Karthika Deepam నిన్ను, కరోనాను ఒకేలా చూస్తున్నారు.. కార్తీక్ ప్లేట్ ఫిరాయిస్తే... మోనితకు షాకిచ్చిన ప్రియమణి

కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడంతో ఇక ముందు ఈ కథ, కథనాలు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నీవే అంటూ మోనిత, నీ విషయం తెలిస్తే పిల్లల దృష్టిలో నీవు ఏమైపోతావు అంటూ కార్తీక్‌ను దీప అనడం, ఇలాంటి దీనావస్తలో నిన్ను రక్షించలేకపోతున్నాను అంటూ తల్లి సౌందర్య నిలదీస్తున్న నేపథ్యంలో కార్తీక్ తీసుకొన్న నిర్ణయం 1085 ఎపిసోడ్‌ ఎలా ఉందంటే...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

నేను నేరస్థుడిగా ఎందుకుండాలి?

నేను నేరస్థుడిగా ఎందుకుండాలి?

సుడిగుండంలో కూరుకుపోతున్న కార్తీక్ దాని నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. ఈ జీవితం నాది. నా వ్యక్తిత్వం వేరు. నా సంస్కారం మీద నమ్మకం వేరు. నేను తల ఎందుకు దించుకోవాలి. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు అపరాధ భావంతో ఉండాలి. నేను నేరస్థుడిగా ఎందుకు ఉండాలి అంటూ కార్తీక్ తనలో తాను గట్టిగా అనుకొంటూ నిర్ణయం తీసుకొన్నాడు.

నా కుటుంబానికి సంతోషాన్ని ఇస్తా..

నా కుటుంబానికి సంతోషాన్ని ఇస్తా..

సుపుత్రుడు, వంశోద్దారకుడు, దేశోద్దారకుడు అని అమ్మ అనాలి తప్ప. నన్ను చూసి ఏవగించుకోకూడదు. ఇక ముందు అలా జరగకూడదు. నేను తప్పు చేసిన వాడిలా ఉండకూడదు. నేను అక్కడే వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొంటున్నాను. ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలి. మోనిత కడుపు గురించి తేల్చుకోవాలి. ఇవాల్టి నుంచి దీప, పిల్లలతో సంతోషంగా ఉండాలి. భర్తగా, తండ్రిగా, కొడుకుగా, డాక్టర్‌గా మళ్లీ నా బాధ్యతలను స్వీకరిస్తాను. నా వాళ్లకు మళ్లీ సంతోషాన్ని ఇస్తాను. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే మూలం అని కార్తీక్ సీరియస్‌గా నిర్ణయం తీసుకొన్నాడు.

మోనిత తన అందాన్ని చూసుకొని

మోనిత తన అందాన్ని చూసుకొని

ఇక పెళ్లి పనుల్లో బిజీగా మారిన మోనిత.. అద్దం ముందు తన రూపాన్ని చూసి తానే పొంగిపోయారు. ఎంత అందంగా ఉన్నావే అంటూ పొంగిపోయింది. కార్తీక్ నా అందాన్ని చూసైనా ఒప్పుకోవాలి. ఈ సమాజంలో వెర్రివాళ్లు, పిచ్చివాళ్లు అవకాశాన్ని ఉపయోగించుకోవడం రాని వాళ్లు పెరిగిపోతున్నారు. దేవుడు ఇచ్చిన జీవితంలో 16 ఏళ్లు పనికిరాకుండా గడిచిపోయాయని కార్తీక్‌కు ఉపదేశిస్తాను అంటూ తనలో తాను మోనిత చెప్పుకొన్నది.

కొట్టి పంపిస్తారని షాకిచ్చిన ప్రియమణి

కొట్టి పంపిస్తారని షాకిచ్చిన ప్రియమణి

మోనిత తన అందాన్ని చూసి మురిసిపోతున్న సమయంలోనే వంట మనిషి ప్రియమణి వచ్చి.. అక్కడికేనా అంటూ ప్రశ్నించింది. అయితే నీకు తెలిసినంక కూడా నీవు ఎందుకు అడుగుతున్నావెందుకు అని మోనిత నిలదీసింది. అయితే అక్కడికి వెళ్తే ఏం జరుగుతందో తెలిసిన తర్వాత కూడా అక్కడికి వెళ్లేందుకు ఎందుకు అని ప్రశ్నించింది. అక్కడి వెళ్తే ఏం జరుగుతుందని మోనిత అడిగితే.. ఒట్టి మనిషి కాదు అని తెలిసి కూడా కొట్టి మరీ పంపిస్తారు. ఇప్పుడు కొట్టి పంపిస్తే పడటానికి నీవు ముందులా ఒట్టి మనిషి కావు కదా అంటూ ప్రియమణి చెప్పింది.

కథ మంచి రసపట్టులో ఉందంటూ..

కథ మంచి రసపట్టులో ఉందంటూ..

ప్రియమణి సమాధానంతో సంతృప్తి చెందని మోనిత.. తప్పు చేశాడని వంటలక్క, సౌందర్య నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ల ఇంటిగుట్టు నా చేతిలో ఉంది. ఇప్పుడు కథ మంచి రసపట్టులో ఉంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న ఈ సమయంలో అందరూ దూరంగా నిలబడే మాట్లాడుతున్నారు అంటూ మోనిత చెబితే... అది మీరు అనుకొంటున్నారు. వాళ్లు దీప ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆమె తోక పట్టుకొని వెనుకే వచ్చాడు. ఇక సౌందర్య తన కుమారుడి పరిస్థితి చూసి ఆయనపై జాలి పడుతుందే కానీ.. మీ మీద జాలి పడటం లేదు అంటూ ప్రియమణి చెప్పింది.

మోనితపై ప్రియమణి సెటైర్లు

మోనితపై ప్రియమణి సెటైర్లు

మోనిత వ్యవహారంపై ప్రియమణి గట్టిగానే సెటైర్లు వేసింది. నిన్ను, కరోనాను ఒకేలా చూస్తున్నారే తప్ప.. మీకు న్యాయం చేయాలని చూడటం లేదు అని ప్రియమణి అంటే.. అలా అని పెళ్లికాని తల్లిలా ఉండాలా? అంటూ ప్రశ్నించింది. అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయని అనుకోవద్దు. ఒక మాట చెబుతాను వినండి. కార్తీక్ అందరి లాంటి మగాడే. కారణ జన్ముడు, మహానుభావుడు కాదు. తన కుటుంబ ప్రతిష్టకు ముప్పు వాటిల్లుతుందనుకొంటే వెంటనే ప్లేట్ ఫిరాయిస్తాడు అని ప్రియమణి గట్టిగా చెప్పింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
కార్తీక్ ప్లేట్ ఫిరాయిస్తే..

కార్తీక్ ప్లేట్ ఫిరాయిస్తే..

ఒక కార్తీక్ అలాంటి నిర్ణయం తీసుకుంటే నీ పని గోవిందా అనే విధంగా ప్రియమణి షాకిస్తూ.. కార్తీక్ నా తప్పు లేదని బుకాయిస్తే.. నీవు న్యాయపోరాటం, ఇంటి ముందు టెంట్లు, కోర్టులు, పోలీసులతో కాలం గడిచిపోతుంది. అప్పటికీ నీ బిడ్డ పెళ్లీ ఈడుకు వస్తుంది. కాబట్టి మీకే అన్ని తెలుసు అని అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండకుండా మీకు ఎలా న్యాయం జరుగుతుందనే విషయంపై దృష్టిపెట్టండి అంటూ ప్రియమణి ఝలక్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X