Karthika Deepam Episode 1099 నీ పాపం వల్ల నా ప్రాణాలు పోతే అంటూ తండ్రి ఫైర్.. కార్తీక్ పరిస్థితి దారుణంగా
కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ కుటుంబ సభ్యులు, డాక్టర్ మోనిత మధ్య మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద హైడ్రామా చోటుచేసుకొన్నది. దీపకు అన్యాయం చేస్తూ మోనితతో తన కొడుకు కార్తీక్ పెళ్లి చేసుకొంటున్నాడని తెలిసినప్పటి నుంచి ఆనందరావు రగిలిపోయాడు. మోనితతో అమీతుమీ తేల్చుకొనేందుకు రిజిస్టర్ ఆఫీస్‌ను ఆనంద్ రావు వేదికగా చేసుకొన్నాడు. దాంతో కార్తీక్, దీప, మోనిత, ఆనందరావు అక్కడికి చేరుకొన్నారు. తాజా ఎపిసోడ్ 1099లో ఆ ఆఫీస్ వద్ద వారి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

కంగారు పడిన కార్తీక్
అప్పటికే దీప పీకిన క్లాస్ నుంచి తేరుకోలేని మోనితకు ఆనందరావు షాకిచ్చారు. రిజిస్టర్ ఆఫీస్ వద్దకు రమ్మని కబురుపంపారు. దాంతో కార్తీక్‌కు ఫోన్ చేసి మీ నాన్న నన్ను ఆఫీస్ వద్దకు రమ్మని ఫోన్ చేశాడు అంటూ అసలు విషయాన్ని మోనిత చెప్పింది. దాంతో కార్తీక్ కంగారు పడిపోయాడు. నాన్నకు మోనిత గర్బవతి అనే విషయం తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్లాల్సిందే అంటూ కార్తీక్ బయలుదేరితే దీప కూడా తోడుగా వెళ్లింది.

అంకుల్ మామయ్య ఎప్పటికీ కాలేడు
రిజిస్టర్ ఆఫీస్‌లో మోనిత దాఖలు చేసిన పత్రాన్ని చూస్తూ ఆనందరావు ఉడికిపోయాడు. ఆ సమయంలోనే మోనిత అక్కడికి చేరుకొన్నది. ఆనందరావును చూసి మోనిత తమాయించుకొని.. నేను మోనితను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాను అంటూ తనకు తాను ధైర్యాన్ని తెచ్చుకొన్నది. ఆనందరావును చూసి నమస్తే మామయ్యా అంటూ పలకరిస్తే.. అంకుల్‌ను మామయ్యా అంటే కొడుకు స్నేహితురాలు కోడలు కాలేదు. నరం లేని నాలుక ఏదంటే అది కాదు అంటూ ఆనందరావు గట్టిగా షాకిచ్చాడు.

అనైతిక పెళ్లితో అదనపు గౌరవమా?
ఆనంద్ రావు మాటలకు స్పందిస్తూ.. మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నాలాంటి డాక్టర్ మీ ఇంటికి కోడలుగా వస్తే మరింత ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. కార్తీక్, నేను డాక్టర్లమే కాబట్టి మీ ఇంటికి మరింత గౌరవం పెరుగుతుంది. మీ ప్రతిష్టతకు తగినట్టుగా నేను ఉంటాను అని మోనిత అంటే.. అనైతికంగా జరిగే పెళ్లి వల్ల వచ్చే అదనపు గౌరవం నాకు అక్కర్లేదు అంటూ ఆనందరావు సమాధానం ఇచ్చారు. దాంతో నేను మీకు సమాచారం ఇవ్వలేదు. నేను మీ సహాయం కోరలేదు. సౌందర్య నా పెళ్లి విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసి అమెరికా వెళ్లిపోయారు అంటూ మోనిత మాటలకు మాట జవాబిచ్చింది.

