Karthika Deepam July 29th episode: కార్తీక్‌తో మోనిత పెళ్లికి బ్రేక్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అంజి!

హాస్పిటల్‌లో మోనిత ఉన్మాదం చూసిన తర్వాత భాగ్యంకు కంగారు పుట్టింది. ఈ జన్మలో కార్తీక్‌ను వదిలేటట్టు లేదు. దానికి ఏం పుట్టింది? ఎందుకిలా మోనిత చేస్తుందని అని భాగ్యం అడిగితే.. మా ఆయన అంటే మోజు. ఆయన అంటే మోనితకు మోజు. దానికి అందంగా ప్రేమ పెట్టుకొన్నది అని దీప చెప్పారు. ఇప్పటి వరకు దానికి బుద్ది చెబుతాననే ధీమా ఉండేది కానీ పూనకం చూసిన నా వల్ల కాదని భాగ్యం అంటే.. త్వరలోనే దానికి బుద్ది చెబుతాం. రోషిణి మేడం అంజిని తీసుకొస్తుంది అని దీప అంటే.. లేకపోతే దానిని తొక్కి చంపి...జైలుకు వెళ్తానని భాగ్యం చెప్పింది. కార్తీక దీపం సీరియల్‌లో 1104 ఎపిసోడ్‌లో జరిగిన హైలెట్స్ ఏమిటంటే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

నీ పెళ్లికి అంజి అభ్యంతర చెప్పాడు

నీ పెళ్లికి అంజి అభ్యంతర చెప్పాడు

మోనిత ఇంట్లో పనిమనిషి ప్రియ కంగారు పడిపోయింది. కంటిన్యూగా మొబైల్ ఫోన్ మోగుతుండటంతో మోనితను నిద్ర లేపింది. ఏంటి. ఎందుకు నిద్ర పోనివ్వడం లేదంటే... మీకు ఫోన్లు వస్తున్నాయి అని అంటుండగానే... మరోసారి ఫోన్ మోగింది. మ్యారేజ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన ఫోన్‌‌ మాట్లాడుతుండగా అవతలి నుంచి రిజిస్ట్రార్ షాకింగ్ న్యూస్ చెప్పారు. అంజి అనే వ్యక్తి 25న మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాడు. అతడిని ఒప్పిస్తేనే పెళ్లి జరుగుతుంది అని చెప్పగానే మోనిత ఫ్యూజులు ఎగిరిపోయాయి.

నన్ను దారుణంగా దెబ్బ తీశాడా?

నన్ను దారుణంగా దెబ్బ తీశాడా?

తన పెళ్లిని అడ్డుకొంటున్న దీపపై మోనిత ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పెళ్లిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న దీప గురించి మాట్లాడుతూ.. నిన్ను తక్కువ అంచనా వేసి దారుణంగా దెబ్బ తిన్నాను. లాభం లేదు. ఏదో ఒకటి చేసి.. నేను అనుకొన్న తేదీకి కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలి. దీప చేతిలో ఈ మోనిత ఓడిపోకూడదు అంటూ ఆవేశపడింది. నా పెళ్లి అడ్డుకొనే ప్రయత్నాలను ఆపాలి. ఆ ప్రయత్నాలను ఆపుతాను. ఆపి తీరుతాను అంటూ మోనిత శపథం చేసింది.

అంజి గురించి కార్తీక్‌లో ఎన్నో ఆలోచనలు

అంజి గురించి కార్తీక్‌లో ఎన్నో ఆలోచనలు

తనతో మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం తెలపడంపై కార్తీక్‌లో ఆలోచనలు మొదలయ్యాయి. గతంలో మోనిత గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా కొట్టిన విషయాలు గుర్తొచ్చాయి. అలాగే మోనితకు అంజికి పెద్దగా సంబంధాలు లేవు. అలాంటిది మోనిత పెళ్లిని ఎందుకు అడ్డుకొంటున్నాడు. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు.

 అంజి ఎంట్రీపై మోనితలో కలవరం

అంజి ఎంట్రీపై మోనితలో కలవరం

ఇక అంజి తన పెళ్లిని అడ్డుకోవడంపై మోనిత షాక్ గురైంది. నీ ఆటోబయోగ్రఫిని విప్పడానికి ఒకడు వస్తాడు.. వాడే అంజి అని దీప చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. అంజిని దీప కలిసిందా? ఒకవేళ కలిస్తే నా పెళ్లి ప్లాన్స్ ఏమైపోతాయనే షాక్‌లో మోనిత ఉంది. దీపను ఎలా అడ్డుకోవాలి? అంజి వచ్చి ఏం చెప్పబోతున్నాడనే విషయాలు మోనితను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతలోనే మోనితకు రోషిణి నుంచి ఫోన్ వచ్చింది.

 మోనిత ఇంట్లో దీప ఎంట్రీ

మోనిత ఇంట్లో దీప ఎంట్రీ

మోనితకు రోషిణి ఫోన్ చేసి మీరు ఒకసారి రండి.. మీతో మాట్లాడాలి అంటూ రోషిణి కాల్ చేసి సమాధానం కోసం వేచి చూడకుండానే ఫోన్ పెట్టేసింది. దాంతో నాకు ఈ రోజు ఏదో మూడినట్టు ఉందని మోనిత ఆలోచనల్లో పడింది. రోషిణి నన్ను ఎందుకు పిలిచి ఉంటుంది? అంజిని రోషిణి దగ్గరకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పించిందా? అని ఆలోచనల్లో ఉండగా.. ప్రియమణి అంటే.. ఎప్పుడు కాఫీ అంటూ గొడవ ఏమిటి? నేను కాఫీ కోసమే పుట్టానా అంటూ కసురుకొంటే.. ఆ కాఫీ నాకు ఇవ్వు ప్రియమణి అంటూ దీప ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.

దీప, మోనిత మధ్య హై డ్రామా

దీప, మోనిత మధ్య హై డ్రామా

మోనిత ఇంట్లోకి దీప ఎంట్రీ ఇవ్వడం తదుపరి ఎపిసోడ్‌లో హై డ్రామాకు తెరతీసినట్టు అయింది. ఇప్పటికే ఆ హై డ్రామకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక మోనిత, దీప మధ్య జరిగే ఎమోషనల్ ఎపిసోడ్‌కు యూనిట్ రంగం సిద్దం చేసినట్టు కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X