Karthika Deepam June 18th Episode: అది యాక్సిడెంటల్‌గా: కార్తీక్, అయితే అబార్షన్ చేయించుకోవాలా? మోనిత ఫైర్
కార్తీక దీపం సీరియల్‌లో మోనిత వ్యవహారం రసవత్తరంగా మారింది. నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అని మోనిత చెప్పిన తర్వాత కార్తీక్ జీవితానికి సంబంధించిన విషయాలు తారుమారయ్యాయి. దీప ఇంట్లో ఉన్న కార్తీక్‌కు మోనిత డెడ్‌లైన్ విధించడంతో సీన్ అంతా రివర్సైంది. తనకు 10 రోజులు సమయం ఇచ్చిన మోనిత మాట్లాడేందుకు ఆమె ఇంటికి వెళ్లి కార్తీక షాక్ ఇచ్చారు. కార్తీక్‌ను చూసి ఏంటి కార్తీక్ ఈ సమయంలో వచ్చావు? అంటూ ప్రశ్నించింది. 1608, 1069 ఎపిసోడ్స్‌లో వారి మధ్య ఇలా సాగింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఇది ఒక యాక్సిడెంట్
మోనిత నీవు చేస్తున్న కరెక్ట్ కాదు అని కార్తీక్ అంటే.. ఏ విషయంలో నాకు కూడా క్లారిటీ కావాలి కదా అని దీప సమాధానం ఇచ్చింది. అదే ఇంటికి వచ్చి పది రోజుల గడువు ఇచ్చావు కదా అంటూ కార్తీక్ అంటే.. అందులో తప్పేముంది కార్తీక్.. నా గురించి ఏమీ ఆలోచించలేదు. అసలు పట్టించుకొన్నట్టు కూడా కనిపించలేదు. ఇలాంటి సమయంలో అలాంటి అన్యాయం జరగకూడదని అలా చెప్పాను. దాంతో చూడు మోనిత మన మధ్య జరిగింది.. ఇష్టంతోనో.. ప్రేమతోనో జరిగింది కాదు. అది ఒక యాక్సిడెంట్ అని కార్తీక్ అన్నాడు.

పెళ్లి కాకుండానే తల్లిగా
అయితే కార్తీక్ మాటలకు సమాధానం ఇస్తూ అలా ఎలా ఉండమంటావు. నేను ఒక డాక్టర్ అయినా అందరి మాదిరిగా ఆడపిల్లనే అంటూ మోనిత జవాబిచ్చింది. పెళ్లికాకుండానే తల్లిని అయ్యానంటే అందరి ముందు నా క్యారెక్టర్ ఏం కావాలి. కార్తీక్ అంటే అందరి దృష్టిలో శ్రీరామచంద్రుడు. మరి నేను ఏంటి అని ప్రశ్నించింది. ఇలా చేయవద్దు అంటూ కార్తీక్ అంటే.. నేను చెప్పిన మాటలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు. అందులో నీతి ఉందని ఒప్పుకొని.. నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చిన స్థానం ఇవ్వు అంటూ మోనిత డిమాండ్ చేసింది.

మౌనం అర్ధాంగీకారమా?
దీప మాటలకు నివ్వెర పోయిన కార్తీక్‌ను ప్రశ్నిస్తూ.. నా మాటలకు సమాధానం ఇవ్వు. మౌనం అర్ధాంగీకారం అని ఒప్పుకొంటావా? అని దీప ప్రశ్నిస్తే.. ఇక చాలూ మోనిత.. నేను గత పది సంవత్సరాలుగా నా భార్యను అనుమానించాను. ఇప్పుడది తప్పు అని తెలిసి. ఇప్పుడు ఈ సమయంలో .. అంటూ కార్తీక్ ఏదో చెప్పబోగా.. దీప, నీ కుటుంబ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం అంటూ మోనిత తెగేసి చెప్పింది.

సారీ కార్తీక్.. నా వల్ల కాదు. .
దీప విషయంలో నీ అనుమానం అభిమానంగా మారితే నా తప్పా?.. నాకు జరిగిన దానిని మరిచిపోయి.. నన్ను అబార్షన్ చేయించుకోమంటావా? సారీ కార్తీక్. నావల్ల కాదు. అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే.. నేను అన్యాయం అయిపోతాను. దీప కంటే నేను ముందుగానే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాపై ఎందుకు ప్రేమ కలగడం లేదు అంటూ మోనిత ప్రశ్నల వర్షం కురిపించింది.
Recommended Video

నీ యాక్షన్.. నా రియాక్షన్ అంటూ మోనిత
జరిగిన దానిక కనీసం జాలైనా చూపించు కార్తీక్. అంతకు మించి నీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు. నీ తప్పు లేకున్నా.. జరిగిన దానికి న్యాయం చేయమని కోరుకొంటున్నాను. చూడు కార్తీక్.. త్వరగా నీవు నిర్ణయం తీసుకోకపోతే.. నేనే ఒక నిర్ణయం తీసుకొంటాను. నీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. బాగా ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం చెప్పు. నీ యాక్షన్ బట్టి.. నా రియాక్షన్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











