Karthika Deepam July 14: నీ ఇంటికి వచ్చా.. నీ నట్టింటికి వచ్చా.. మోనిత దుమ్ము దులిపిన భాగ్యం

కార్తీకదీపంలో ట్విస్టుల పర్వం అలానే కొనసాగుతున్నది. ఏసీపీ రోషిణికి మోనిత ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో నిజాలు తెలుసుకోవడానికి దీప ఇంటికి ఏసీపీ వెళ్లింది. అలాగే మోనిత ఆటకట్టించడానికి నేరుగా మోనిత బెడ్రూంలోకి భాగ్యం దూరింది. ఇలా రకరకాల ఎమోషన్స్ మధ్య 1091 ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఏసీపీ రోషిణితో దీప

ఏసీపీ రోషిణితో దీప

నా పేరు దీప. నా భర్త పేరు డాక్టర్ కార్తీక్. మాకు ఇద్దరు కవలలు. మా అత్త, మామగారు కోటీశ్వరులు. సొసైటీలో మంచి పేరు ఉందో తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మోనితకు మా వారు కొత్త కాదు. ఇద్దరు కలిసి చదువుకొన్నారు. మేము మావారు పదేళ్లు విడివిడిగా ఉన్నాం. గత పదేళ్లలో జరగని తప్పు.. మేము కలుస్తున్నామనే సమయంలో ఎలా జరిగింది. పెళ్లైన మగాడితో ఇలాంటి పనులు చేయడం సమంజసమా. ఈ విషయంలో నిజం తేల్చండి అంటూ ఏసీపీ రోషిణికి దీప చెప్పింది.

మీ ఆయన తప్పు చేయలేదా?

మీ ఆయన తప్పు చేయలేదా?

దాంతో రోషిణి ప్రశ్నలకు జవాబిస్తూ.. మీ ఆయన తప్పు లేదంటావా అంటే.. తప్పో ఒప్పో పక్కన పెడితే.. తప్పు చేసి తప్పించుకొని తిరగడం లేదు కదా.. మోనితను కలిసి ఇది తప్పు అని చెప్పాడంటా? అని మోనిత అంటే.. మీ ఆయనను వెనుకేసుకు వస్తున్నావా? అని ఏసీపీ ప్రశ్నించింది. దాంతో లేదు.. ఆయన నన్ను ఆదర్శం వివాహం చేసుకొన్నారు. మా మధ్య ఏవో కలతలో వేర్వేరుగా ఉన్నాం. మా పవిత్రతే మమల్ని కలిపింది. మళ్లీ మా కాపురంలో మోనిత చిచ్చు పెట్టాలని చూస్తున్నది. మీకు ఫిర్యాదు చేసి మంచి పనిచేసింది. మీరే చక్కటి పరిష్కారం చూపించండి అని సమాధానం ఇచ్చింది. ఆ సమయంలోనే అక్కడికి కార్తీక్ చేరుకొన్నారు.

 మోనిత ఇంటిలోకి భాగ్యం

మోనిత ఇంటిలోకి భాగ్యం

ఇదిలా ఉండగా, దీప సవతి తల్లి భాగ్యం మోనిత ఇంటిలోకి చేరింది. భాగ్యాన్ని చూసి చీదరించుకొన్నది. నువ్వేంటి నా గదిలో అంటూ మోనిత అంటే.. నీ పరుపు ఏమిటి? దీప నాకు సవతి కూతురు. నీవు దీపకు సవతివి కావాలనుకొంటున్నావు. కానీ కార్తీక్ బాబు మొగుడు. ఆ డాక్టర్ బాబుకు నీవు మొగుడివి. అందుకే నీ ఇంటికి వచ్చా.. నీ నట్టింటికి వచ్చా. నీ బెడ్రూంలోకి వచ్చా. మామూలుగా అయితే నాలాంటి సౌభాగ్యవతి.. నీలాంటి గర్బవతి ఇంటికి రాకూడదు అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.

నీకు సీమంత చేయడానికి పూలు, పండ్లు

నీకు సీమంత చేయడానికి పూలు, పండ్లు

ఇక అంతటితో ఆగకుండా . నీకు సీమంతం చేయడానిక పూలు పండ్లు తెచ్చాను. నీకు సీసరింగ్ తప్ప సీమంతం చేయడం తెలియదు అంటూ మోనితపై భాగ్యం ఘాటుగా స్పందించింది. నీవు మామూలు ఆడదానివా? పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నావు. అందరూ వచ్చి నీకు అక్షింతలు వేయాలి కదా అంటూ భాగ్యం మాటల తూటాలను వదిలింది. నీ వీధి కుళాయి,.. గయ్యాళితనం నావద్ద కదురవంటూ మోనిత అంటే.. నా గయ్యాళితనం ఇలా ఉండదు.. బిందెతో కొడితే బొక్క పడిపోతుంది అని భాగ్యం హెచ్చరించింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
నీ కడుపు సంగతి తేల్చేదాకా ఇక్కడే

నీ కడుపు సంగతి తేల్చేదాకా ఇక్కడే

మోనితకు అలాగే షాకిస్తూ.. నీ కడుపు సంగతి తేల్చేదాక ఇక్కడే ఉంటాను అంటూ భాగ్యం అంటే... ఈ ఒక్కరోజు ఆగి రా.. నీ అల్లుడి కథేంటో చెబుతాను అని మోనిత అంటే.. కొత్త నాటకం ఆడుతున్నావా అని భాగ్యం ప్రశ్నిస్తే.. నీవు నాకు సీమంతం చేస్తావో.. లేదా నీ కూతురుకి పిండప్రధానం చేస్తావో రేపు తెలుస్తుంది అంటూ మోనిత షాకిచ్చింది. దాంతో మోనిత మాటలకు భాగ్యం కంగారు పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X