For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1103 దీపకు చేతులెత్తి మొక్కిన కార్తీక్.. మమల్ని మసి చేస్తానంటూ ఉన్మాదిలా మోనిత

  |

  కార్తీక దీపం సీరియల్‌లో మోనిత రచ్చ రచ్చ చేసింది. పెళ్లి చేసుకోమంటూ మోనిత ఉన్మాదిగా మారి పిచ్చి పిచ్చిగా చేసింది. మోనిత చేసిన చేష్టలకు కార్తీక్, భాగ్యం, ఆదిత్య అందరూ షాక్‌లో ఉండిపోయారు. కార్తీక్ పెళ్లి చేసుకోనని చెప్పడంతో మోనిత రెచ్చిపోయింది. కార్తీక్ తండ్రి చికిత్స పొందుతున్న హాస్పిటల్‌లో హై ఎమోషనల్ డ్రామాగా మారిన 1103 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నన్ను పెళ్లి చేసుకోవా?

  నన్ను పెళ్లి చేసుకోవా?

  నన్ను పెళ్లి చేసుకోవా? నన్ను చేసుకోవా? ఎంత మాట అన్నావు కార్తీక్.. నీ కోసం.. మన పెళ్లి కోసం సూట్ కొని తీసుకు వచ్చాను. పెళ్లికి ఉంగరం కూడా తీసుకొచ్చాను. ఈ నెల 25వ తేదీన మన పెళ్లి డార్లింగ్.. ఇప్పడు పెళ్లి చేసుకోనంటే ఎలా ఊరుకొంటాను. 25వ తేదీన చాలా మంది ప్రముఖులు పుట్టిన రోజు... ఆ రోజే పెళ్లి జరుగుతుంది. ఆ రోజే జరిగి తీరాల్సిందే అంటూ హిస్టిరియా వచ్చిన దానిలా అరిచింది. నీ భర్త అంటే పిచ్చి.. అర్ధం చేసుకో.. కావాలంటే నీ పిల్లల్ని నేను పెంచుతా అంటూ దీపను కుదిపేసింది.

   నువ్వంటే నాకు పిచ్చే

  నువ్వంటే నాకు పిచ్చే

  దాంతో మోనితను లాగేస్తూ పిచ్చి పట్టిందా అంటూ అరిచాడు. దాంతో నాకు పిచ్చే అని చెబుతున్నాను కదా.. అంటూ మోనిత అంటే.. అవును నిన్ను ప్రేమించడం లేదనే హక్కు నాకు ఉంది అంటూ కార్తీక్ అన్నాడు. కార్తీక్ మాటలతో షాక్ మోనిత షాక్ తింటూ.. ఇలా మాట్లాడుతాడేంటి.. నా గర్భం సంగతి ఏమిటి?.. నేను ఇలా ఎలా ఉండిపోతానని అనుకొంటున్నారు అంటూ హెచ్చరించే ప్రయత్నం చేయడంతో కార్తీక్ షటప్ అంటూ గట్టిగా అరిచారు.

   ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదు

  ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదు

  మోనిత చాలా తప్పు చేస్తున్నావు. పెళ్లి చేసుకొన్న వ్యక్తిని ప్రేమిస్తావా? భార్య ముందే ఇలా అవమానిస్తావా?.. నీవు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నావు అంటే అవును.. నిజమే నీవు ఇష్టపడుతున్నావు అనే నేను ప్రేమించాను. నీ భార్య పదేళ్లు దూరంగా ఉన్నా.. నేను నీ వెంటే ఉన్నాను. అందరి కంటే ఎక్కువగా ప్రేమించాను. 16 ఏళ్లు ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదు. తాను ప్రేమించిన వ్యక్తికి పెళ్లి అయితే వెంటనే పెళ్లి చేసుకొని వెళ్లి పోతారు. కానీ నేను అలా చేయలేదు. నన్ను దూరం చేసుకొంటే నూరేళ్ల ప్రేమను దూరం చేసుకొన్నట్టు అవుతావు అంటూ మోనిత అన్నారు.

   నా తలరాత మార్చవద్దని చెప్పు

  నా తలరాత మార్చవద్దని చెప్పు

  దీపతో మాట్లాడుతూ.. నువ్వైనా చెప్పుమ్మా.. నువ్వైనా అర్ధం చేసుకోమని చెప్పు. నా తలరాతను మార్చవద్దని చెప్పు. చెప్పు చెప్పు అంటూ మోనిత తలబాదుకొన్నది. దాంతో చిరాకు పడిన దీప.. ఇక ఆపు అంటూ గట్టిగా అరిచింది. ఎందుకిలా ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నావు. ప్రేమ ఏంటి.. నిజమైన ఎదుటి వారి సుఖాన్ని కోరుకొంటుంది. ఇలా బిచ్చగాడిలా అడుక్కోదు. దాని వల్ల సానుభూతి కలుగదు. నీది ప్రేమ కాదు.. పగ. పంతం, అహం.. వీటన్నిటి వల్ల నా భర్తను దక్కించుకోవాలని పట్టుదల పెంచుకొన్నావు. అంతేగానీ నీలో ప్రేమ లేదు. నిజంగా ఆయనను ప్రేమిస్తే ఇలా ఆయన కుటుంబాన్ని వీధిలోకి దానివి కాదు అంటూ దీప కడిగిపడేసింది.

   జీవితాన్ని తాళినే శాసిస్తుంది...

  జీవితాన్ని తాళినే శాసిస్తుంది...

  మోనితకు మరింత క్లాస్ పీకుతూ. తాళి మన ప్రేమను శాసించడం ఏమిటని అడుగుతున్నావు కదా.. ఈ తాళి భార్యభర్తల బంధాన్ని చివరి వరకు తీసుకెళ్తుంది. ఈ తాళే కడవరకు భార్యభర్తలను చక్రంలో బంధిస్తుంది. తాళే లేకపోతే జీవితానికి విలువ ఉండదు. ఈ తాళి త్యాగం చేయడానికి ఏ మహిళ చేయదు. నీ ఉన్మాదాన్ని ఎవరు ఇక్కడ భరించరు అని దీప షాకిచ్చింది. కార్తీక్ నువ్వు వెళ్లిపో అంటూ దీప చెప్పగానే.. కార్తీక్ వెళ్లిపోయాడు. దాంతో మోనిత మరింత ఆవేశ పడుతూ... అందర్ని మసి చేసి పడేస్తా.. ఎవరినీ వదలను. నీ మీద దుమ్మెత్తి పోస్తాను అంటూ మోనిత వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది.

  Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
  మళ్లీ దండం పెట్టిన కార్తీక్

  మళ్లీ దండం పెట్టిన కార్తీక్

  మోనిత చేసిన చేష్టలతో విసిగిపోయిన కార్తీక్ ఒంటరిగా కూర్చొని విచారంలో మునిగిపోయాడు. కార్తీక్ అలా ఉండటంతో మోనిత వచ్చి ఓదార్పు ఇచ్చింది. మోనిత మనసులో ఉన్న దరిద్రాన్ని తెలుసుకోలేకపోయాను. ఇలాంటి సమయంలో నాకు తోడుగా నిలిచి అర్దం చేసుకొన్నావు. సారీ దీప.. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంటూ కార్తీక్ రెండు చేతులెత్తి దండం పెట్టాడు. దాంతో మనం వేరుగా ఉన్నా మన మనసులు కలిసే ఉన్నాయి అంటూ దీప ఉపశమనం కలిగించే మాటలు చెప్పింది.

  English summary
  Karthika Deepam 28th July's Episode preview. Latest episode of 1103 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X