For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1102 సూసైడ్ లెటర్‌తో బెదిరింపు.. చివరకు దీప కాళ్లు పట్టుకొన్న మోనిత

  |

  కార్తీకదీపం సీరియల్‌లో దీప, మోనిత తమకు తగినట్టుగా స్కెచ్‌ వేసుకొంటున్నారు. కార్తీక్‌తో పెళ్లి ఆపేందుకు దీప, డాక్టర్ బాబును పెళ్లి చేసుకోవడానికి మోనిత మాస్టర్ ప్లాన్స్ వేసుకొన్నారు. అంజి రప్పించడం కోసం దీప ప్రయత్నిస్తుంటే.. మోనిత విషపు బాటిల్‌తో హాస్పిటల్‌కు వచ్చింది. ఈ క్రమంలో 1102 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

  Photos Courtesy: Star MAA and Disney+HotstarPhotos Courtesy: Star MAA and Disney+Hotstar

  వయసుకు తగిన పిల్లల్లా ఉండండి..

  వయసుకు తగిన పిల్లల్లా ఉండండి..

  గతంలో అమ్మమ్మ భాగ్యం సరిగా చూడకపోయేది కదా అమ్మా.. సవతి తల్లి కావడం వల్ల మనల్ని పట్టించుకోలేదు. అమ్మకు ఉన్నట్టు మనకు సవతి తల్లి లేదు. అందుకు చాలా హ్యాపీ అంటూ ఏవోవో శౌర్య, హిమ అంటే.. మీరు వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి అంటూ కోపగించుకొన్నది. సౌందర్యతో తాను అన్న మాటలను గుర్తు తెచ్చుకొన్నది. నా జీవితంలో ఓ సవతి తల్లి ఉంది. హిమ, శౌర్యకు అలాంటి పరిస్థితి వచ్చేలా రాసి ఉందేమో. కానీ నేను ఉన్నంత వరకు నా పిల్లలకు సవతి తల్లి పోరు ఉండదు అని తన పిల్లలకు దీప ధైర్య చెప్పింది.

  నాన్నను జాగ్రత్తగా చూసుకో

  నాన్నను జాగ్రత్తగా చూసుకో

  తండ్రి ఆరోగ్యం గురించి కార్తీక్, ఆదిత్య మాట్లాడుకొన్నారు. హార్ట్ ప్రాబ్లెం ఉన్న ప్రతీ ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్వేగానికి గురి అయ్యే విషయాలు చెప్పకూడదు. నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మోనిత అసలు విషయం చెప్పింది కాబట్టి.. ఇక ఇంతకంటే దారుణ విషయం ఏమీ లేదు. నాన్నను జాగ్రత్తగా చూసుకొందాం. మీరు శాంతంగా ఉండండి. ముఖ్యంగా నిన్ను దీప అనుమానించకుండా అర్ధం చేసుకొంది కాబట్టి మీరు ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు అని ఆదిత్య చెప్పారు.

   హిస్టీరియా వచ్చినట్టు మోనిత

  హిస్టీరియా వచ్చినట్టు మోనిత

  ఇక అంజి ప్రస్తావనను దీప తీసుకురావడం, అలాగే వైజాగ్‌లో అంజి కనిపించడం లేదనే విషయం మోనితకు పిచ్చెక్కించాయి. పెళ్లా? జైలా అనే అంటూ భాగ్యం, దీప చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి నో అని గట్టిగా అరుస్తూ హిస్టీరియా వచ్చిన దానిలా మారిపోయింది. దాంతో ప్రియమణి బెదిరిపోయింది. అయితే బెదురు చూపులు చూస్తూ యస్ అంటూ మాస్టర్ ప్లాన్ వేసింది. తన ప్లాన్‌లో భాగంగా హాస్పిటల్‌కు క్యారేజ్‌తో సహా వెళ్లింది. అక్కడ భాగ్యం తెచ్చిన భోజనం పెట్టడానికి ప్రయత్నిస్తే.. నాకు ఆకలి కావడం లేదు అని కార్తీక్ అంటే.. నా చేతితో పడితే నా కాబోయే భర్త తింటాడు అంటూ మోనిత చెప్పింది.

