Karthika Deepam దీపపై ఒట్టేసిన కార్తీక్.. కరివేపాకు కోసం వెళితే కడుపు..మోనితను కడిగేసిన భాగ్యం

బుల్లితెర ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న కార్తీకదీపం సీరియల్‌లో 1087 ఎపిసోడ్‌లో రకరకాల భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. కార్తీక్, దీప మధ్య చోటుచేసుకొన్న అనుమానాలు తొలిగిపోయేలా, అలాగే తన సోదరుడిపై ఉన్న అపనమ్మకం పోయేలా ఆదిత్య, అలాగే కట్టుకథలు చెబుతున్నావంటూ మోనితపై భాగ్యం.. భర్తపై మెల్లగా నమ్మకం కుదురుతున్నట్టు దీప విషయాలు ఎపిసోడ్‌లో హైలెట్ అయ్యాయి. ఇంకా లేటేస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 ఇలాంటి మార్పుతో రావడం

ఇలాంటి మార్పుతో రావడం

దీపతో తన నిజాయితీ చెప్పుకొంటూ.. నాలో ఆశ్చర్యం ఎందుకంటే.. నిన్నటి వరకు ఏదో తప్పు చేసినట్టు తలదించుకొన్నాను. కానీ ఇప్పడు ఇంతటి మార్పుతో మీ ముందుకు వచ్చాను. అసహ్యం ఎందుకన్నాను అంటే చేసిందంతా చేసి ఏమీ ఎరుగనట్టు సిగ్గు, శెరం లేకుండా మీ ముందుకు వచ్చి నా భార్య బిడ్డలతో ఇలా ఉన్నందుకు అంటూ కార్తీక్ తన మనసులోని భావాలను చెప్పుకొంటూ వెళ్లాడు. తాను తప్పు చేయలేదని దీపకు నమ్మకం కుదిర్చేందుకు కార్తీక్ ప్రయత్నించాడు. దీప నేను తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేస్తే.. తప్పించుకోవడం తెలియదు. తప్పు చేయకుండానే నిన్న అపరాధ భావంతో తలదించుకొని ఉన్నాను. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను అని కార్తీక్ చెప్పాడు.

నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు

నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు

నా వల్ల ఏదో జరిగిందంటే నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఎవరో అన్యాయం జరిగిందని చెబితే దానికి తలవంచి ఉండాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నా మనసులో భార్యబిడ్డలు మాత్రమే ఉన్నారు. ఒక సంతోషం, వారి భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. ఒకరి ఆరోపణలు నాకు అనవసరం. దానిని ఎదిరించడానికి దేనినైనా ఎదురించగలను. దేనినైనా తట్టుకోగలను. కానీ నీ నుంచి అనుమానాన్ని, అపనమ్మకాన్ని దూరం చేయడానికి తుడిచేయాలి. ఈ నెల 25వలోపే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదంతా నటన కాదు నిజం. నీ మీద ఒట్టు. నేను నీవాడినే అంటూ కార్తీక్ తన మనసులో ఉన్న వాస్తవాన్ని చెప్పాడు.

కార్తీక్‌పై ఆదిత్య అసహనంతో

కార్తీక్‌పై ఆదిత్య అసహనంతో

ఇక కార్తీక్ వ్యవహరిస్తున్న తీరుపై సోదరుడు ఆదిత్య అసహనంతో రగిలిపోయాడు. నా అన్నయ్య చేసిన పనికి సిగ్గుపడకుండా తిరుగుతున్నాడు. కార్తీక్ నా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గు ఉంది అంటూ భార్య శ్రావ్యతో ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి మమ్మీ ఎప్పుడొస్తుందని అడిగాడు. సమస్యను వదిలేసి తన మానాన తాను అమెరికా వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు అన్నయ్య తప్పు చేశాడని అనిపించడం లేదు. నీవు కూడా ఆ కోణంలో ఆలోచించు అని చెప్పింది. అయితే అత్తయ్య నీకో విషయం చెప్పవద్దని చెప్పింది. మోనిత 25వ తేదీన మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్‌లో స్లాట్ బుక్ చేసుకొన్నది అని శ్రావ్య అంటే.. వదినకు ఈ విషయం తెలుసా అని ఆదిత్య అడిగాడు.

సెల్ఫీని చూసి మురిసిపోయిన దీప

సెల్ఫీని చూసి మురిసిపోయిన దీప

కార్తీక్‌ శ్రావ్య, శౌర్యతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను చూసి దీప మురిసిపోయింది. పిల్లల ముఖాల్లో సంతోషాన్ని చూస్తూ సంతోష పడింది. అయితే ఫోటోలో మోనిత గీసిన 10 డెడ్‌లైన్ గీతలు కనిపించడంతో మళ్లీ కోపం వచ్చింది. వెంటనే నీళ్లు తీసుకొని ఆ గీతలను కసితీరా తుడిపేసింది. ఆ తర్వాత కాస్త ఉపశమనం పొందింది.

భాగ్యంపై మోనిత ఆగ్రహం

భాగ్యంపై మోనిత ఆగ్రహం

ఇక తన హాస్పిటల్‌కు వెళ్లి తన కడుపుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మోనిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీప సవతి తల్లి భాగ్యం వద్దకు వెళ్లింది. నా గురించి తప్పుగా మాట్లాడుతావా అంటూ మోనిత ప్రశ్నిస్తే.. భాగ్యం ఊగిపోయింది. అమాయకుడైన నా అల్లుడి మంచితనాన్ని చూసుకొని ఆటాడిస్తున్నావా? కడుపు అంటూ కట్టుకథ చెబుతున్నావా? ఆయన మంచి తనాన్ని చూసుకొని మరో మహిళ వచ్చి కరివేపాకు కోసం వెళితే కడుపు చేశాడని అంటే ఏం కావాలి.. నీ కట్టుకథలు ఆపు అంటూ భాగ్యం ఫైర్ అయింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
కాకమ్మ కథలు చెప్పకు అంటూ

కాకమ్మ కథలు చెప్పకు అంటూ

నా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ మోనిత అంటే.. నీవు డాక్టర్‌వు.. ఎలాంటి రిపోర్టులైనా సృష్టించగలవు. దొంగ సాక్ష్యం పుట్టించవన్న నమ్మకమేంటి? నీవు దొంగ కడుపు పుట్టించి ఉంటావు. నీ లాంటి ఆడదాని మెడలో తాళి కడతానంటే ఊరుకోను. పెళ్లైన వాడిపై మోజు పడటం సంసారపక్షం ఆడది చేసే పనేనా? నా కూతురు దీప తన కుటుంబ పరువుపోతుందని ఆగింది. లేకపోతే నీ పని చేసేది అంటూ భాగ్యం అంటే.. నేను కార్తీక్ వల్ల తల్లిని కాబోతున్నాను. ఆ సాక్ష్యమే మీ అందరికి బుద్ది చెబుతుంది అని మోనిత అంటే.. చెత్తవాగుడు ఆపు.. పనికి రాని కాగితాలు పట్టుకొచ్చి కాకమ్మ కథలు చెబితే ఎవరు నమ్మరు అంటూ మోనితకు భాగ్యం షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X