Karthika Deepam డబుల్ సిమ్.. నీకు నేను, దీపలా.. కార్తీక్‌కు మోనిత మరో షాక్

కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పెళ్లికి ఏర్పాట్లు చేసుకొంటుండగా దీప, అత్త సౌందర్య మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. పుణ్యస్త్రీల బతికిన నా జీవితం నుంచి పుణ్యం తీసి మోనితకు ఇవ్వాలా? అంటూ దీప ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో కార్తీక్ కూడా చాలా మదనపడుతున్నాడంటూ సౌందర్య చెప్పబోగా.. అడ్డుకొన్న దీప.. అయితే నిస్సహయతోనే రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లి పెళ్లికి ఒప్పుకొన్నాడా అంటూ దీప ప్రశ్నించింది. ఇలా భావోద్వేగంగా సాగుతున్న ఈ సీరియల్ 1082లో ఇంకా ఏం జరిగిందంటే...

కాబోయే భార్యను.. తల్లిని అంటూ

కాబోయే భార్యను.. తల్లిని అంటూ

ఓ వైపు దీప, సౌందర్య మధ్య వాదన జరుగుతుండగానే కార్తీక్‌ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి ఎవరు అంటూ.. నేను.. నీకు కాబోయే భార్యను.. కాబోయే తల్లిని అంటూ మోనిత సమాధానం ఇచ్చింది. ఈ నంబర్ ఎక్కడిదని ప్రశ్నిస్తే.. కొత్త నంబర్.. నీ భార్య ముందు నా ఫోన్ మోగితే ఎత్తవని కొత్త నంబర్ తీసుకొన్నాను. డబుల్ సిమ్.. నేను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డలాగా, అలాగే నేను, నీకు దీప లాగా అంటూ మోనిత చెప్పిన మాటలకు కార్తీక్ విసుగు చెందాడు.

 మోనితకు క్లాస్ పీకిన కార్తీక్

మోనితకు క్లాస్ పీకిన కార్తీక్

నీకు మర్యాద పూర్వకంగా, గౌరవపూర్వకంగా మాట్లాడటం రాదా? గొంగడి పురుగులు పారినట్టు మాట్లాడకు. ఆడవాళ్లంటే సున్నితమైన అభిప్రాయం పోయేలాగా వ్యవహరించకు. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడూ అంటూ మోనితకు కార్తీక్ క్లాస్ పీకాడు. దాంతో నీవు క్లాస్ పీకావు కదా.. ఇక ప్రియమణిలా మాట్లాడను. ప్రియంగా మాట్లాడుతా అంటూ మోనిత మరో షాక్ ఇచ్చింది.

 పెళ్లికి ఇబ్బంది అంటూ మోనిత

పెళ్లికి ఇబ్బంది అంటూ మోనిత

కార్తీక్‌తో మోనిత మాట్లాడుతూ.. మన పెళ్లి విషయంలో అడ్డంకి ఏర్పడింది. నా దురదృష్టమో.. లేదా దీప అదృష్టమో పెళ్లి జరిగేటట్టు కనిపించడం లేదు. ఆ విషయం మాట్లాడుదామని నేను ఫోన్ చేశాను. కానీ నువ్వేమో ఇలా క్లాస్ పీకుతున్నావు అని చెప్పింది. దాంతో ఏం జరిగింది.. నేను వెంటనే ఇంటికి వచ్చేస్తాను అంటూ మోనిత ఇంటికి కార్తీక్ బయలుదేరాడు.

కొత్త అల్లుడిలా చూడకు..

కొత్త అల్లుడిలా చూడకు..

తన ఇంటి గడప ముందు ఆగిపోయిన కార్తీక్‌ను చూసి.. అక్కడే ఆగిపోయావేంటి పరాయి వాడిలా.. కొత్త అల్లుడిలా ఇబ్బందిగా చూస్తావు లోపలికి రా అంటూ పిలిచింది. ఇది మన ఇల్లు.. అంటూ సంతోషంలో మునిగిపోయింది. దాంతో ఏదో ప్రాబ్లెం అన్నావు.. అని కార్తీక్ అడిగితే.. ఎంత సేపు ఆ ఇంట్లోనే ఉంటావా? నేను రమ్మంటే రావని.. చిన్న అబద్దం చెప్పాను అంటూ మోనిత అనగానే... నేను అంత ఖాళీగా కనిపిస్తున్నానా? అని కార్తీక్ ప్రశ్నించాడు.

దీప కంటే నిన్నే నమ్మానానంటూ..

దీప కంటే నిన్నే నమ్మానానంటూ..

ఇంతకు మన పెళ్లికి సాక్ష్యులుగా సంతకాలు చేయడానికి దీప, సౌందర్యకు చెప్పావా అని మోనిత అడిగితే.. నీవు నాకు ఫ్రెండ్‌వు. దీప కంటే నిన్నే ఎక్కువగా నమ్మాను. కానీ నీవు ఇలా చేస్తావని అనుకోలేదు అని కార్తీక్ సమాధానం చెబితే.. ఫ్రెండ్ అయితే కడుపు చేస్తావా? కడుపు చేస్తే ఊరుకోవాలా? నేను ఆడపిల్లను.. నా పరిస్థితి ఏం కావాలి. నా కడుపులో బిడ్డకు నీవే కారణం అంటూ మోనిత షాకిచ్చింది.

 దీపకు మోనిత కాల్

దీపకు మోనిత కాల్

కార్తీక్‌తో ఇలా మాట్లాడుతూనే.. దీపకు మోనిత కాల్ చేసింది. పెళ్లి కోసం తెచ్చిన బట్టలను చూపిస్తూ.. ఏ చీర కావాలో చెప్పండి అంటూ మోనిత అడిగితే కోపంతో దీప కాల్ కట్ చేసింది. మోనిత చేసిన చేష్టలకు మరింత విసిగిపోయిన కార్తీక్ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. ఇలా కార్తీక్‌ను మోనిత రకరకాలుగా ఇబ్బందుల్లో పడేసేందుకు సిద్ధమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X