Karthika Deepam Episode 1098 ఆడదానివి అనిపిస్తే అప్పుడే కడుపు అయ్యేది.. మోనితను కడిగి పడేసిన కార్తీక్, దీప

కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్, దీప, మోనిత మధ్య ఎమోషనల్ హైడ్రామా నడించింది. అర్ధరాత్రి దీప ఇంట్లోకి దూరి రచ్చ చేసేందుకు ప్రయత్నించిన మోనితను కార్తీక్, దీప కడిగిపడేశారు. మోనిత విషయంలో తొలిసారి కార్తీక్ ఘాటుగా స్పందించాడు. ఇంకా 1098 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

ఏకాంతానికి అడ్డు రావడం లేదుగా

ఏకాంతానికి అడ్డు రావడం లేదుగా

తన ఇంట్లోకి వచ్చి హాలులో ముసుగేసుకొని పడుకొన్న మోనితను చూడగానే దీప షాక్ తిన్నది. దీప ముఖంలో ఆందోళన చూసిన మోనిత.. దీప భయపడ్డావా? అంటూ అడిగింది. మీ ఇద్దరు గదిలో పడుకొన్నారనుకొన్ని డిస్ట్రబ్ చేయకూడదని నేను ఇక్కడే పడుకొన్నాను అని చెప్పింది. మోనిత వ్యవహారం చూడలేక కోపంతో దీప ఊగిపోయింది. మోనిత చేయి పట్టుకొని పోవే అంటూ బయటకు తోసిసింది. దాంతో ఏంటి దీప.. మీ ఏకాంతానికి నేను అడ్డు రావడం లేదే అంటూ కామెంట్ చేసింది.

హాల్‌లో పడుకొని టైమ్ వేస్ట్ చేశా...

హాల్‌లో పడుకొని టైమ్ వేస్ట్ చేశా...

దీప, మోనిత మధ్య జరిగిన గొడవతో హాస్పిటల్‌లో కూర్చొన్న కార్తీక్ నిద్రలో నుంచి లేచాడు. మోనితను చూసి వచ్చి కోపంతో చూడటంతో అయ్యో కార్తీక్.. ఇక్కడ పడుకొన్నావా? నీవు గదిలో పడుకొన్నావని నేను హాల్‌లో పడుకొని చాలా టైమ్ వేస్ట్ చేశాను. ఏంటిది అంటూ కార్తీక్ ప్రశ్నిస్తే.. నా ఒంటరితనం.. ఏకాంతం కావాలని కోరుకొన్నది. రమ్మంటే నీవు రావు.. నేను వస్తానంటే వద్దంటావు అంటూ మోనిత జవాబిస్తే.. ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అని కార్తీక్ కోపంతో అరిస్తే... ఆ రోజు నీకు తెలియదేమో . కానీ ఈ రోజు నాకు తెలిసు. ఈ రోజు నేను తాగలేదుగా అంటూ మోనిత సమాధానం ఇచ్చింది.

 గౌరవమైన ప్రొఫెషన్‌లో ఉన్నావని

గౌరవమైన ప్రొఫెషన్‌లో ఉన్నావని

మోనిత మాటలు కార్తీక్‌కు మరింత కోపాన్ని తెప్పించాయి. నీవు చదువుకొన్నదానివి. గౌరవమైన ప్రొఫెషన్‌లో ఉన్నావు. నీకు సిగ్గు అనిపించడం లేదా? నీ మాటలు కంపరం కలిగిస్తున్నాయి అంటూ కార్తీక్ అంటే.. ఇందులో కంపరం, జుగుప్స ఏముంది? నేను ఏం తప్పు చేశాను అంటూ ప్రశ్నించింది. నీవు ఆడదానిగా చూడవేందుకు? కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు ఆడదానికి ఎలాంటి కోరికలు కలుగుతాయో.. నీకేం తెలుసు. ఇద్దరు బిడ్డల్ని మోసిన దీపకు తెలుసు అని మోనిత దీర్ఘాలు తీసింది.

దీపతో నీకు పోలికా?

దీపతో నీకు పోలికా?

