twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam..మా ఆయన సాఫ్ట్‌వేర్... నేను హార్డ్‌వేర్.. మోనిత ముఖంపై డైలాగ్స్‌తో రఫాడించిన దీప

    |

    కార్తీకదీపం సీరియల్‌లో దీప, మోనిత మధ్య వాగ్వాదం మరోసారి భారీ లెవెల్‌లో జరిగింది. అక్కా, బావ అంటూ ఇంట్లోకి దొంగచాటుగా దూరి.. కార్తీక్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని చూసిన మోనితకు ఫుల్లుగా దీప గడ్డి పెట్టింది. 25న పెళ్లి ఖాయం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన మోనితకు .. ఒక్క సెకన్ అంటూ చిటికేసి.. వార్నింగ్ ఇచ్చింది. ఇంకా 1098 ఎపిసోడ్‌లో దీప, మోనిత మధ్య వాగ్వాదం ఏం జరిగిందంటే..

    కడుపుతో ఉంటే..

    కడుపుతో ఉంటే..

    అర్ధరాత్రి ఓ మొగాడి కోసం వచ్చాడు. నిన్ను నేను ఏమనాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవో కోరికలు ఉంటాయి. కానీ ఈ కోరికలు కావు. మాతృత్వం పేరు చెప్పి ఏదో రంగు పులుముకొన్నావు. ఈ రోజు నిన్ను వదిలేయొద్దు. ఈ సంఘటనను మరిచిపోను. దీనికి బదులు తీర్చుకొంటాను అని వార్నింగ్ ఇచ్చింది.

     కత్తి.. తుపాకీ చూపించి..

    కత్తి.. తుపాకీ చూపించి..

    పెళ్లి గురించి ఏదో మాట్లాడుతున్నావు. మళ్లీ అను.. గట్టిగా అను. క్యాలెండర్‌లో ఒక్కో తేదీకి సున్నాలు చుట్టుకొంటు వెళ్లు. 25వ తేదీన నీకు మిగిలేది సున్నా మాత్రమే. జరగదు.. నీకు నా భార్తతో పెళ్లి జరగదు. అసలు పెళ్లే జరగదు. నా పిన్నితో కలిసి వచ్చి చెప్పాను. దుర్గ, అంజితో కలిసి వచ్చేదాకా ఇలానే ఎగిరెగిరి పడుతావా? నిన్ను కత్తి చూపించో.. తుపాకి చూపించో బెదిరించను. అయినా సరే.. భయం పుట్టిస్తాను. గజగజ వణికిస్తాను. మా ఆయన సాఫ్ట్‌వేర్.. నేను హార్డ్‌వేర్.. నేను ఆయనలా కూల్‌గా మాట్లాడను అంటూ డైలాగ్స్ దీప హోరెత్తించింది.

    Karthika Deepam Episode 1098 ఆడదానివి అనిపిస్తే అప్పుడే కడుపు అయ్యేది.. మోనితను కడిగి పడేసిన కార్తీక్Karthika Deepam Episode 1098 ఆడదానివి అనిపిస్తే అప్పుడే కడుపు అయ్యేది.. మోనితను కడిగి పడేసిన కార్తీక్

    మోనితకు నీళ్లు తాగించిన దీప

    మోనితకు నీళ్లు తాగించిన దీప

    దీపను చూసి.. బెదిరిస్తున్నావా అంటూ మోనిత అరిచింది. దాంతో బెదిరించడం అయిపోయింది. నీ గుండెల్లో డబ్బులు మోగించడం కూడా మొదలైపోయింది. ఏంటే గొంతులో మాట పెగలడం లేదు. తడి ఆరిపోయిందా? అంటూ ఇంట్లోకి వెళ్లి చెంబులో నీళ్లు తెచ్చి.. తాగి చావు అంటూ ఇచ్చింది. మోనిత నీళ్లు తాగుతుంటే... అక్కడి నుంచి దీప మాయమైనంత పనిచేసింది, డోర్ వద్ద కార్తీర్ చేయి పట్టుకొని.. ఇప్పుడు గుడ్ నైట్ చెప్పానా? గుడ్ నైట్.. హావ్ ఏ బ్యాడ్ డ్రీమ్స్.. లేకపోతే.. గుడ్ నైట్.. హావ్ ఏ గుడ్ నైట్ అంటూ చెప్పు అంటే మోనిత కంగారు పడిపోయింది.

    Karthika Deepam బాంబు పేల్చిన మోనిత.. కార్తీక్ తండ్రికి హార్ట్ ఎటాక్Karthika Deepam బాంబు పేల్చిన మోనిత.. కార్తీక్ తండ్రికి హార్ట్ ఎటాక్

    అమ్మా.. నేను ఏమైపోవాలి...

    అమ్మా.. నేను ఏమైపోవాలి...

    మోనిత ఇచ్చిన వార్నింగ్స్‌ను ఇంటికి వచ్చినా మరిచిపోలేకపోయింది. అది అంత కాన్ఫిడెన్స్‌గా చెప్పిందంటే.. దీప చెప్పిందే చేస్తుందా? అప్పుడు నా పరిస్థితి ఏమిటి? అంటూ ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకున్నది. మోనిత పరిస్థితి చూసి అమ్మా.. ఏమిటీ ఈ చెమటలు అంటూ ప్రియమణి కంగారు పడిపోయింది. ఎందుకలా ఉన్నారు... మీకు ఏమైనా అయితే నేను ఏమై పోవాలి? అంటూ ఆందోళన చెందింది. దాంతో నేను ఇలా కావడానికి కారణం దీపనే అంటూ మోనిత చెప్పింది.

    నా బతుకు ఏమైపోవాలి అంటూ మోనిత

    నా బతుకు ఏమైపోవాలి అంటూ మోనిత

    దాంతో కార్తీక్‌తో పెళ్లి జరగదు.. నీ అంతట నీవే.. పెళ్లి వద్దంటావు అని చెప్పింది. ఒకవేళ అదే జరిగితే నా పరిస్థితి ఏమిటి? అని మోనిత కంగారు పడిపోయింది. దాంతో దీప అలా ఎలా చెబుతుంది. వాళ్ల అయనే కదా తప్పు చేసింది. ఆయనకు న్యాయం చేయాలని? నీకు అన్యాయం చేయాలని చూస్తే ఎలా అంటూ ప్రియమణి కంగారు పడింది. ప్రియమణి చెప్పిన మాటలకు మోనిత స్పందిస్తూ.. అదే జరిగితే నా బతుకు ఏమైపోవాలి. నేను కన్న కలలన్నీ ఏమైపోతాయి అంటూ ఆవేదన చెందుతుంటే.. కార్తీక్ తండ్రి ఆనందరావు ఫోన్ చేశాడు. ఫోన్‌లో మ్యారేజ్ ఆఫీస్‌కు రమ్మంటే.. అక్కడికి మోనిత బయలు దేరి వెళ్లింది.

    English summary
    Karthika Deepam 22th July's Episode preview. Latest episode of 1098 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X