Karthika Deepam తల్లిపై ఒట్టేసి అసలు విషయం చెప్పిన కార్తీక్.. అనైతికం అంటూ సౌందర్య

మోస్ట్ రేటింగ్‌తో సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పెళ్లి ఏర్పాట్లతో ముందుకెళ్లడం సౌందర్య, దీప, కార్తీక్‌లో ఆందోళనకు, టెన్షన్‌కు గురిచేసింది. మోనిత చేస్తున్న పెళ్లి పనులపై దీప, సౌందర్య ఎమోషనల్‌గా చర్చించుకొన్నారు. అలాగే తల్లి సౌందర్య, కార్తీక్ మధ్య భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. 1083 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే...

మోనితను కార్తీక్ పెళ్లి చేసుకొంటానని చెప్పాడు కదా..

మోనితను కార్తీక్ పెళ్లి చేసుకొంటానని చెప్పాడు కదా..

మోనిత వీడియో కాల్ చేసి పెళ్లి బట్టల గురించి చర్చించడంతో దీప, సౌందర్య ఒకరకమైన డిఫెన్స్‌లో పడ్డారు. కార్తీక్ తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్న సౌందర్య మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా వారిద్దరూ స్నేహంగా ఉన్నా.. కార్తీక్ అలాంటి దృష్టితో చూడలేదు అని అంటే.. చాలాసార్లు పెళ్లి చేసుకొంటానని చెప్పారు. అప్పుడు కూడా స్నేహభావంతోనే ఆ ప్రయత్నాలు చేసి ఉంటారా అత్తయ్య అని దీప గట్టిగా సమాధానం ఇచ్చింది. అక్కడ కూడా ఆదర్శం కోసం మోనితకు జీవితాన్ని, భవిష్యత్‌ను అందిస్తున్నాడా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.

 కార్తీక్ ఆ పని చేశాడంటే నమ్మను

కార్తీక్ ఆ పని చేశాడంటే నమ్మను

సౌందర్యతో దీప మాట్లాడుతూ.. మీ చక్కటి పెంపకంలో పెరిగిన మీ అబ్బాయి.. ఇద్దరు బిడ్డలు ఉండగా.. మరో బిడ్డను మోనితకు ఎందుకు ఇస్తున్నాడు అని ప్రశ్నిస్తే.. నీవు నమ్మకపోయినా.. నమ్మినా కార్తీక్ ఆ పని చేశాడంటే నేను నమ్మను. నిన్ను నమ్మించడానికి వీడియో కాల్ చేసి.. చీరలకంటే.. కార్తీక్ తన వెంట ఉన్నాడనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించింది. మంచి, చెడుకు, నైతికానికి, అనైతికానికి మధ్య నిలిగిపోతున్నాడు అంటూ సౌందర్య నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. నిన్ను కార్తీక్ అనుమానించినా నేను మాత్రం నమ్మలేదు. నీవు నిప్పని నమ్మాను. మోనిత ప్రయత్నాలు వెనుక ఏదో మర్మం ఉంది అని చెప్పి అక్కడి నుంచి సౌందర్య బయలుదేరింది.

సుడిగుండంలో మునిగిపోయానంటూ కార్తీక్

సుడిగుండంలో మునిగిపోయానంటూ కార్తీక్

మోనిత తీరుతో కలత చెంది రోడ్డుపై నడుచు కొంటూ వస్తున్న కార్తీక్‌ను చూసి సౌందర్య కారు ఆపింది. కారులో కాకుండా ఎందుకు నడిచి వస్తున్నావు అంటూ ప్రశ్నిస్తే.. నా బతుకు మాదిరిగానే నా కారు కూడా పాడైంది. మోనిత ఇంటి నుంచే వస్తున్నావా? అంటే అవును అంటూ కార్తీక్ సమాధానం చెప్పాడు. ఆ విషయం మరిచిపోయావా? అంటే సుడిగుండంలో మునిగిపోయాను అంటూ కార్తీక్ ఆవేదన చెందాడు. మోనిత పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నది. దీప ముఖాన్ని ఎలా చూడాలి అంటూ కార్తీక్ బాధను వ్యక్తం చేశాడు.

హద్దు మరిచి తప్పు చేశావంటూ..

హద్దు మరిచి తప్పు చేశావంటూ..

అయితే కార్తీక్ బాధను అర్ధం చేసుకొంటూ.. మోనితతో జరిగిన తప్పులో నీ తప్పు లేదంటే ఒప్పుకోను. స్నేహానికి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దును మరిచి తప్పు చేశావు అని సౌందర్య అంటే.. అవును ఆ ఇంట్లో తాగడం తప్పు.. తాగి ఆ ఇంట్లో పడుకోవడం తప్పు అంటూ కార్తీక్ అంటే.. అది క్షమించరాని తప్పు. నేను దీపకు న్యాయం చేయమంటే.. మోనిత కడుపులో పెరిగే బిడ్డకు అన్యాయం చేసినట్టే.. కానీ దీపవైపే నేను నిలబడ్డాను. ఎందుకంటే మోనిత, నీవు అనైతికంగా ప్రవర్తించారు కాబట్టి అని సౌందర్య సమాధానం ఇచ్చింది.

దీప ఉసురు తగలిందంటూ...

దీప ఉసురు తగలిందంటూ...


తల్లి సౌందర్య మాటలతో మరింత ఎమోషనల్‌గా మారిన కార్తీక్.. జరిగిన తప్పులో నాకు తెలిసి జరుగలేదు. అసలేమీ తెలియదు మమ్మి... ఏం జరిగిందో తెలుసుకోనే విషయం కంటే.. ఏం జరగబోతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ కార్తీక్ అంటే... ఇలాంంటి ధీనావస్తలో నేను నీకు సపోర్ట్ చేయలేను. నేను నిప్పు జోలికి వెళ్లకు కాలుతుందంటే నమ్మలేదు. ఆ నిప్పే నిన్ను దహించి వేస్తుంది. దీపకు చేసిన అన్యాయానికి ఉసురు తగిలింది అంటూ కార్తీక్‌కు క్లాస్ పీకింది.

దీపకు గుడికట్టి దేవతలా చూడాలని

దీపకు గుడికట్టి దేవతలా చూడాలని

మోనిత పెళ్లి ప్రయత్నాలు, పెళ్లి బట్టలు కొనడం లాంటివి నా ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి అంటూ కార్తీక్ దీనంగా చేతులెత్తి వేడుకొన్నాడు. నేను నటించడం లేదు. నా తప్పును కప్పి పుచ్చుకోవడం లేదు. నేను మనసులో ఏమీ అనుకొంటున్నానో అదే చెబుతున్నాను. నాకేమీ తెలియదు కానీ నేనే కారణం అయ్యాను. నా తప్పేమీ లేదు కానీ నేను బాధ్యుడినయ్యాను. దీపకు గుడికట్టే దేవతలా చూసుకోవాలని అనుకొన్నాను. కానీ అంతా శాపంగా మారింది అంటూ కార్తీక్ కన్నీళ్ళను తుడుచుకొంటూ వెళ్లిపోయారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu

Photo Courtesy: Star మా and Disney+Hotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X