దీపను ప్రస్తావించడంతో కార్తీక్‌కు మరింత కోపం పెరిగింది. మోనితను మరింత కడిగేస్తూ... దీపతో నీకేం పోలిక.. దీప దేవుడి ముందు వెలిగే దీపంలా ఉంటే...నీవు వీధి దీపంలా నిలబడ్డావు అంటూ కార్తీక్ దుమ్ముదులిపేశాడు. దాంతో నన్ను వీధిలోకి నువ్వు కాదా? ఆ రోజు నా మాట వినలేదు. ఈ రోజు నా మాట వినడం లేదు. ఎందుకు దీప.. అంత కోపంగా చూస్తున్నావు అంటూ ప్రశ్నించింది.

 నీవు అక్కవు... కార్తీక్ నా బావ అంటూ

నీవు అక్కవు... కార్తీక్ నా బావ అంటూ

దీపతో మోనిత మాటలు కలుపుతూ.. ఒకవేళ నువ్వ అక్కవు అయితే... కార్తీక్ నా బావ.. నేను తొందరపడితే.. నేను బలైపోతే.. ఇలానే చూస్తూ ఊరుకొంటావా చెప్పు. గుట్టుచప్పుడుగా కార్తీక్‌కు అంటే నా బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేసేదానివి కదా.. ఇలానే వదిలేస్తావా? అంటూ మోనిత చెప్పుకొంటూ పోతే.. స్టాపిట్ మోనిత.. ఇప్పటి వరకు నీ ప్రొఫెషన్ చూసి గౌరవించాను. నిన్ను ఓ ఆడదానిలా చూసి ఉంటే.. ఎప్పుడో తల్లివయ్యే దానివి. ఇప్పటికీ.. ఈ రోజుకు నీపై నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు అని కార్తీక్ దుమ్ముదులిపేశాడు.

 పెళ్లి అయితే ఆ గిల్టీని పోగొడుతా...

పెళ్లి అయితే ఆ గిల్టీని పోగొడుతా...

కార్తీక్ మాటలకు రియాక్ట్ అయిన మోనిత.. ఇప్పుడు తప్పంతా నాదే అన్నట్టు చేస్తున్నావు. ఈ రోజు నేను ఆడదానిలా కనిపించడం లేదా? ఎదురుగా భార్యను పెట్టుకొని గిల్టీగా ఫీలవుతున్నావు. ఈ గిల్టీ ఫీలింగ్ పొగొట్టడానికే మన పెళ్లి జరగాలని అంటున్నాను. ఆ తర్వాత ఆడదానిలా ఏంటీ.. అప్సరసలా కనిపిస్తాను. 25వ తేదీ తర్వాత నువ్వు నా వాడివి అయిపోతావు. నేను నీదానిని అయిపోతాను. అప్పుడు నీకు ఇద్దరు భార్యలు అనే ఫీలింగ్ ఉంటుందేమో.. గుడ్ నైట్.. వస్తాను అంటూ మోనిత వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.

 కుక్కను తరిమినట్టు అంటూ

కుక్కను తరిమినట్టు అంటూ

కానీ మోనితను పిలుస్తూ... ఒక్క నిమిషం అంటూ దీప రంగంలోకి దిగింది. ఇంత బరించినా.. ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించినా.. అర్ధరాత్రి నా భర్త కోసం వచ్చి చెండాలంగా మాట్లాడినా.. నేను నా భర్త ఏమీ చేయడం లేదు ఎందుకో తెలుసా? పెళ్లి కాకుండానే తల్లి అయ్యారనే నీ చరిత్రను ఇంట్లో ఉన్న నా పిల్లలు వింటే బాగుండదని. లేదంటే అక్కా అన్నందుకు కుక్కను తరిమినట్టు తరిమేసేదానిని. డాక్టర్ బాబును దేవుడిగా భావించిన బస్తీవాసుల చేత ఛీ కొట్టించే దానిని. ఉన్నత సంస్కారం ఉన్న నా భర్త గురించి నీ వల్ల పది మంది చర్చించకుండా ఉండటానికి ఓపికగా పడుతున్నాను అంటూ స్ట్రోక్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X