Karthika Deepam June 16th Episode:పెళ్లికాకుండా కడుపుతో కన్నెపిల్లను.. దమ్మున్న మగాడివా కార్తీక్‌కు మోనిత షాక్

తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక టీఆర్పీ ఉన్న కార్తీకదీపం సీరియల్‌ మరో కుదుపుకు లోనైంది. దీప ఉంటున్న ఇంటిలో జనతా వైద్యశాల నడిపేందుకు కార్తీక్ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య తనను దీప పట్టించుకోకపోవడంపై కార్తీక్ తనలో తాను మదనపడుతున్నాడు. ఈ క్రమంలో నేరుగా దీప, కార్తీక్ ఉంటున్న ఇంటిలోకి మోనిత ప్రవేశించి.. అప్పటికే గందరగోళంగా ఉన్న వారి మనసులను మరింత ప్రళయం సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య 1067 ఎపిసోడ్‌లో వారి మధ్య ఎలాంటి భావోద్వేగత కనిపించిందంటే..

నోరారా డాక్టర్ బాబు..

నోరారా డాక్టర్ బాబు..

దీప తనతో మాట్లాడకుండా మౌనంగా ఉండటంపై.. నాతో మాట్లాడకపోయినా.. నన్ను అర్ధం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ నోరారా డాక్టర్ బాబు అని పెళ్లైన కొత్తలో పిలిచినట్టుగా పిలువాలి. నా జన్మకు అదే చాలూ. దీప పదేళ్లు నన్ను నమ్మండి. నాతో ప్రేమగా ఉండండి అని ఎన్నోసార్లు ప్రాధేయపడింది. కానీ నేను సరిగా అర్ధం చేసుకోలేకపోయాను. అందరం కలసిపోయి ఆనందంగా ఉంటామని అనుకొన్న సమయంలో.. అని కార్తీక్ అనుకొంటుండగానే మోనిత ఇంటిలోకి వచ్చింది.

ఆనందం కనిపించడం లేదంటూ..

ఆనందం కనిపించడం లేదంటూ..

కార్తీక, దీప పక్కపక్కనే ఉండగా.. ఏమిటీ డిస్ట్రబ్ చేశానా? దీప ఎలా ఉన్నావు. ఆరోగ్యంగా ఉన్నావా? అంటూ పలకరించింది. తీరుగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నట్టు ఉన్నారు. కానీ మీ ముఖాల్లో ఆనందం కనిపించడం లేదు. ఎలా ఆనందం కనిపిస్తుంది.. నాకు ఇలా జరగకపోయి ఉంటే.. ఈపాటికి నీవు, కార్తీక్, పిల్లలు సంతోషంగా ఉంటేవాళ్లు. ఇది కాదు మేము కోరుకొన్నది అని సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య పండుగ చేసుకొనే వారు. మురళీ కృష్ణ అంకుల్ సంబరాలు చేసుకొనే వారు అంటూ మోనిత తన ధోరణిలో మాట్లాడుతూనే ఉంది.

నేనంటే అంత అలుసా?

నేనంటే అంత అలుసా?

కార్తీక్, దీపతో తన మాటలను మోనిత కొనసాగిస్తూ.. పెద్ద కోడలి స్థానంలో దీప ఇంటిలో ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉండేదానివి. నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తూ.. అత్తతో చివాట్లు.. నీతో అగచాట్లు పడుతుండే దానిని. కార్తీక్ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు. నీ ఉద్దేశం ఏమిటి? పిల్లలు లేని సమయంలో ఈ విషయాన్ని మాట్లాడుకొందాం. నా ఫోన్ కట్ చేస్తున్నావు. నేను అంత అలుస అయ్యానా? నన్ను పక్కన పెట్టవా? ఒక మగాడి నిర్ధయ, నిర్లక్ష్యం పదేళ్లు అనుభవించావు. నా బాధను నీకంటే ఎవరు ఎక్కువ అర్ధం చేసుకొంటారు. కొంచెం నా తరఫున ఆలోచించు. ఇప్పడే మీ అత్తగారి వద్దకు వెళ్లి వచ్చాను. సాటి ఆడదాన్ని అర్ధం చేసుకోవడంలో మీకు మీరే సాటి. నన్ను సరిగా అర్ధం చేసుకోమని చెప్పాను. ఈ పగ, కొట్లాటలు మానేసి పాజిటివ్‌గా ఆలోచిద్దాం అంటూ మోనిత సూచించింది.

నెల తప్పిన ఆడదాన్ని

నెల తప్పిన ఆడదాన్ని

అయితే మౌనంగా ఉన్న కార్తీక్‌తో మోనిత మాట్లాడుతూ.. నన్ను పట్టించు కార్తీక్.. నీ పెళ్లాం వైపు చూడకు. ఇక్కడ నెల తప్పిన ఆడది ఉంది. నీ వల్ల కడుపు వచ్చిన కన్నెపిల్ల ఉంది. పెళ్లికాకుండా తలైన అభాగ్యురాలు ఉంది. ముందు నాకు సమాధానం చెప్పు. ఏంటి కార్తీక్.. ఏమీ ఎరుగని అమాయకుడిలా అలా చూస్తున్నావు. నాకు ఏ పాపం తెలియదని పెళ్లాం ముందు మార్కులు కొట్టేయాలనా అంటూ కార్తీక్‌ను నిలదీసింది.

Recommended Video

Race 3 Record Breaking Business At The Domestic Market
కార్తీక్‌పై విరుచుకుపడిన మోనిత

కార్తీక్‌పై విరుచుకుపడిన మోనిత

కార్తీక్‌పై మోనిత విరుచుకుపడుతూ... నికార్సైన మగాడు.. మీసం ఉన్న మగాడివైతే ఇలా బేలగా నిలబడడు. అవును.. నేను చేశాను.. నేను ఆ పని చేశాను. నా వల్లే ఇలా అయిపోయింది. అనుకొని పరిస్థితుల్లో జరిగిపోయింది. అంత వరకే నేను చెప్పగలను. ఇప్పుడు ఏం చేయమంటావో.. ఏ నిర్ణయం తీసుకోంటావో అని అంటాడు. అదీ అంత ధైర్యం, దమ్ము ఉన్నవాడే మొగుడని అంటారు. నిజమైన మగాడు అంటారు అని మోనిత ప్రశ్నల వర్షం కురిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X