Karthika Deepam Episode 1096 దీపను చిత్తు చిత్తుగా ఓడిస్తా.. మోనిత శపథం, షాక్‌లో ఏసీపీ రోషిణి!

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ రోషిని దర్యాప్తులోకి దిగింది. అయితే మోనిత అబద్ధం చెప్పకపోయినా... నిజం చెప్పడం లేదు అంటూ ఏసీపీని దీప కలిసి కొన్ని విషయాలు చెప్పింది. హిమను చంపించిన విషయం, కారు డ్రైవర్ అంజి వ్యవహారాన్ని దీప చెప్పడంతో ఏసీపీ షాక్‌కు గురైంది. ఇంకా 1096 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

అంజిని విచారిస్తే.. అన్ని కుట్రలు

అంజిని విచారిస్తే.. అన్ని కుట్రలు

కార్తీక్‌ను పెళ్లి చేసుకోవడానికి చాలా కుట్రలు చేసింది. అంజిని విచారిస్తే అన్ని విషయాలు బయటపడుతాయి అని దీప చెప్పింది. అయితే అంజి ఎక్కడ ఉన్నాడు అని ఏసీపీ అడిగితే.. కారు డ్రైవర్ ఉద్యోగం వదిలేసి.. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. అంజిని తీసుకొచ్చి విచారిస్తే అంతా క్లియర్ అవుతుంది అని దీప చెప్పింది. ఏసీపీ ఇంటి నుంచి దీప వెళ్లిపోతూ.. మోనిత ఫిర్యాదు చేసింది కాబట్టి మీకు ఇవన్నీ చెబుతున్నాను. లేకపోతే నేను స్వయంగా మోనిత కుట్రలను బయటకు లాగేదానిని అంటూ ఏసీపీకి కౌంటర్ ఇచ్చింది.

ఆనందరావు ఆవేదనతో

ఆనందరావు ఆవేదనతో


ఇక కార్తీక్ తండ్రి ఆనందరావు ఇంటి సభ్యుల ప్రవర్తనతో ఆవేదనకు గురయ్యారు. మోనిత, కార్తీక్ పెళ్లి విషయం తెలిసి కూడా తనతో చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారో అర్ధం కావడం లేదు. సౌందర్యకు ఈ విషయం తెలియదా? తెలిస్తే అమెరికాకు ఎందుకు వెళ్తుంది? ఒకవేళ తెలిస్తే తనకు ఎందుకు చెప్పకుండా ఉంటుంది. ఈ విషయాన్ని కార్తీక్‌నే అడిగి తెలుసుకొంటాను అంటూ ఆనందరావు కోపంతో ఊగిపోయాడు.

సీన్ రివర్స్ అవుతున్నదంటూ...

సీన్ రివర్స్ అవుతున్నదంటూ...


ఇదిలా ఉండగా, కార్తీక్‌తో పెళ్లి చాలా సులభమైన విషయం అనుకొంటే అంతా రివర్స్ అయిపోతున్నది. నేను వేసిన బాణాలే నాకు తగిలేలా ఉన్నాయి. కారు డ్రైవర్ అంజి వ్యవహారాన్ని బయటకు తీసి దీప రెచ్చిపోతున్నది. దాంతో కార్తీక్‌తో పెళ్లి కష్టంగా మారుతున్నది. అంతా సీన్ రివర్స్ ఎందుకు అవుతున్నది. ఇక శిక్ష తప్పదా? దుర్గ ఆచూకీ, అంజి గాడి గురించి పదే పదే దీప తీసుకొస్తున్నది. అంజి, దుర్గ విషయాలను ఏసీపీకి చెబితే.. నా సంగతి ఏం కావాలి? ఈ విషయంలో దీపను ఆపాలి అంటూ మోనిత తనలో తాను కుమిలిపోయింది.

కార్తీక్‌ను పెళ్లి చేసుకొనే వరకు..

కార్తీక్‌ను పెళ్లి చేసుకొనే వరకు..


డాక్టర్ మోనిత కంగారులో ఉండి ఏదో ఆలోచిస్తూ జరగబోయే ప్రమాదాన్ని, దీపను ఎలాగైనా ఆపాలి అంటూ ఊగిపోయింది. .. ప్రియమణి వచ్చి.. ఎప్పుడు అలా ఉండకండి.. ఏదేదో ఆలోచిస్తూ.. ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు ఉత్తమ మనిషివి కూడా కాదు అని ప్రియమణి అంటే...కార్తీక్ నా వద్దకు వచ్చే వరకు అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటాను. దీపను చిత్తు చిత్తుగా ఓడిస్తా. అప్పటి వరకు విశ్రాంతి లేదు అంటూ మోనిత ఆవేశపడిపోయింది.

దీప ఇచ్చిన కౌంటర్‌తో

దీప ఇచ్చిన కౌంటర్‌తో


దీప తనతో అన్న మాటలతో ఏసీపీ ఆవేశ పడిపోయింది. మోనిత కంప్లయింట్ చేసింది కాబట్టి మీకు చెబుతున్నాను అని అనడంపై ఊగిపోయింది. నా సర్వీస్‌లోనే నా పై అధికారి కూడా ఇలా మాట్లాడలేదు. దీప సొంతంగా కుట్రలను బయటపెడుతానని చెప్పడం ఆమె కాన్ఫిడెన్సా? లేక ఓవర్ కాన్ఫిడెన్సా? ఇప్పటి వరకు చిన్న కేసు అనుకొన్నా.. కానీ చాలా కాంప్లికేట్ అనే విషయం అర్ధమవుతున్నది అని తనలో తాను చెప్పుకొన్నది. కానీ ఇగోలను పక్కన పెట్టి తాను ప్రొఫెషనల్‌గా డీల్ చేయాలి అంటూ కారు డ్రైవర్ అంజి గురించి ఆచూకీ కావాలని తన కింది ఉద్యోగులకు చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X