Karthika Deepam నీకో దండం అంటూ కార్తీక్ షాక్.. అందరి సంగతి తేలుస్తా మోనిత శపథం

తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీకదీపం సీరియల్‌లో మోనిత బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్ పెట్టేందుకు కార్తీక్ సిద్ధమయ్యాడు. పెళ్లి కోసం మోనిత చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ ఆమెకు కార్తీక్ గట్టి షాకిచ్చారు. నా సమస్యలకు నేనే పరిష్కరించుకొంటానని హెచ్చరించిన మోనిత చేయిపట్టుకొని ఆపేశాడు. ఆ తర్వాత మోనిత, కార్తీక్ మధ్య 1086 ఎపిసోడ్‌లో కనిపించిన ప్రధాన అంశాలు ఏమిటంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 నీ చేతిలో నా చేయి.. నా జీవితం అంటూ

నీ చేతిలో నా చేయి.. నా జీవితం అంటూ

తన చేయి పట్టుకొని ఆపిన కార్తీక్‌తో మోనిత ఆవేశంగా మాట్లాడుతూ... నీ చేతిలో నా చేయి మాత్రమే కాదు. జీవితం కూడా ఉంది అని అనగానే.. కార్తీక్ చేయి వదిలేశాడు. దాంతో చేయి వదిలేసినంత సులువు కాదు.. నా సమస్యను వదిలేయడం అంటూ తనదైన శైలిలో నవ్వుతూ మోనిత ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అప్పటి వరకు మౌనంగా ఉంటున్న కార్తీక్ ఒక్కసారిగా మోనితపై భగ్గుమన్నాడు.

నీలో ప్రేమలేదు.. నాలో స్వార్ధం లేదు

నీలో ప్రేమలేదు.. నాలో స్వార్ధం లేదు

నీవు చేస్తున్నది నాపై పంతం. నీలో ప్రేమ లేదు. నాది స్నేహం. ఇందులో స్వార్థం లేదు. నీ చిక్కు ముడితో నా చేతులు కట్టిపడేశావు. అయినా ఓపిక పడుతున్నావు. నాకు తెలియకుండా జరిగింది నా తప్పుల జాబితాలో చేరదు. అయినా మౌనంగా భరిస్తున్నాను. ఈ దోషాన్ని మా అమ్మకు, నా భార్యకు అంటగట్టాలని చూస్తున్నావు. అది మాత్రం నేను సహించను అంటూ కార్తీక్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 నీవు నేను చూసిన మోనితవు కాదు...

నీవు నేను చూసిన మోనితవు కాదు...

మోనితకు గట్టిగా బదులిస్తూ.. నీవు ఇప్పటి వరకు చూసిన మోనితవి కాదు. నువ్వెవరో. నీలో ఇది చూడనిది. నాకు నచ్చనిది. నాకు ముప్పు తెచ్చేది. ఇలాంటి వాటిని నీలో చూడలేదు. స్నేహం కావాలంటే.. మొదటి వరుసలో నేను ఉంటాను. న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచను. నీవు అన్యాయానికి, అత్యాచారానికి గురైనట్టు ఫీల్ అవుతున్నావు. నీలో ప్రేమ కానీ, నేను వదిలేస్తాననే బాధ కానీ కనిపించడం లేదు. నీకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంత దూరం వెళ్తావని కనిపిస్తున్నది అంటూ కార్తీక్ దుమ్ము దులిపేసే ప్రయత్నం చేశాడు.

ఆ మూల్యానికి ప్రతిఫలం చెల్లించే...

ఆ మూల్యానికి ప్రతిఫలం చెల్లించే...


కార్తీక్ మాటలకు విస్తుపోయిన మోనిత.. అయితే అంటూ ప్రశ్నించడంతో.. నాకు తెలియని, నా ప్రమేయం లేని చర్యకు నేను నైతిక బాధ్యత వహించలేను. నువ్వు ఇప్పుడు కష్టాల్లో లేవు. నా కాపురాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నావు. ఆ ఛాన్స్ ఎప్పటికీ ఇవ్వలేను. నిజంగా నీ ప్రెగ్నెన్సీకి నేను ప్రత్యక్ష కారణం అని భావిస్తే.. ఆ మూల్యానికి నేను ప్రతిఫలం చెల్లించడానికి వెనుకాడే వాడిని కాదేమో. అప్పుడు నా పరిస్థితి.. ఇలా ఉండేది కాదేమో. ఈ కోణంలో ఆలోచించు.. ఇక నేను వెళ్తున్నాను అంటూ మోనితకు కార్తీక్ చేతులెత్తి దండం పెట్టాడు.

నా స్టైల్‌లో బుద్ధి చెబుతా

నా స్టైల్‌లో బుద్ధి చెబుతా

కార్తీక్ ఇచ్చిన షాక్‌తో ప్రియమణి చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి. కార్తీక్ అందరి లాంటి మగాడే.. తన జీవితానికి ముప్పు వస్తుందని భావిస్తే ప్లేట్ ఫిరాయిస్తాడు అంటూ ప్రియమణి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆవేశంలో మునిగిపోయి.. నేను మోనితను.. నన్నే ఆడిస్తారా? పెళ్లి దగ్గరపడుతుంటే.. వాళ్లలో టెన్షన్ పెరుగుతుందనుకొంటే.. నాలో టెన్షన్ పెంచుతున్నారా? లేదు.. నేను ఓటమిని ఒప్పుకోలేను. దీపలాగా తలవంచలేను. నేను టెన్షన్ పడకూడదు. నేను టెన్షన్ పెట్టాలి. తేలుస్తా.. ఒక్కొక్కరి సంగతి తేలుస్తా? అమెరికా వెళ్లిన సౌందర్యను హెచ్చరిస్తూ.. అందరికీ నా స్లైల్‌లో బుద్ది చెబుతా అంటూ మోనిత ఛాలెంజ్ విసిరింది.

 మరో మలుపుకు సిద్ధమైన కార్తీకదీపం

మరో మలుపుకు సిద్ధమైన కార్తీకదీపం

మోనిత పెడుతున్న ఒత్తిడికి తలవంచినట్టు కనిపించిన కార్తీక్ ఊహించని విధంగా తనదైన శైలిలో బదులు ఇవ్వడంతో కార్తీక దీపం సీరియల్ కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. కార్తీక్ ఎత్తుగడకు మోనిత పై ఎత్తు వేసేందుకు ఏం చేస్తుందనే విషయం మరింత ఆసక్తిగా మారింది. ఇద్దరు పిల్లల తర్వాత కార్తీక్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొన్నాడని అత్త భాగ్యం చెప్పిన విషయాలు ఈ సీరియల్‌లో ఏం జరగబోతుందని మరింత క్యూరియాసిటిని పెంచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X