Karthika Deepam serial June 16th Episode: కడుపుతో ఉన్నా.. మీ అబ్బాయి చిత్ర వధ.. సౌందర్యకు మోనిత షాక్

కార్తీక దీపం సీరియల్‌లో గర్బవతి అయిన మోనిత ఏం చేస్తుందనే అంచనా వేసిన సౌందర్యకు ఊహించినట్టే జరిగింది. మోనిత ఫోన్ కాల్స్‌ను కార్తీక్ కట్ చేస్తుండటంతో ఏకంగా.. నేరుగా సౌందర్య ఇంటిలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో 1067 ఎపిసోడ్‌లో మోనిత, సౌందర్య, శ్రావ్య మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే...

శ్రావ్య బావ ఎక్కడ అంటూ..

శ్రావ్య బావ ఎక్కడ అంటూ..

సౌందర్య, శ్రావ్య ఏదో మాట్లాడుకొంటుంటే నేరుగా మోనిత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి... నమస్కారం అంటీ.. గుడ్ మార్నింగ్ శ్రావ్య.. బావగారు పైన ఉన్నారా? బావగారు అన్నారని కంగారు పడుతున్నారా? అంటూ మోనిత ప్రశ్నిస్తే.. బావ కనపడటం లేదు. అక్క కనిపించడం లేదంటే.. వారిద్దరు బయటకు వెళ్లారని శ్రావ్య సమాధానం ఇచ్చింది. దాంతో వారిద్దరు కలిసే వెళ్లారా అంటూ మోనిత మళ్లీ ప్రశ్నించింది. కలిసి వెళ్లే అవకాశం లేదంటూ మోనిత తనే సమాధానం చెప్పుకొన్నది. మోనిత వ్యవహారంతో శ్రావ్య కోపంతో ఊగిపోయింది.

సౌందర్యకు పాధాభివందనం

సౌందర్యకు పాధాభివందనం

కోపంలో ఉన్న శ్రావ్యతో మాట్లాడుతూ.. అలా కోపంగా చూడకు.. మీ అక్కకు పోటీగా వచ్చానని కోపంగానే ఉంటుంది లే. అంటీ అయితే నన్ను సరిగా అర్ధం చేసుకొంటారు పాదాభివందనం చేయబోగా.. సౌందర్య తన కాళ్లను పక్కకు జరుపుకొన్నారు. దాంతో ఆంటీ పెద్దవారు. మంచి చెడు తెలిసిన వారు. మంచి మనసు ఉన్నవారు. న్యాయం కోసం, ధర్మం కోసం కొడుకును కాదని కోడలికి అండగా నిలిచిన మానవ మూర్తి అంటూ కార్తీక తలి సౌందర్యపై మోనిత పొగడ్తలు కురిపించింది.

నేను కూడా దీపలాంటి ఆడపిల్లను

నేను కూడా దీపలాంటి ఆడపిల్లను

ఆత్మగౌరవం అంటూ డబ్బులు తీసుకోకుండా దీప బయటకు వెళ్లితే.. కోట్ల రూపాయల విలువైన కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. వెన్నుదిన్నుగా నిలబడ్డ మానవతా మూర్తి మీరు. పదేళ్లపాటు మీ అబ్బాయి చిత్రవధ చేసినా ఇంకా మీ కోడలు ప్రాణాలతో ఉన్నారంటే అది మీ సపోర్ట్ వల్లే. అందరికీ దీపపై సానుభూతి ఉంటే.. ఆశలాగా మీరు అండగా మీరు నిలబడ్డారు. నేను కూడా దీప లాంటి ఆడపిల్లను. మీ అబ్బాయి వల్ల అన్యాయం అయిపోయిన దానిని. పెద్ద మనసు చేసుకొని న్యాయం చేయండి అంటూ మోనిత ప్రాధేయపడింది.

కార్తీక్ ఫోన్ కట్ చేస్తున్నాడు...

కార్తీక్ ఫోన్ కట్ చేస్తున్నాడు...

నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు. నా ఫోన్ కాల్స్ కట్ చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ట్రై చేస్తుంటే స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. నాకు ఎలా ఉంటుంది అంటీ.. ఇది వరకు అయితే ఓకే.. కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరు. బిడ్డల్ని కన్న తల్లిగా మీకు అంతా అర్ధమవుతుంది అని మోనిత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యింది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
పెగ్నెన్సీ సమయంలో మగాడు పక్కనే ఉంటే

పెగ్నెన్సీ సమయంలో మగాడు పక్కనే ఉంటే

ప్రెగ్నెన్సీ సమయంలో మగాడు పక్కనే ఉండి అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ తన బాధను సౌందర్యతో మోనిత చెప్పుకొన్నది. ఆ తర్వాత శ్రావ్యతో మాట్లాడుతూ.. నీవు కూడా ఓ బిడ్డను కన్నావు. కడుపుతో ఉన్న సమయంలో ఆదిత్య నీకు తోడుగా ఉండే వాడు కదా.. అప్పుడు నిన్ను పట్టించుకోకపోతే ఎంత బాధ ఉండేది చెప్పు. ఎవరు నాకు ఎలాంటి న్యాయం చేస్తారో అనే విషయంపై మీపైనే బాధ్యతను పెట్టాను అంటీ.. కార్తీక్ వస్తే.. నేను వచ్చి వెళ్లానని చెప్పు అంటూ మోనిత వెళ్లిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X