోతుంది. అయితే నీకు ఎంత సాలరీ ఇస్తున్నారంటూ అడిగితే పాతిక వేలు అని ప్రియమణి చెబితే.. నీకు అంత సాలరీ ఇచ్చేవాళ్లు పిచ్చి వాళ్లైనా ఉండాలి.. లేదంటే నీవు అబద్దమైనా చెప్పాలి అంటూ భాగ్యం గట్టిగా అరిచింది. ఆ తర్వాత నా వద్ద ఉద్యోగం ఉంటావా? నీకు 35 వేలు ఇస్తాను అంటే.. పనిమనిషికి 35 వేలు ఇచ్చే వాళ్లు పిచ్చి వాళ్లైనా ఉండాలి లేదా నీ మాటలు అబద్దాలైనా అయి ఉండాలి అంటూ ప్రియమణి కౌంటర్ ఇచ్చింది.

కార్తీక్ గురించి దీపతో ఆదిత్య

కార్తీక్ గురించి దీపతో ఆదిత్య

దీప ఇంటికి మరిది ఆదిత్య వచ్చి.. ఆమెతో కులసా ప్రశ్నలు మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే చాలా మార్పులు వచ్చాయి అని అంటే.. మేమిద్దరి మౌనంగా ఉండటం మానేశాం. మౌనానికి ఎదుటి మనిషి హృదయాన్ని ముక్కలు చేసే శక్తి ఉంది. మీలానే అన్నయ్య ఆలోచిస్తున్నాడు. భాగ్యం అత్తమ్మ వద్దకు వెళ్లి మంచిగా మాట్లాడాంట అంటే.. మా పిన్నితో మంచిగా మాట్లాడాడా.. అని దీప ప్రశ్నిసతే.. అవును మంచిగా మాట్లాడితే మనసులు కలుస్తాయని అన్నయ్య కార్తీక్ తెలుసుకొన్నాడని ఆదిత్య చెప్పడంతో దీప ముఖంలో ఆనందం కనిపించింది.

ఏసీపీ రోషిణి కలిసిన మోనిత

ఏసీపీ రోషిణి కలిసిన మోనిత

దీప ఇంటి నుంచి మోనిత నేరుగా ఏసీపీ రోషిణి ఇంటికి వెళ్లింది. ఎవరు అంటూ రోషిణి అంటే.. దీప మిస్సింగ్ కేసులో నన్ను విచారించారు. కానీ నా తప్పు లేకపోవడంతో నన్ను వదిలిపెట్టారు అని మోనిత అంటే.. మీరు, కార్తీక్ ఫ్రెండ్స్ కదా అంటే అవును అని మోనిత సమాధానం చెప్పింది. ఇంట్లో ఎవరు లేరా అని మోనిత అంటే.. నేను ఆశ్రమం నడపటం లేదే.. నేను ఏ బంధాలకు లొంగని మనిషిని. నేను, నా డ్యూటి, ఏకాంతం నాకు ఇష్టం అంటూ ఏసీపీ రోషిణి చెప్పింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనితకు క్లాస్ పీకిన ఏసీపీ

మోనితకు క్లాస్ పీకిన ఏసీపీ

రోషిణి ప్రశ్నించడంతో నాకు అన్యాయం జరిగింది. కడుపులో బిడ్డ పెరుగుతుంది అని మోనిత అంటే.. నీకు పెళ్లైందా? అని రోషిణి ఎదురు ప్రశ్న వేసింది. దాంతో కాలేదు అని సమాధానం ఇచ్చింది. దాంతో రోషిణి శభాష్.. మీరు ఒక డాక్టర్ కదు. ఎందుకలా తొందరపడ్డారు అంటే.. నేను దగా పడ్డానని సమాధానం చెప్పంది. కార్తీక్‌తో నేను గర్భవతిని అయ్యాను అంటే.. ఆయనకు పెళ్లి జరిగింది కాదా.. అంటే గౌరవమైన ప్రొఫెషన్‌లో ఉంటూ ఎలాంటి పనా? సమాజం హర్షిస్తుందా అంటూ ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X