పెళ్లైన వ్యక్తిని ప్రేమించావా?
మోనిత మాటలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కార్తీక్, నీవు పార్ట్‌నర్‌షిప్‌గా హస్పిటల్ పెట్టుకొంటానంటే ఓకే అన్నాం. కానీ నా కొడుకుకు పార్ట్‌నర్‌గా వస్తానంటే ఒప్పుకోం. నాకు మంచి కోడలు, మనవరాళ్లు ఉన్నారు. నిన్ను కోడలుగా ఒప్పుకోం అంటూ ఆనందరావు తెగేసి చెప్పారు. దాంతో నేను 16 ఏళ్లుగా నేను కార్తీక్ ప్రేమిస్తున్నాను అంటే.. నా కొడుకును ఎందుకు ప్రేమించావని అడగను. కానీ పెళ్లైన వ్యక్తిని ఎందుకు ప్రేమించావని సమాజం అడుగుతుంది అని ఆనందరావు ప్రశ్నించాడు. నీది నీతిమాలిన చర్య అంటూ పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశారు.

నీవు తాతవు కాబోతున్నావు అంటూ
కార్తీక్‌తో పెళ్లి విషయంపై మోనిత, ఆనందరావు మధ్య గట్టిగా వాగ్వాదం చోటుచేసుకొన్నది. పెళ్లి క్యాన్సిల్ చేసుకొ అంటూ హెచ్చిరించాడు. నా దిగజారిన పరిస్థితి గురించి నేను చెప్పలేను. 25వ తేదీన నా మెడలో తాళి కట్టకపోతే మీ పరువు ప్రతిష్టలు రోడ్డున పడుతాయి. మీకు అసలు విషయం తెలియనట్టు ఉంది.
నా నిర్ణయానికి కారణం.. నీ కొడుకుతో నేను గర్బవతిని అయ్యాను. నా కడుపులో బిడ్డ పెరుగుతున్నది. దానికి కారణం మీ అబ్బాయి. మీ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నారు. మీరు తాత కాబోతున్నారు. అందుకే పెళ్లి అంటూ మోనిత బాంబు పేల్చింది. దాంతో ఆనందరావు షాక్ తిన్నాడు. ఆ సమయంలోనే దీప, కార్తీక్ అక్కడికి చేరుకొన్నారు. మోనిత ఇచ్చిన వార్నింగ్‌తో ఆనందరావుకు ఛాతీలో నొప్పి మొదలైంది.

నీవు ఆడదానివేనా అంటూ
తండ్రి ఆనందరావు పరిస్థితిని గమనించిన ఆనందరావును పట్టుకోవడానికి ప్రయత్నించారు. దాంతో నన్ను ముట్టుకోవద్దని అరిచాడు. ఈ పరిస్థితిని చూసి ఆందోళనకు గురైనా దీప.. మోనితను నీవు ఆడదానివేనా? అంటూ చెడామడాతిట్టారు. దాంతో మోనిత చెప్పిందంతా నాటకమని నేను నిరూపిస్తాను అంటూ ఆనందరావును మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ నొప్పితో ఆయన కుప్పకూలిపోవడంతో హాస్పిటల్‌కు తరలించారు. మోనిత మరోసారి అయోమయంలో పడిపోయారు.

కార్తీక్ ట్రీట్‌మెంట్‌కు నిరాకరణ
కార్తీక్ ట్రీట్‌మెంట్ చేస్తుండటంపై ఆనందరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీ వైద్యం, నీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ అవసరం లేదు. మర్యాదగా నా ముందు ఉండకుండా వెళ్లిపో. నీవు ఎదురుగా ఉంటే నీవు చేసిన పాపాలు కంటికి కనిపిస్తాయి. నాకు ఏమైనా అయితే జీవితాతం అందుకు కారణం నువ్వే అని కుమిలికుమిలిపోవాలి. గెటవుట్ అంటూ ఆనందరావు అనడంతో మరో డాక్టర్ గోవర్దన్‌ను పిలవండి అంటూ కార్తీక్ బయటకు వెళ్లిపోయారు. తండ్రి మాటలతో కార్తీక్ మరింత కుంగిపోయాడు.


Click it and Unblock the Notifications











