For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1094మోనిత మరో కపట నాటకం.. అందుకే మోజు పడ్డావా?ఏసీపీ విచారణతో కార్తీక్ ఉక్కిరిబిక్కిరి!

  |

  కార్తీకదీపం సీరియల్‌లో రోజు రోజుకు ట్విస్టులు పెరిగిపోతున్నాయి. కోల్‌కతా నుంచి తిరిగి వచ్చిన ఆనంద్ రావు తన కుమారుడు కార్తీక్, కోడలు దీప అనుసరిస్తున్న తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. తాను రాకముందు ఏదో జరిగింది? అది తెలుసుకోవాలి అంటూ అనందరావు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, 25న పెళ్లి జరగకుండా ఆపాలంటే నేను చేస్తే ఆగుతుందా అంటూ భాగ్యం భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా ఈ సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1094లో ఏం జరిగిందంటే..

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?

  ఇంటిలో భోజనం చేస్తుండగా..

  ఇంటిలో భోజనం చేస్తుండగా..

  ఇంటిలో అందరూ కలిసి భోజనం చేస్తుండగా మోనిత ఫోన్ మోగింది? ఫోన్ ఎత్తగానే నీకు ఓ వీడియో పంపించాను. అది మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది? అనగానే ఫోన్ పెట్టేసి హడావిడిగా లేచిపోయాడు.. ఆనందరావు ఏమిటనే లోపే.. పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేయ్ అని అంటూ పరుగు పరుగున వెళ్లిపోయాడు. ఈ లోపు కారు వద్దకు మోనిత వచ్చి ఏం జరిగిందంటే చెప్పకుండా వెళ్లిపోయాడు.

  బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం

  మోనిత సూసైడ్ అటెంప్ట్

  మోనిత సూసైడ్ అటెంప్ట్

  కార్తీక్ హడావిడిగా మోనిత ఇంటికి చేరుకోగానే డాక్టర్ భారతీ.. ఆమెకు వైద్యం చేస్తూ కనిపించింది. బెడ్‌పై చేతికి కట్టుకొని ఉండటం చూసి కార్తీక్ షాక్ అయ్యాడు. దాంతో ఏంటి కార్తీక్ ఈ సమస్యను ఇంత వరకు ఎందుకు తెచ్చుకొన్నావు. దీపతో గొడవలు అన్నీ సర్దుకొన్నాయనుకొంటే.. కొత్త సమస్య ఏమిటి? ప్రియమణి చూడకపోతే ప్రాణాలకు ప్రమాదం ఉండేది అని డాక్టర్ భారతీ అంటే.. కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. మోనిత ఆత్మహత్యాయత్నం చూసి షాక్ గురయ్యాడు.

  Kareena Kapoor Khan సరికొత్త వివాదం.. మీరెప్పుడూ చూడని రెండో కొడుకు ఫోటోలు!

  కడుపు తీసేయండి... ఏసీపీ ఎంట్రీ

  కడుపు తీసేయండి... ఏసీపీ ఎంట్రీ

  మోనిత ఆత్మాహత్యయత్నం సంఘటనతో వంట మనిషి కన్నీరు మున్నీరైంది. మా అమ్మ నెల తప్పినప్పటి నుంచి ఇవే గొడవలు. చక్కగా ఉండే మోనితకు అన్నీ కష్టాలు ఎదురయ్యాయి. ఎలాగు మత్తులో నిద్రపోతున్నాది కద.. ఆమెకు కడుపు తీసేయండి. కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ ప్రియమణి ఏడుస్తుండగా.. ఏసీపీ రోషిణి ఎంట్రీ ఇచ్చింది. అవును ప్రియమణి చెప్పినట్టు కడుపు తీసేయండి కార్తీక్.. ప్రియమణి చెప్పకపోతే మీరేవరూ నాకు ఇన్ఫార్మ్ చేయకపోయి ఉండేవారు. పెళ్లికాని తల్లికి ఎలా ఉంది? పెళ్లైన తండ్రి సేఫ్ అంటూ ఏసీపీ కామెంట్ చేస్తూ.. కార్తీక్‌ను విచారణకు తీసుకెళ్లింది.

