Karthika Deepam అందరిలోను 25వ తేది టెన్షన్.. నీ సుపుత్రుడుకి ఏ శిక్ష వేస్తావు? సౌందర్యపై ఎదురుదాడి
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పెళ్లి తేదీ దగ్గరపడుతున్న కొద్ది అందరిలో ఓ రకమైన టెన్షన్ పెరిగిపోతున్నది. దీపకు ఏం న్యాయం చేస్తావంటూ సౌందర్యను అందరూ ప్రశ్నించారు. తన అన్న చేసిన తప్పు గురించి కుమిలిపోతున్న ఆదిత్య తన తల్లిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అలాగే తన భర్త రెండో పెళ్లి వ్యవహారంపై దీప కూడా ఎదురు దాడి ప్రారంభించింది. తాజా 1081 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

నీ కొడుకు చేసిన పాపానికి.
కార్తీక్‌తో మోనిత పెళ్లి వ్యవహారంపై తల్లి సౌందర్యతో దీప తండ్రి ఘాటుగా స్పందించాడు. పెళ్లి చేసుకొన్న పాపానికి.. చేయని శిక్షకు తన బిడ్డకు పదేళ్లు శిక్ష వేశారు. ఇప్పుడు నీ కొడుకు చేసిన పాపానికి నా బిడ్డకే శిక్ష వేస్తారా? నీ కొడుకు చేసిన తప్పును సంస్కారం ఉన్న నీతో చర్చించలేను. కానీ నా బిడ్డకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చేయని తప్పకు నా బిడ్డ శిక్ష పెంచుకొంటూ పోతే న్యాయం కోసం ఏ న్యాయస్థానం ఆశ్రయించాలి. నా బిడ్డ పరిస్థితి బాగుపడేది ఎలా.. ఎవరి విచక్షణకు వదిలేయాలి అంటూ ప్రశ్నించాడు. దాంతో దీప తండ్రి అడిగిన ప్రశ్నలకు నా వద్ద ప్రశ్నలు లేవంటూ సౌందర్య మౌనంగా నిలిచిపోయింది.

25వ తేదీన బయటకు వెళ్దాం అంటూ
ఇక కార్తీక్‌తో తన కూతుళ్లు మాట్లాడుతూ ఇద్దరు బోరుగా ఉంది.. ఎక్కడికైనా బయటకు వెళ్దామా అంటూ తల్లిని అడిగారు. నీకు ఇక్కడ బోరు కొట్టడం లేదా? అంటే.. పనిచేస్తున్నాను కదా.. అందుకే బోర్ కొట్టడం లేదు అని కార్తీక్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత.. డాడీ మనం బయటకు వెళ్లి చాలా రోజులు అయింది. నలుగురం కలిసి బయటకు వెళ్దాం అంటూ హిమ, శౌర్య అడిగారు. అయితే 25 తేదీ నలుగురు కలిసి వెళ్దాం. ఆ రోజంతా మనతోనే డాడీ ఉంటాడా అని దీప అడిగింది. దాంతో కార్తీక్‌కు 25వ తేదీన పెళ్లి చేసుకొందామని మోనిత చెప్పిన విషయాలు గుర్తు వచ్చాయి. మోనిత రిజిస్టర్ చేసిన పెళ్లి తేదీ తెలిసిపోయిందా అంటూ కార్తీక్ ఆలోచనలో పడ్డారు.

అన్నయ్య తప్పు చేస్తే శిక్ష వేయవా?
దీప ఇంటికి వెళ్లి మోనిత పెళ్లి విషయాలను చెప్పడానికి సౌందర్య ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఆదిత్య గట్టిగా నిలదీశాడు. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే.. దీప దగ్గరికి వెళ్తున్నాను అంటూ సమాధానం చెప్పింది. అక్కడే ఉంటున్న నీ కొడుకు దేశోద్దారకుడుగా మారారని ఫీల్ అవుతున్నావు. చేయని తప్పుకు శిక్ష వేసినందుకు నీ సుపుత్రుడుకి ఏమి శిక్ష వేస్తావు. అన్నయ్య తప్పు చేసినా ఎందుకు శిక్ష వేయడం లేదు? నీ వ్యక్తి ఏమైంది అంటూ ఆదిత్య ప్రశ్నించాడు. నా వ్యక్తిత్వం తప్పు పడితే కొడుకునైనా శిక్షించను అంటూ సౌందర్య ఘాటుగా సమాధానం ఇచ్చింది.

కడుపు చూసుకొని ఆనందంలో మోనిత
ఇక మోనిత తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి మురిసిపోయింది. కార్తీక్‌ను 16 ఏళ్లు ప్రేమించినా నాకు పెళ్లి కాలేదు. కానీ నీవు కడుపులో పడిన మూడు నెలలకే పెళ్లి చేయిస్తున్నావు. నీవు నిజంగా గ్రేట్ బేటా అంటూ కడుపును నిమరుకొన్నది. బెడ్ మీద నుంచే లేస్తూనే కార్తీక్‌కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించింది. నేను కార్తీక్ ఫోన్ చేసుకోవాలి అంటూ ఆ పక్కనే ఉన్న పనిమనిషిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పింది.

సౌందర్యను నిలదీసిన దీప
దీప ఇంటికి వెళ్లి గేటు వద్దే నిలుచుని.. కార్తీక్, మోనిత పెళ్లి విషయం తెలుసా అంటూ ఆలోచనల్లో పడిపోయింది. సౌందర్యను దీప అలా చూడటంతో.. ఏమిటి అలా చూస్తున్నావు అంటూ సౌందర్య ప్రశ్నించింది. అందుకు సృష్టి ప్రస్తుతం మరోలా కనిపిస్తున్నది. ధర్మం మరోలా నడుస్తున్నది అంటూ దీప కామెంట్ చేసింది.
ఇంటిలోకి తీసుకెళ్లి.. కార్తీక్, మోనిత పెళ్లి విషయంపై గట్టిగా ప్రశ్నించింది. దాంతో సౌందర్య నీవు ఎందుకు ధర్మం గురించి మాట్లాడుతున్నావు అని అంటే.. నా భర్త ఆదర్శం నుంచి అధర్మం వైపు వెళ్తున్నారు అంటే.. నేను పెళ్లి విషయం గురించి చెబుతామని అనుకొన్నాను. కానీ ఆటోను కడిగేసినట్టే.. నన్ను కడిగేస్తావని చెప్పలేదు అని సౌందర్య చెప్పింది.

నా భర్త రెండిళ్ల పూజారా?
సౌందర్యతో దీప మాట్లాడుతూ.. నా భర్తకు మోనితకు పెళ్లి. ఆయన పెళ్లి చేసుకొన్న తర్వాత ఆయన ఎక్కడుంటారు? రెండిళ్ల పూజారి మాదిరిగా అక్కడ.. ఇక్కడ ఉంటారా? కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి ఆమె రావద్దని అంటుంది. నా ఇద్దరు పిల్లలకు నేను ఉన్నంత వరకు అన్యాయం జరగకుండా చూసుకొంటాను. కార్తీక్ నిజంగానే మోనితపై మోజుపడ్డారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications











