Karthika Deepam Episode 1097 నా జీవితం ఏమైపోతుంది.. విచారంలో కార్తీక్.. భర్త భుజంపై దీప చేయివేసి..!

కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి భావోద్వేగాలు భారీగా కనిపించాయి. తన కుమారుడు చేసిన తప్పును తెలుసుకొన్న ఆనందరావు ఆగ్రహంతో ఊగిపోయాడు. కార్తీక్‌ను దారుణంగా కడిగిపడేశాడు. తండ్రి కోపంతో బాధలో మునిగిపోయిన కార్తీక్‌కు దీప అండగా నిలిచింది. అలాగే మోనిత తన కుట్రలకు పదునుపెట్టింది. ఇలా 1097 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగాయంటే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

నీ దవడ పగలకొట్టి ఉంటే...

నీ దవడ పగలకొట్టి ఉంటే...

మోనిత పెళ్లి సిద్ధమైన కార్తీక్‌ను తండ్రి ఆనందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో పెళ్లికి సిద్ధపడి దీప బతుకును ఎందుకు నాశనం చేయలని అనుకొంటున్నావు. ఒకటికి రెండుసార్లు మోనితను పెళ్లి చేసుకొంటానని చెప్పిన రోజే.. నీ దవడ పగలకొట్టినట్టయితే ఈనాడు ఈ నిర్ణయం తీసుకొనే ధైర్యం వచ్చేది కాదు. నింద వేసి ఏళ్ల తరబడి భరించింది. నీలో మార్పు ఆశించింది. అంతేకాని నీకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అని కోపంతో ఊగిపోయారు.

మూల్యం చెల్లించుకొంటావు

మూల్యం చెల్లించుకొంటావు

మోనిత గురించి అందరూ హెచ్చరించాం. కానీ నీ స్నేహం అని చెప్పి మమల్ని మోసం చేశావు. నీవు చేసిన పనికి దీప ఎన్ని రకాలుగా ప్రశ్నించాలి.. ఎన్ని రకాలుగా నిలదీయాలి అంటూ కార్తీక్‌ను కడిగిపడేశాడు. మోనితతో పెళ్లికి ఎలా ఒప్పించాడు. కొన్ని రోజులు భర్తగా ఉంటానన్నాడా? నీ బిడ్డలకు కొన్ని గంటలు తండ్రిగా ఉంటానన్నాడా? దీపమ్మకు చేసిన అన్యాయానికి మూల్యం చెల్లించుకొంటావు. నీ భార్యతో కలిసి పోయావంటే.. నీతి తప్పిన జాతిలో కలిసి పోయావేంటిరా అంటూ ఆవేశపడిపోయాడు. దాంతో డాడీ అంటూ ఏదో చెప్పబోతే.. నీకు సమాధానం చెప్పే హక్కుల లేదురా అంటూ దీప... నీవు చాలా ఎదిగిపోయావు అంటూ ఆనందరావు ప్రశంసించారు.

 నా వ్యక్తిత్వంపై మచ్చపడింది

నా వ్యక్తిత్వంపై మచ్చపడింది

తండ్రి కడిగిపడేయడంతో కార్తీక్ విచారంలో మునిగిపోయాడు. దాంతో కార్తీక్ పరిస్థితి చూసి దీప భర్త భుజంపై చేయి వేసి ఓదార్చింది. నా తండ్రి ఎన్నడూ ఒక్క మాట అనలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను ఏమీ అనలేదు. మోనిత వల్ల నా వ్యక్తిత్వంపై మచ్చపడింది. ఇది ఆవేశంలో చేసిన తప్పు కాదు. ఏ బలహీన క్షణంలో దిగజారి చేసిన తప్పు కాదు. కానీ నాకు శిక్ష పడింది. మా అమ్మా నాన్న దృష్టిలో నా వ్యక్తిత్వం దిగజారి పోయింది. పెళ్లి విషయం తెలిస్తేనే ఇంత అసహ్యించుకొంటున్నారు. ఇక నా వల్ల మోనిత గర్బవతి అనే విషయం తెలిస్తే ఆయన ఏమై పోతారని భయంగా ఉంది అంటూ కార్తీక్ అన్నాడు.

 ప్రపంచం మొత్తం నమ్మకపోయినా..

ప్రపంచం మొత్తం నమ్మకపోయినా..

తన కుటుంబం గురించి కార్తీక్ చింతిస్తూ.. నా జీవితం ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది నా ప్రయాణం. ఎంత కాలం ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోవాలి. నీ తప్పు లేదని నీ మనసు చెప్పినప్పుడు.. ప్రపంచమంతా నమ్మకపోయినా ఫర్వలేదు. నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలూ అంటూ దీప ఓదార్చింది. దాంతో కార్తీక్‌కు కొంత ఊరట లభించింది.

శుభవార్త చెబుతానంటూ మోనిత

శుభవార్త చెబుతానంటూ మోనిత

కార్తీకదీపం సీరియల్‌లో దీప ఎత్తులకు చిత్తైన డాక్టర్ మోనిత మరోసారి ఓ కుట్రకు తెరలేపింది. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడింది. అంజి వ్యవహారం చూసుకోండి అంటే.. మీరేం కంగారు పడకండి అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అయితే మీ అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తానని మోనిత చెప్పింది. ఆ వ్యక్తి ఇచ్చిన భరోసాతో సంతోషంలో మునిగిపోయింది. మోనిత వ్యవహారం చూసి అనుమానం వ్యక్తం చేసిన ప్రియమణితో నేను అనుకొన్నది సాధించాలంటే.. చాలా బిజీగా ఉండాల్సి ఉంటుంది. నా అవసరాలు నీవు చూసుకోవాలి. త్వరలోనే నీకు శుభవార్త చెబుతా అంటూ మోనిత ఆనందంతో మునిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X