Karthika Deepam నేను కడుపు నిండా తిండి పెడుతా.. కానీ కడుపు కోసం నీవు పెళ్లైన వాడితో.. మోనితకు దీప షాక్

కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి దీప, మోనిత మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరికొకరు తమ వాదనలతో ఎపిసోడ్‌ను హోరెత్తిచారు. మోనిత ఎప్పటి మాదిరిగానే తన కాన్ఫిడెన్స్ చూపించడానికి ప్రయత్నించగా.. దీప ఆమె విశ్వాసాన్ని తుంచే ప్రయత్నం చేశారు. తాజా 1101 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే...

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

 మోనిత అనే ఫ్రెండ్ లేదు...

మోనిత అనే ఫ్రెండ్ లేదు...

కార్తీక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆనందరావును చూడటానికి మోనిత వెళ్తుండగా.. అక్కడే ఉన్న మోనిత ఎక్కడికి అంటూ ప్రశ్నించింది. మీ మామగారిని చూసి పోదామని కార్తీక్ ఫ్రెండ్‌గా వచ్చాను అని మోనిత అంటే.. కార్తీక్‌కు మోనిత అనే ఫ్రెండ్స్ లేరు అంటే.. ఆమె ఇప్పడు కాబోయో భార్యగా మారిపోయారు కదా అంటూ మోనిత సమాధానం ఇచ్చింది. అంతలోనే మోనితకు నమస్తే పెడుతూ నర్స్ అక్కడికి వస్తే... కార్తీక్ సార్ తండ్రికి ఎలా ఉందంటే.. స్టంట్ వేశారు. బాగానే ఉంది అని నర్సు సమాధానం చెబుతూ.. కార్తీక్ సార్ ఏం చేశారు మేడయ్... ఆయన చాలా కోపంగా ఉన్నారు. ముఖంపై స్టెతస్కోప్ విసిరికొట్టి బయటకు పొమ్మన్నారు అని నర్సు పద్మజ అన్నారు.

 కార్తీక్ సార్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు..

కార్తీక్ సార్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు..

ఆనందరావుకు అంత కోపం రావడానికి కార్తీక్ ఏం చేశారు మేడమ్.. అని నర్సు అడిగితే.. కార్తీక్ సార్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయనకు ఇష్టం లేదు. అంతకుముందే పెళ్లి, పిల్లలు ఉన్నారని ఆయన గొడవ చేస్తున్నారు అని మోనిత అంటే.. ఆయన భార్య ఊరుకొన్నారా? అని నర్సు మరో పశ్న వేస్తే... ఊరుకోకపోతే ఏం చేస్తారు అంటూ దీపను ఓరగా చూస్తూ మోనిత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

వంటలక్కను జాలి పడి పెళ్లి చేసుకొన్నారు..

వంటలక్కను జాలి పడి పెళ్లి చేసుకొన్నారు..

మోనిత నర్సు తన మాటలను కొనసాగిస్తూ.. కార్తీక్ సార్ భార్య కూడా డాక్టరనేట కదా.. అంటే డాక్టరా? పాడా?... కార్తీక్ భార్య వంటలక్క. వంటలు చేయడం తప్ప మరో పని ఉండదు. వంటలు చేసుకొనే ఆమెను జాలి పడి పెళ్లి చేసుకొన్నారు. కార్తీక్‌కు జీవితంలో ఏ సుఖం లేదు మోనిత అంటే.. ఏం ఫర్వాలేదు. కార్తీక్‌ను ఆయన తండ్రి సరిగా అర్ధం చేసుకొంటారు లే అంటూ నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో విన్నావా? లోకం తీరు అలా ఉంటుంది. లోకం దృష్టిలో నీ స్థానం అంతే.. గింజేసుకోకుండా అలా ఉండు అంటూ దీపను మోనిత ఉడికించే ప్రయత్నం చేసింది.

మోనిత.. నీ బుర్రలో వికృత రూపాలు

మోనిత.. నీ బుర్రలో వికృత రూపాలు

మోనిత మాటలకు దీప ఘాటుగా రెస్పాన్స్ ఇస్తూ.. లోకం తీరు అలానే ఉంటుంది. నీ చరిత్ర తెలిస్తే.. ఇదే లోకం నిన్నేమంటుందో ఆలోచించుకో. నీ ఆటోగ్రఫి బయోగ్రఫి చెప్పడానికి, నీ బుర్రలో ఎన్ని వికృత రూపాలు ఉన్నాయో వాటిని బుర్రకథల చెప్పడానికి ఒకడు వస్తాడు. వాడి పేరు అంజి అని దీప అనగానే.. (మోనితకు తాను యాక్సిడెంట్ చేసే సీన్ గుర్తొచ్చింది.). అవును నేను వంటలక్కనే.. నేను అందరికీ కడుపు నిండా తిడిపెడుతాను. నీవు నీ కడుపు గురించి చేసుకొంటావు. పెళ్లి అయితే ఏమిటి? పెళ్లి కాకపోతే ఏమిటి? కడుపు వస్తే చాలూ. సిగ్గు.. శెరం.. నీతి నియమం లేని ఆడదానా? నీవు ఇక్కడి నుంచి వెళ్లకపోతే గేట్ పెట్టి గెంటిస్తాను.. గెట్ అవుట్ అంటూ మోనితకు దీప వార్నింగ్ ఇచ్చింది.

 ప్లీజ్ గెట్ అవుట్ అంటూ దీప

ప్లీజ్ గెట్ అవుట్ అంటూ దీప

నీవు 25 తేదీ పెళ్లి కోసం సున్నా చుట్టావు కాదా.. నీవు వెళ్లి దాని గురించి ఏర్పాట్లు చేసుకో. నేను ఆ పెళ్లిని పెటాకులు చేసేందుకు ప్రయత్నిస్తాను. సరేనా బంగారం. వెళ్లు.. ప్లీజ్ గెట్ అవుట్ అంటూ దీప ఘాటుగా క్లాస్ పీకింది. దీప ఇచ్చిన షాక్‌తో మోనిత మరోసారి అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మోనిత, దీప మధ్య ఫేస్ ఆఫ్ మరోసారి సీరియల్‌కు మంచి బూస్టప్ ఇచ్చాయి. అలా దీప, మోనిత మధ్య మళ్లీ భగ్గుమనేలా విభేదాలు బయటకు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X