  తప్పు ఒప్పులు తెలిసి కూడా అంటూ

  తప్పు ఒప్పులు తెలిసి కూడా అంటూ

  కార్తీక్‌ను ఏసీపీ రోషిని విచారిస్తూ ఎందుకు చేశారు ఈ పని. సమాజంలో మీరు పేరున్న డాక్టర్. మీది రాయల్ ఫ్యామిలీ. మీకు హక్కులు తెలుసు. హద్దులు తెలుసు. మంచి తప్పు చెడు అన్నీ తెలుసు. మోనిత ఇంటికి వచ్చిపోతూ ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయని తెలియదా? నేను ఎంక్వైరీ చేశాను మీరు మోనితను పెళ్లి చేసుకోవాలనుకోవడం నిజమేనా? అంటే అవును అన్నాడు. కానీ మోనితను పెళ్లి చేసుకోవాలనుకొన్నది మనసు పడి కాదు అంటే మోజు పడా అంటే కాదు.. దీపను నన్ను కలుపాలని మా అమ్మ చూస్తే.. ఉక్రోషం కోసం మోనితను పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాను అని కార్తీక్ చెప్పాడు.

  మోనితను ప్రెగ్నెంట్‌గా చూడాల్సి వచ్చింది

  మోనితను ప్రెగ్నెంట్‌గా చూడాల్సి వచ్చింది


  ఏసీపీతో కార్తీక్ అన్ని విషయాలు వివరిస్తూ.. మోనితను నేను ఫ్రెండ్‌గానే చూశాను అంటూ సమాధానం ఇచ్చారు. మీరు మోనితను ఫ్రెండ్ లాగా చూస్తే.. మేము మోనిత ప్రెగ్నెంట్‌గా ఎందుకు చూడాల్సి వస్తున్నది అని ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడప్పుడు మోనిత ఇంటికి రావడం.. వచ్చి తాగి.. మీ ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో జరిగిన తప్పు నాకు తెలియకుండానే జరిగింది. తాగి మీ ఇంటికి వెళ్తారు కదా.. వేరే ఇంటికి వెళ్లరు కదా అంటూ ప్రశ్నించింది. తాగిన మైకంలో అంటూ అనగానే.. మోనిత చెప్పేంత వరకు మా మధ్య అనైతిక విషయం నాకు తెలియుదు అంటూ కార్తీక్ అంటే.. నీ ప్రయత్నం ఉందా లేదా అనేది కాదు.. ఫలితానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ ఏసీపీ రోషిణి హెచ్చరించింది.

  దీప అనుమానించడం లేదు

  దీప అనుమానించడం లేదు


  మోనిత ఇంటికి వెళ్లిపోతూ.. కార్తీక్ మీరు దీప తప్పు చేయకపోయినా అనుమానించారు. ఇప్పుడు మీరు తప్పు చేసిన మిమ్నల్ని దీప అనుమానించడం లేదు. ప్రేమంటే అది.. ప్రేమ మోనిత కాదు. చేయి కోసుకొని బెదిరించడం కావొచ్చు. మోనిత మీద నేను జాలి పడటం లేదు. ఎవరికి న్యాయం చేస్తారు. సమాజానికి, చట్టానికి ఏం చెబుతారు.. ఆలోచించండి అంటూ ఏసీపీ వెళ్లిపోయింది.

  నా ప్లాన్ సక్సెస్ అంటూ మోనిత

  నా ప్లాన్ సక్సెస్ అంటూ మోనిత


  కార్తీక్, ఏసీపీ రప్పించడంలో తన ప్లాన్ సక్సెస్ అయిందని బెడ్ మీద నుంచే కపట నాటకాన్ని మనసులో పెట్టింది. చేయి కోసుకొని కార్తీక్‌ను, ఫోన్ చేసి ఏసీపీని, ట్రీట్ మెంట్ కోసం డాక్టర్ భారతీని రప్పించింది. నా తరుఫున సాక్ష్యం చెప్పించడానికే అంటూ మోనిత బెడ్‌లో కపట నవ్వు నవ్వుతూ మనసులో ఆనంద పడిపోయింది. ఇప్పుడు దీప ఏం చేస్తుందో.. నా నాటకం రక్తి కట్టిందంటూ మోనిత సంతోషపడిపోయింది.

  English summary
  Monita attempt suicide made another twist in the serial. Then ACP Roshini starts enquiry with Karthik of Monita complaint in Karthika Deepam 17th July's Episode. Latest episode of 1094 goes once again with emotional content. Deepa, Soundarya talks about present situation abou Monita. Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X