  విషం తాగి చస్తాను అంటూ

  విషం తాగి చస్తాను అంటూ

  మోనిత అలా అనడంతో భాగ్యం కోపంతో ఊగిపోతూ క్యారేజ్‌తో కొడితే క్యాబేజ్లో తల పగిలిపోతుంది. తలుపులు వేసి మీరు బయటకు వెళ్లండి అని భాగ్యం అంటే.. నేనే లోపలి నుంచి తలుపులు వేస్తా.. అప్పుడు రక్తపాతం సృష్టించండి అంటూ మోనిత తన మార్కు వికృతాన్ని సృష్టించింది. అంతలో ఓ బాటిల్ తీసి.. నాపై చేయి పడితే.. ఈ బాటిలో ఉన్నవి మంచి నీళ్లు కాదు.. విషం కలిపిన నీళ్లు.. అవి తాగి చస్తాను అంటూ మోనిత బెదిరించింది. నా చావుకు కారణం ముందే రాసి ప్రియమణికి ఇచ్చే వచ్చాను అంటూ షాక్ ఇచ్చింది. కార్తీక్‌కు ఇష్టమైన బగారా రైస్, గుత్తి వంకాయ కూర తెచ్చాను అని మోనిత అంటుండగా డోర్ కొట్టిన శబ్దం మోగింది. కార్తీక్ డోర్ తీయగానే దీప ఎంట్రీ ఇచ్చింది.

  విషం తాగి చావు అంటూ దీప

  విషం తాగి చావు అంటూ దీప

  దీపను చూసి మోనిత.. అక్క వచ్చింది అంటూ కామెంట్ చేసింది. నీవు వస్తావని తెలిస్తే మరింత ఎక్కువగా భోజనం తెచ్చే దానిని అంటూ దీప.. అంటే లేదు.. నేను తెచ్చాను. కానీ మోనిత కూడా తెచ్చానని చెప్పింది. అంతేకాకుండా బాటిల్‌లో పాయిజన్ తెచ్చింది అంటూ భాగ్యం చెప్పింది. దాంతో అది చస్తే మనకేంది. అంటూ బాటిల్ ఇచ్చి తాగవే అంటూ బలవంతం చేసింది. కావాలంటే నేను తాగుతాను అంటూ దీప బాటిల్ మూత తీసింది. దాంతో అందరూ నీళ్లు తాగుతుంటే కంగారు పడిపోయారు

  ఇంకెన్నాళ్లు బెదిరిస్తావు.

  ఇంకెన్నాళ్లు బెదిరిస్తావు.

  విషపు బాటిల్ అని భయపెట్టిన నీళ్లను గడగడ తాగి.. ఇందులో నీళ్లు ఉన్నాయి. బాటిల్‌లో విషం లేదు. ఎదురుగా ఉన్న మోనితలో విషం ఉంది. ఇంకా ఎన్నాళ్లు భయపెడుతావు.. అది చేయి కూడా కోసుకోలేదు. నర్సును అడిగి కత్తి తీసుకొని రా...చేయి కోసి కారం పడుదాం అని దీప అనగానే.. షాక్‌కు మోనిత గురైంది. ఆ తర్వాత దీప కాళ్లపై పడింది. నేను కార్తీక్‌ను 16 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. నీ పెళ్లికి ముందే నేను కార్తీక్‌ను ప్రేమించాను అంటూ చెప్పింది. ఆ విషయం కార్తీక్‌కి తెలుసు అంటూ ఆయనపై పడింది.

  నీపై ప్రేమ లేదు.. పెళ్లి చేసుకోను అంటూ కార్తీక్

  నీపై ప్రేమ లేదు.. పెళ్లి చేసుకోను అంటూ కార్తీక్

  కార్తీక్‌తో మాట్లాడుతుండగా మోనితకు మరో షాక్ తగిలింది. మన మధ్య ఉంది.. ప్రేమ కాదు.. నీపై ఎప్పుడూ ప్రేమ లేదు. నేను చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను అంటూ కార్తీక్ అంటే.. చేసుకోవా అంటూ మోనిత ఆందోళనలో పడింది. కార్తీక్ చెప్పిన మాటలకు మోనిత స్పందిస్తూ.. నన్ను పెళ్లి చేసుకోవా?.. చూడు అంటూ పెళ్లి కోసం తెచ్చిన సూట్‌ను ఇది.. పెళ్లి రోజు వేసుకొంటావని నేను కొనుక్కొని వచ్చాను. చూడు కార్తీక్ అంటూ పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేసింది.

  English summary
  Karthika Deepam 26th July's Episode preview. Latest episode of 1102 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X