Karthika Deepam June 17th Episode: దీప నాకు నువ్వే పురుడు పోయాలి.. కార్తీక్‌కు షాకిచ్చిన మోనిత
కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి డాక్టర్ మోనిత విశ్వరూపం చూపించింది. కార్తీక్ కారణంగా గర్బవతిని అయ్యానని చెప్పి ప్రళయం సృష్టించిన ఆమె.. నేరుగా దీప ఇంట్లో ఉన్న కార్తీక్ వద్దకు వెళ్లింది. నాకు ఏం న్యాయం చేస్తావో ఆలోచించుకో.. నీకు పది రోజులు టైమ్ ఇస్తున్నాను అంటూ డెడ్‌లైన్ పెట్టింది. ఇలా ఎమోషనల్‌గా సాగిన 1068 ఎపిసోడ్ ఇంకా ఏమి జరిగిందంటే...

దీప నీకు భూదేవీకి ఉన్నంత సహనం అంటూ
కార్తీక్‌పై దీప మండిపడుతూ.. ఏంటీ నేను ఇక్కడ మాట్లాడుతుంటే దీప వైపు చూస్తున్నావు. పాపం దీప అమాయకురాలు. తనేం చెబుతుంది. తనేం నిర్ణయం తీసుకోగలదు. ఏం సలహా ఇవ్వగలదు. నిర్ణయం తీసుకోవాల్సి నువ్వు. పురాణాల్లో విన్నామే మహా ప్రతివతలు గురించి.. అలాంటిది దీప. పతియే ప్రత్యక్ష దైవం అని బతికే పాతకాలం మనిషి. భూదేవికి ఉన్న సహనం ఉంది కనుకే.. దశాబ్దకాలం నీ కోసం వెయిట్ చేసింది. పదేళ్లకాలం వెయిట్ చేయడానికి నాకు ఓపిక లేదు అంటూ మోనిత ఏకధాటిగా హెచ్చరికలు ఇస్తూనే ఉంది.

గోడపై గీతలు గీసి పది రోజుల సమయం అంటూ
కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తూ నీకు పది రోజులు.. పదే పది రోజులు టైమ్ ఇస్తున్నాను. పది రోజుల్లో నాకు సమాధానం కావాలి అంటూ గోడపై పది గీతలు గీసింది. మోనిత మాట్లాడుతున్న తీరుపై దీప, కార్తీక్ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. పది గీతలు గీసిన తర్వాత నీకు కేవలం పదే పది రోజులు డెడ్‌లైన్.. ఈ రోజు నీకు ఒక రోజు అయిపోయింది. ఇంకా మిగిలి ఉంది తొమ్మిది రోజులే అంటూ ఒక గీతను కొట్టివేసింది.

న్యాయం జరగకపోతే.. నాకే తెలియదు
కార్తీక్ మరోసారి హెచ్చిరిస్తూ... నీకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ గడువు లోపల నాకు సరైన న్యాయం జరుగకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. కానీ మొత్తం మీ ఫ్యామిలీ గడగడ వణికిపోయేలా చేస్తాను. బీ రెడీ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ మళ్లీ వెనకకు తిరిగి దీపతో మాట్లాడుతూ.. ఎక్కువగా ఆలోచించకు. బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఆరోగ్యంగా బాగా చూసుకో. ఎందుకంటే నాకు పురుడు పోయాల్సింది నీవే. పది మందికి అన్నం పెట్టిన చేయి.. నీ చేతుల్తో పురుడు పోస్తే ఇంకా మంచిది అంటూ బై చెప్పి మోనిత వెళ్లిపోయింది.

గందరగోళంగా కార్తీక్, దీప
మోనిత ఇచ్చిన షాక్‌కు కార్తీక్ మౌనంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. మోనిత వెళ్లిన తర్వాత దీప, కార్తీక్ ఇద్దరూ ఒకరి ముఖంలో ఒకరు చూసుకొన్నారు. ఇక ముందు ఏం చేస్తావు అన్నట్టు దీప చూసింది. ఆ చూపులకు సమాధానం చెప్పలేక కార్తీక్ తలదించుకొన్నాడు. అసలే గందరగోళంగా ఉన్న కార్తీక, దీప మనసుల్లో మోనిత ఇచ్చిన షాక్ మరింత కంగారు పెట్టింది. శ్రావ్య, దీప బయట నుంచి వచ్చి గోడపై మోనిత గీతలు చూసి ఏం గీతలు అయి ఉంటాయనే డిస్కషన్ పెడుతూ కనిపించారు. మ్యాథమెటిక్సా? ఆల్జీబ్రానా అంటూ ప్రశ్నలతో సిద్ధమయ్యారు.
Recommended Video

మోనిత గీతలను చూసి శౌర్య, దీప
శౌర్య, హిమ మాట్లాడుకొంటే దీప, కార్తీక్ ఓ రకమైన ఫీలింగ్‌తో చూస్తూ ఉండిపోయారు. గోడపై ఉన్న అంకెలు లెక్కపెడుతుంటే కార్తీక్ మౌనంగా ఉన్నాడు. రోజులు లెక్కించుకోవడానికి గీతలు గీసి ఉంటారని హిమ అంటే.. అందులో ఒకటి కొట్టివేసి ఉందేమిటీ అంటూ శౌర్య అడిగింది. ఈ గీతలు ఏమిటి నాన్న అని అడిగితే.. నా భవిష్యత్తుకు సంబంధించినవి అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు. ఆ గీతల్లో మన భవిష్యత్ ఉందా అంటే అవును అని కార్తీక్ సమాధానం ఇచ్చారు. మళ్లీ అడిగితే.. మీది, నాది, అమ్మ భవిష్యత్ ఆ గీతలతో ముడిపడి ఉందని జవాబు చెప్పారు. మన చేతిలోని గీతలు చూసి భవిష్యత్ చెబుతారు కదా.. అలాంటిదే ఇది అంటూ మరో ప్రశ్నకు సమాధానం చెప్పాడు. దాంతో నాకే అర్థం కాలేదని హిమ అంటే.. నీకంటే నేను జీనియస్.. నాకే అర్దం కాలేదు అంటూ శౌర్య చెప్పింది.


Click it and Unblock the Notifications











