Karthika Deepam episode 1106: ఒసే దీప.. చూస్తా.. నీ అంతు చూస్తా.. మోనిత వీరంగం

కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ మోనిత కుట్రలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపిస్తున్నది. చేసిన తప్పలే మళ్లీ చేస్తూ మోనిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుందా అనే అనుమానం కలుగుతున్నది. ఈ క్రమంలో మోనిత, దీపను పిలిపించిన ఏసీపీ రోషిణి వారిద్దరిని ప్రశ్నలతో విచారించింది. డ్రైవర్ అంజిని పెళ్లి చేసుకోవాలని అనుకొన్నావా? డ్రైవర్ అంజిని ప్రేమించావా? అంజితో నీకు ఏమైనా పగ ఉందా? అంటూ మోనితపై ఏసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. అత్యంత హైడ్రామాగా సాగిన 1106 ఏపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

నా ఫోన్ ఎందుకు పగలకొట్టావు?

నా ఫోన్ ఎందుకు పగలకొట్టావు?

మోనితను ఏసీపీ రోషిణి విచారిస్తూ... హిమ ఎవరు? హిమ నీకు తెలుసా? హిమ ఎలా చనిపోయింది? అంజి అంటే ఏదైనా పగ ఉందా? అని అడిగితే లేదు. ఏమీ లేదు అంటూ మోనిత సమాధానం ఇచ్చింది. దాంతో.. నా ఫోన్, అంజి ఫోన్ ఎందుకు పగలకొట్టావు. ప్రేమ లేదు పగలేదు అంటున్నావు. మరి అంజిని చూస్తే ఎందుకు భయపడుతున్నావు. మేమిద్దరం మాట్లాడుకొంటే ఎందుకు వణికిపోతున్నావు అంటూ దీప గట్టిగా నిలదీసింది.

రోడ్డు పక్కన డ్రైవర్‌తో

రోడ్డు పక్కన డ్రైవర్‌తో

దీప మాటలకు జవాబిస్తూ.. అంజిని చూసి నేను వణకాల్సిన పని ఏముంటుంది. నీవు డాక్టర్ భార్యవు. నీ స్థాయికి తగినట్టుగా మాట్లాడకుండా రోడ్డు పక్కన ఓ కారు డ్రైవర్‌తో మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే బాగుండదని హెచ్చరించాను అని దీప అంటే.. అయితే అంజితో నా బంధాన్ని ఇలా మారుస్తున్నావా? అని మోనిత ప్రశ్నించింది. అందుకు సమాధానంగా నేను మారుస్తున్నానో లేదా ఏమారుస్తున్నానో త్వరలోనే అర్ధమవుతుంది అని దీప గట్టిగా షాక్ ఇచ్చింది.

 హిమ ఎలా చనిపోయిందంటూ

హిమ ఎలా చనిపోయిందంటూ

మోనిత, దీప మధ్య వాగ్వాదం జరుగుతుంటే ఏపీసీ రోషిణి జోక్యం చేసుకొన్నారు. ఇంతకు హిమ ఎవరు దీప అని ఏసీపీ అడిగితే డాక్టర్ బాబు ప్రేమించిన వ్యక్తి. మా పాపకు ఆ పేరు నేనే పెట్టాను అని దీప సమాధానం చెప్పింది. ఇంతకు హిమ నీకు తెలుసా? అంటే తెలుసు. హిమ, కార్తీక్, నేను కలిసే చదువుకొన్నాం. హిమ ఎలా చనిపోయింది అని ఏసీపీ అడిగితే... హిమ యాక్సిడెంట్‌లో చనిపోయింది? హిమను నేను చంపించినట్టు దీప. అప్పటికి దీపకు, కార్తీక్‌తో పెళ్లి కాలేదు. నేను హిమను చంపించానని దీప అభియోగం. లారీతో యాక్సిడెంట్ చేయించి చంపించానంటా? ఆ లారీ డ్రైవర్ అంజి అంట అని మోనిత వివరాలు చెప్పింది.

 నేనే హిమ చంపిస్తే.. మరీ కార్తీక్

నేనే హిమ చంపిస్తే.. మరీ కార్తీక్

హిమ కారుకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారులో కార్తీక్ కూడా ఉన్నాడు. ఒకవేళ హిమను నేనే చంపిస్తే కార్తీక్‌ను నేను ఎందుకు చంపించాలని అనుకొంటాను. హిమ చంపించానికి ముందే కార్తీక్‌ను నీవు ప్రేమించావా? అని ఏసీపీ అడిగితే అవును మోనిత చెబితే.. ఇక నీవు వెళ్లవచ్చు అంటూ ఏసీపీ రోషిణి చెప్పింది. దాంతో మోనిత మాట్లాడుతూ.. మరీ నా విక్ష్ం అంటూ ఏసీపీని అడిగితే.. నీ విషయం నేను తేలుస్తాను. చట్ట ప్రకారం ఎవరు దోషి అని తేలితే వారిని అరెస్ట్ చేస్తాను. హిమ విషయం, యాక్సిడెంట్ విషయం, అన్నీ కేసులు తిరగదోడుతున్నాను. నీవు వెళ్లు.. దీపతో నేను మాట్లాడుతాను అంటూ మోనితకు చెప్పింది.

మోనితలో కంగారు, భయం, ఆందోళన

మోనితలో కంగారు, భయం, ఆందోళన

మోనితను వెళ్లమని ఏసీపీ చెబితే.. నాకు న్యాయం అంటూ మోనిత అనుమానంగా మాట్లాడబోతే.. న్యాయం కోర్టులో దొరుకుతుంది. ఇక్కడ నేను నేరస్థులు ఎవరు అనేది రుజువు చేసిగానీ అక్కడికి పంపించను. ఇంకా తప్పు ఎవరిదని తెలియదు అంటూ ఏసీపీ చెబితే మోనిత కంగారుగా వెళ్లబోయింది. దాంతో మోనిత అంటూ దీప పిలిచి.. అంజి పేరు ఎత్తితే అన్ని మరిచిపోయినట్టు ఉన్నావు. నీ సెల్ ఫోన్ ఇక్కడే మరిచిపోయి వెళ్తున్నావు అంటూ దీప అంది. దాంతో మోనిత వెనక్కి వచ్చి ఫోన్ తీసుకొని వెళ్లింది. మోనితలో కంగారు, ఆందోళన స్పష్టంగా కనిపించింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
ఒసే దీప.. ఇంత నాటకమా?

ఒసే దీప.. ఇంత నాటకమా?

ఏసీపీ రోషిణితో మోనిత మాట్లాడుతూ.. మీరు మోనితను పిలిచారంటే.. మీకు అంజి ఆచూకీ తెలిసిందా మేడమ్ అని అంటుంటే.. మోనిత ఆ మాటలు విని.. అంటే రిజిస్టర్ ఆఫీస్‌కు ఫోన్ చేసి అభ్యంతరం చెప్పింది అసలైన అంజి కాదనుకొంటా. దీపే ఈ నాటకం ఆడిందన్న మాట. ఒసే దీప ఇంత నాటకం ఆడిస్తావా? చూస్తా.. నీ అంతు చూస్తా అంటూ మోనిత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X