Karthika Deepam Today Episode July 19 కడుపు అనేది నాటకం.. ఏసీపీ ముందు మోనిత కుట్రలను బయటపెట్టిన దీప

కార్తీక్ దీపం సీరియల్‌లో మోనిత చేసే కుట్రలనకు చెక్ పెట్టేందుకు దీప, భాగ్యం ఓ ప్రయత్నించడం.. అలాగే కార్తీక్ వ్యవహారంపై తండ్రి ఆనందరావుకు అనుమానాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో తాజా ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. అలాగే మోనిత కుట్రలను ఏసీపీ రోషిణికి సాక్ష్యాలతో సహా చెప్పేందుకు సిద్ధమైంది. ఇలాంటి అంశాలతో తాజా ఎపిసోడ్ 1095‌లో ఇంకా ఏం జరిగాయంటే...

 కడుపు అనేది నాటకం..

కడుపు అనేది నాటకం..

డాక్టర్ మోనిత ఆత్మహత్యాయత్నం చేసుకొన్నదనే విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన కార్తీక్ తిరిగి ఇంటికి వచ్చారు. కార్తీక్ రాగానే మోనిత సూసైడ్ అంటెంప్ట్ నాటకం రక్తి కట్టిందా అంటూ దీప ప్రశ్నించింది. అయితే అందంతా నీకు ఎలా తెలుసు అంటూ కార్తీక్ ఆశ్చర్య పోయారు. ఆత్మహత్య చేసుకోవాలనుకొనే వాళ్లు అలా చెప్పి బెదిరించరు.

నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి అలా అన్ని ఏర్పాట్లు చేసుకొన్నది అని దీప అంటే.. అవును.. నేను వెళ్లే సరికి.. డాక్టర్ భారతీ, ఏసీపీ రోషిణి వచ్చేశారు అని కార్తీక్ చెప్పారు. కడుపు అనేది నాటకం అని తెలిసినప్పుడే మన జీవితం బాగుపడుతుంది అంటూ కార్తీక్‌తో దీప ఓ నిజం చెప్పింది.

కార్తీక్ తీరుపై తండ్రి అనుమానాలు

కార్తీక్ తీరుపై తండ్రి అనుమానాలు


మోనిత చెప్పే మాటలతో ఏసీపీ రోషిణి అనుమానిస్తే.. ఆ విషయం డాడీకి తెలిసిపోతుంది. ఈ వ్వవహారం తెలిసిపోతే నాన్న తట్టుకోలేరు అంటూ ఆలోచనలో పడిపోయాడు. అంతలోనే తండ్రి ఆనందరావు జనతా హాస్పిటల్‌కు వచ్చారు. పీకల్లోతు ఆలోచన్లో ఉంటూ తండ్రిని గుర్తు పెట్టలేక.. రండి అంటూ పిలిచాడు. దాంతో నన్ను పేషెంట్‌గా మార్చకు. నేను వచ్చే సరికి నీవు టేబుల్ తలపెట్టుకొన్న తీరు చూస్తే ఏదో అనుమానంగా ఉంది అంటూ తండ్రి ఆనందరావు సందేహాలు వ్యక్తం చేశాడు.

దీప దిమ్మతిరిగే ప్లాన్

దీప దిమ్మతిరిగే ప్లాన్


తల్లి భాగ్యంతో దీప ఓ మంచి ప్లాన్ వేసింది. తన భర్తను పెళ్లి చేసుకోవడానికి మోనిత ఎంతకైనా తెగిస్తుంది అని దీప అంటే.. అవును పోలీసుల దాకా వెళ్లిందంటే.. అది తెగించిందని అర్ధమైంది. నీవు నేను రంగంలోకి దిగాల్సిందే అంటూ భాగ్యం అంటూ చెప్పింది. దాంతో నా వద్ద ఓ ప్లాన్ ఉంది అంటూ దీప ఏదో చెప్పింది. దాంతో భాగ్యం సంతోషంలో మునిగిపోయి.. ముందు ఆ ప్లాన్ చేయి. మోనితకు దిమ్మతిరిగిపోతుంది అంటూ దీపకు ఎంకరేజ్ చేసింది.

తండ్రి దృష్టికి మోనిత, కార్తీక్ పెళ్లి విషయం

తండ్రి దృష్టికి మోనిత, కార్తీక్ పెళ్లి విషయం


తన ఫ్రెండ్ కుమారుడిని కలువడానికి తెలంగాణ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లిన ఆనంద రావుకు భయంకర నిజం తెలిసిపోయింది. అక్కడ కార్తీక్, మోనిత పెళ్లి చేసుకోబోతున్నారంటూ తన ఫ్రెండ్ కుమారుడు చెప్పడంతో షాక్ తిన్నాడు. రిజిస్ట్రార్ ఆఫీసర్ కూడా కార్తీక్, మోనిత పెళ్లి గురించి చిత్రమైన విషయాలు చెప్పడంతో షాక్ గురయ్యారు. ఈ నెల 25న పెళ్లి అంటూ అధికారి చెప్పిన విషయంతో దిగ్బ్రాంతికి గురై అక్కడి నుంచి పలు ఆలోచన్లతో బయటకు వెళ్లారు.

కార్తీక్‌ నిజాయితీ పరుడు అంటూ

కార్తీక్‌ నిజాయితీ పరుడు అంటూ


మోనిత కంప్లయింట్ గురించి చర్చించేందుకు ఏసీపీ రోషిని ఇంటికి దీప వెళ్లింది. తన కేసుల విచారణ విషయం ఎవరితోనో ఫోన్‌లో బిజీగా మాట్లాడుతూ.. ఓ టిపికల్ కేసు డీల్ చేస్తున్నాను. అప్పటి వరకు నేను ఆఫీస్‌కు రాను అంటూ చెప్పింది. మాటల్లోనే ఉంటూ దీపను చూసి లోనికి రమ్మని సైగ చేసింది. వారిద్దరూ మోనిత, కార్తీక్ మధ్య జరిగిన విషయాలను చర్చించారు. చివరకు కార్తీక్ నిజాయితీని ఏసీపీకి వివరించింది. మోనిత అబద్ధం చెప్పడం లేదు.. కానీ నిజం చెప్పడం లేదు.. అన్ని విషయాలను చెప్పడం లేదు. నా భర్తను ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తుంది అని ఏసీపికి దీప చెప్పారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
అంజిని విచారిస్తే అన్ని కుట్రలు అంటూ

అంజిని విచారిస్తే అన్ని కుట్రలు అంటూ


మోనిత కుట్రల గురించి చెప్పాలంటే అంజి అనే డ్రైవర్‌ను విచారించాలి. హిమను చంపడానికి కుట్ర చేసిందనే అంజి చెప్పిన విషయాన్ని ఏసీపీకి చెప్పింది. అంజిని విచారిస్తే అన్ని విషయాలు బయటపడుతాయని దీప తెలిపింది. కొన్ని ఫ్లాష్ విషయాలను చెప్పగానే షాక్ తిన్నంతగా ఏసీపీ కనిపించింది. దీంతో తరువాత ఎపిసోడ్స్‌పై ఆసక్తి పెంచేలా ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X