Karthika Deepam Today Episode 1093 ప్రెగ్నెన్సీకి కారణం అదే.. మోనిత బండారం పెట్టిన ప్రియమణి..!
కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్‌తో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న మోనితకు దీప, భాగ్యం గట్టిగా క్లాస్ పీకడంతో భారీగా వార్నింగ్ ఇచ్చారు. 25వ తేదీన పెళ్లి కావాలా? జైలు కావాలా అంటూ హెచ్చరించారు. దీప, భాగ్యం ఇచ్చి డోస్‌తో మోనితకు కాళ్ల కింద భూమి కదలినట్టు అయింది. అలాగే చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్న కార్తీక్ తండ్రి కోసం పిల్లలు, దీప అందరూ సౌందర్య ఇంటికి వెళ్లారు. ప్రియమణిని, విచారించేందుకు ఏసీపీ సిద్ధమైంది. ఇంకా ఈ ఎపిసోడ్ 1093 ఏం జరిగిందంటే..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఇళ్లంతా కళకళలాడుతుండటంతో
కోల్‌కత్తా నుంచి వచ్చిన ఆనంద్ రావు ఇంటిలో పిల్లలు, తన కొడుకులు, కోడళ్లు ఉండటంతో సంతోషపడిపోయారు. మళ్లీ చాలా రోజులకు ఇంటిలో ఆనందం ఉండటం చూసి ముచ్చటపడిపోయాడు. తండ్రితో కార్తీక్, ప్రియ, శైర్య, కోడళ్లు అందరూ ముచ్చటిస్తూ సంతోషాన్ని పంచుకొన్నారు.

ప్రియమణి ఎందుకు భయం...
ఇక ప్రియమణిని ఏసీపీ రోషిణిని విచారించడం మొదలు పెట్టింది. ఎప్పుడూ అల్లరిగా ఉండే ప్రియమణి చూసి ఎందుకు భయపడుతున్నావు? అని అడిగింది. అంతేకాకుండా నీ పేరు అంటూ అడిగితే ప్రియమణి అని చెప్పింది. దాంతో మీ పేరు ఏమిటి అని మళ్లీ అడిగితే పౌడమ్మ అంటూ అసలు పేరు చెప్పింది. దాంతో నీవు నిజం చెప్పావు. అసలు విషయం చెబితే మోనిత చంపేస్తుందని భయపడుతున్నావా? అని ఏసీపీ ప్రశ్నించింది.

బండారం బయటపెట్టిన ఏసీపీ
మోనితకు ఫోన్ చేయాలని మొబైల్ తీసి ఎందుకు చేయలేదు అంటూ ఏసీపీ ప్రశ్నిస్తే.. నేను ఫోన్ చేయడానికి ప్రయత్నించలేదు అని ప్రియమణి అంటే.. సీసీటీవీ ఫుటేజ్ తీసి చూపించింది. దాంతో అంతా నిజమే చెబుతా.. కోటింగ్ ఇచ్చే ఇద్దరి పోలీసులను పిలవకండి. మోనిత ఇంటికి కార్తీక్ వచ్చి పోతుంటాడనేది నిజం అంటూ అసలు విషయం చెప్పడం ప్రారంభించింది. వస్తూ, పోతూ ఉండటానికి మధ్య ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తే .. మోనితకు కడుపు ఎలా వచ్చింది అంటూ ప్రియమణిని ఏసీపీ నిలదీసింది.

కడుపు ఎలా వచ్చిందంటే...
మోనిత, కార్తీక్ గురించి ప్రియమణి చెబుతూ వారిద్దరు ప్రేమించుకొన్నారు. మోనిత ఎక్కువ ప్రేమించింది. కార్తీక్ తక్కువ ప్రేమించింది? కానీ కార్తీక్ తల్లి అడ్డుపడింది అంటూ ప్రియమణి చెప్పింది. అయితే మాట్లాడుకొంటే కడుపు ఎలా వచ్చింది? అంటే.. అప్పుడు వారి మధ్య అలా జరిగిపోయింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. దాంతో నీవు వెళ్లిపో.. పిలిచినప్పుడు రా.. విచారణ విషయం మోనితకు చెప్పవద్దు అంటూ ప్రియమణికి ఏసీపీ వార్నింగ్ ఇచ్చింది.
Recommended Video

పలు అనుమానాలతో ఏసీపీ రోషిణి..
ప్రియమణిని విచారించిన సమయంలో ఏసీపీ రోషిణికి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రియమణిని ఏమో.. కార్తీక్, మోనిత పెళ్లి దాక వెళ్లారు అని చెబుతున్నది. కానీ తన భర్త ఏమో అలాంటి వాడు కాదు అని దీప అంటున్నది. ఎవరు నిజం, ఎవరు అబద్దం చెబుతున్నారు అంటూ ఆలోచనల్లో పడింది.


Click it and Unblock the Notifications











