Karthika Deepam మోనిత ఇంట్లో అది జరిగితే గుర్తుకు రావాలి కదా.. కార్తీక్.. ఏదో కట్టుకథ ఉంది.. సౌందర్య

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీక దీపం సీరియల్‌లో మోనిత సృష్టిస్తున్న వ్యవహారాలు దీప, సౌందర్య, కార్తీక్‌లో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు లేస్తున్నాయి. మోనితతో పెళ్లిని ఎలా ఆపాలని కార్తీక్ అని ఆలోచనలో పడిపోయాడు. దీపను నచ్చ చెప్పేందుకు సౌందర్య ప్రయత్నాలు చేసింది. ఇలాంటి భావోద్వేగ సంఘటనల మధ్య 1084 ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

లడ్డూల బాక్స్‌తో హిమ, శౌర్య

లడ్డూల బాక్స్‌తో హిమ, శౌర్య

లడ్డూల బాక్స్‌తో ఇంటికి వచ్చిన శౌర్య, హిమపై దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూలు ఎక్కడివని ప్రశ్నిస్తే.. భాగ్యం అమ్మమ్మ ఇంటికి వెళ్తే వద్దన్నా ఇచ్చింది అని సమాధానం చెప్పారు. దాంతో చెప్పకుండా ఎందుకు వెళ్లారు అని దీప అంటే.. నువ్వు, నాన్న సరిగా మాట్లాడుకోవడం లేదుగా... కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్లాం. కానీ భార్య, భర్తల మధ్య అలాంటి గొడవలు సాధారణం. వారం రోజుల్లో కలిసిపోతాం అని అమ్మమ్మ చెప్పింది అని హిమ, శౌర్య చెప్పారు.

 మోనితతో పెళ్లి ఎలా ఆపాలి

మోనితతో పెళ్లి ఎలా ఆపాలి

మోనితతో పెళ్లిని ఎలా ఆపాలి అనే ఆలోచనలో కార్తీక్ పడిపోయాడు. అసలు ఆ రోజు తప్ప తాగినా అలాంటి పని జరిగిందనే విషయం నాకు గుర్తుకు రావడం లేదు. మోనిత ఇంట్లో చాలా సార్లు తాగాను. కానీ ఆ రోజే ఎందుకు అలా జరిగింది. కనీసం ఆ రాత్రి గుర్తుకు లేకపోయినా.. ఆ సంఘటన గురించి మరుసటి రోజైనా ఎంతో కొంతో గుర్తుకు రావాలి కదా. ఆ విషయంలో ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రాకపోతే ఈ సమస్యకు పరిష్కారం లభించదు అంటూ కార్తీక్ తన మనసులో అనుకొంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నా కొడుకు నిర్దోషి అంటూ సౌందర్య

నా కొడుకు నిర్దోషి అంటూ సౌందర్య

అనేక ఆలోచనల్లో పడిపోయిన దీప.. తన అత్త సౌందర్య వీడియో కాల్‌తో ఉలికిపడింది. కార్తీక్‌ను చూశాను.. చాలా దయనీయంగా కనిపించాడు. తల్లిగా వాడిని వెనుకేసుకు రావడం లేదు. నా కొడుకు నిర్దోషి అనేది నీవు గుర్తిస్తే చాలూ అని సౌందర్య అంటే.. నీ కొడుకు గురించి ఏదైనా చెప్పాలనుకొంటే చెప్పు అని దీప సమాధానం ఇచ్చింది. సౌందర్య చెప్పే మాటలను పట్టించుకోకుండా దీప డొంక తిరుగుడు సమాధానాలు చెప్పింది. దాంతో నేను చెప్పే మాటలు విని ఆ దిశగా ఆలోచించేందుకు ప్రయత్నించు అంటూ సౌందర్య చెప్పి కాల్ కట్ చేసింది.

ఏదో కట్టుకథ ఉందంటూ సౌందర్య అనుమానం

ఏదో కట్టుకథ ఉందంటూ సౌందర్య అనుమానం

మోనిత విషయంలో కార్తీక్ తప్పు చేయలేదు. ఆ విషయంలో ఏదో కట్టు కథ జరిగింది. దీపకు నచ్చ చెప్పలేక.. మోనితను అదుపు చేయలేక కార్తీక్ నలిగిపోతున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడోననే భయం వెంటాడుతున్నది. ఎవరికి న్యాయం.. ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ సమస్యకు ఎలాంటి పరిస్థితి ఎలాంటి పరిష్కారం దొరుకుందో వేచి చూడాల్సిందే అని దేవుడు దండం పెట్టుకొంటూ సౌందర్య ఆవేదనను వ్యక్తం చేసింది.

దీప, సౌందర్యకు చీరెలు

దీప, సౌందర్యకు చీరెలు

ఇలాంటి పరిస్థితుల్లో మోనిత పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. దీప, సౌందర్యకు చీరెలు పెట్టేందుకు సిద్ధమైంది. అయితే దీపకు చీరలు పెడితే ఎలా రియాక్ట్ ఎలా అవుతుందో.. నీవు సౌందర్యకు చీరె పడితే తుపాకీ తీసుకువచ్చి కాల్చిపడేస్తుందో అని ప్రియదర్శి సంతోషంలో వాగడం మొదలు పెట్టింది. నీ ధైర్యం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అలాంటి ధైర్యం ఆడదానిలో ఉండాలి. కానీ నీవు చేసే పని వల్ల కాపురం కూలిపోతుంది. ఇదంతా నీకు జరిగిన అవమానం వల్ల చేస్తున్నావో... లేదా కార్తీక్‌పై ప్రేమతో చేస్తున్నావో అని ప్రియదర్శి అంటే.. కార్తీక్ ప్రేమ అని ఫిక్స్ అయిపో అంటూ మోనిత చెప్పింది. చీరెలు ఇవ్వడానికి రేపు సాయంత్రం వెళ్తా.. ఉదయం ముఖ్యమైన పని ఉంది అంటూ ప్రియదర్శికి చెప్పింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu

Photo Courtesy: Star మా and Disney+Hotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X