Karthika Deepam June 19th Episode: మోనిత మరో మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ కాదు అంటూ ప్రియమణి షాక్

బుల్లితెరపై 1000కిపైగా ఎపిసోడ్స్‌తో సాగుతున్న కార్తీక దీపం సీరియల్‌లో దీప, సౌందర్య, మోనిత మధ్య ఇంట్రెస్టింగ్ విషయాలు చోటుచేసుకొన్నాయి. మోనిత అఫెన్స్‌తో దూసుకెళ్తుంటే.. సౌందర్య, దీప, డాక్టర్ కార్తీక్ డిఫెన్స్‌లో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా కలిసిన మోనిత, దీప, సౌందర్య మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. 1070 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే....

పది రోజుల తర్వాత అదే అంటూ మోనిత

పది రోజుల తర్వాత అదే అంటూ మోనిత

కార్తీక్ వల్ల మోనిత ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు ఓ పార్క్‌లో దీప, సౌందర్య కలుసుకొన్నారు. అదే పార్కుకు వచ్చిన మోనిత వారిని చూసి షాక్ అయింది. అయితే అంతకు ముందు తన పనిమనిషి ప్రియమణితో మాట్లాడుతూ.. వచ్చే పది రోజుల్లో తర్వాత ఏం జరగబోతుందో.. ఏం చేయాలని అనుకొంటుందో అనే ప్లాన‌‌్‌ను ప్రియమణికి వివరించింది. దాంతో నీ ప్లాన్ జరగే పని కాదంటూ ప్రియమణి చెప్పడంతో ఆమెను అనుమానంగా మోనిత చూసింది.

అలా జరగదమ్మా అంటూ ప్రియమణి

అలా జరగదమ్మా అంటూ ప్రియమణి

మోనితతో ప్రియమణి మాట్లాడుతూ... అలా జరగదనిపిస్తుందమ్మా అంటే.. ఎందుకు జరగదు.. నేను ఇది వరకు మోనితను కాదు. జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకొంటున్నాను. దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొంటూ హక్కులను, అధికారాలను వినియోగించుకొంటున్నాను అంటుండగా... నీకు వాళ్లు అడ్డుపడ్డారు అని ఎదురుగా ఉన్న దీప, సౌందర్యను ప్రియమణి చూపించింది. దాంతో అవును నాకు అడ్డుపడ్డారు అంటూ మోనిత కోపంతో ఊగిపోయింది.

అత్త, కోడళ్ల సమావేశమేమిటి?

అత్త, కోడళ్ల సమావేశమేమిటి?

తన ఎదురుగా కనిపించిన దీప, సౌందర్యను చూసి షాక్ అయిన మోనిత... రోడ్డు మీద ఈ అత్త, కోడళ్ల మధ్య సమావేశమేంటి? ఏ నిర్ణయాలు తీసుకొన్నా అవి పనిచేయవు అంటూ మోనిత వారి వద్దకు వెళ్లింది. ప్రెగ్నెంట్ కావడంతో వాకింగ్ చేస్తున్నాను అంటూ చెప్పి.. ఓ కాలమా? ఇది నీ గాలమా అంటూ పాట పడుతూ వారిని మరింత ఉడికించే ప్రయత్నం చేసింది. కాలానికి అద్భుతమైన శక్తి ఉంది అని ఉత్సాహంతో చెప్పింది.

కార్తీక్ నన్ను పెళ్లి చేసుకొంటానని..

కార్తీక్ నన్ను పెళ్లి చేసుకొంటానని..

దీపతో మోనిత మాట్లాడుతూ.. నేను మారను మారను చెబుతుంటే.. నీవు విజయనగరానికి వెళ్లడం ఏమిటి? హిమ జాడ చెబితే నేను నిన్ను పెళ్లి చేసుకొంటానని కార్తీక్ నాకు చెప్పడం ఏమిటి? ఆ ఆచూకీ నేను తెలుసుకోవడం ఏమిటి? ఆ వార్త చాటుగా విని నీ వద్దకు పరిగెత్తుకు రావడమేంటి? చావు బతుకుల్లో ఉన్న నిన్ను కార్తీక్ బతికించడం ఏమిటి? ఇన్ని చేసిన కార్తీక్‌కు నీవు ఛీ కొట్టే పరిస్థితి రావడం ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 కాలం మహత్యమే అంటూ మోనిత వేదాంతం

కాలం మహత్యమే అంటూ మోనిత వేదాంతం

ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం మోనిత మహత్యం కాదు... కాలం మహత్యం అంటూ మోనిత తనలో తాను సంబరపడిపోయింది. కాలం, గాలం రెండు మోనిత వైపు ఉన్నాయి. కార్తీక్ నేను గడువు విధించాను అంటూ ఏదో చెప్పబోగా.. అంతా చెప్పేశాడు అని సౌందర్య ముక్తసరిగిగా జవాబిచ్చింది. దాంతో ఏం జరిగిని చిన్నపిల్లాడిలా మొత్తం చెబుతాడనే విషయం తెలుసు. ఇంతా జరిగినా మీ కొంగు వదల్లేదన్న మాట.. కార్తీక్ మంచి వాడు.. ఎదిగే కొద్ది ఒదిగుతాడు. అందుకే కార్తీక్ అంటే నాకు అంత ఇష్టం. వస్తాను అంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X